mAadhaar Profile : Do you know how to create your profile in this Aadhaar app? Here is the simple process!
mAadhaar Profile : ఈ ఆధార్ యాప్‌లో మీ ప్రొఫైల్ ఎలా క్రియేట్ చేయాలో తెలుసా? ఇదిగో సింపుల్ ప్రాసెస్!
mAadhaar Profile : యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) వినియోగదారుల కోసం అనేక ఆన్‌లైన్, మొబైల్ సర్వీసులను ప్రవేశపెట్టింది. అలాంటి సర్వీసులో ఒకటి ఎంఆధార్ (How to create mAadhaar Profile) యాప్. వ్యాలీడ్ అయ్యే ఐడెంటిటీ ప్రూఫ్‌గా మాత్రమే కాకుండా మీ స్మార్ట్‌ఫోన్‌లో 35 కన్నా ఎక్కువ ఆధార్ సర్వీసులను అందిస్తుంది. mAadhaar ద్వారా మీ ఆధార్ ప్రొఫైల్‌ను సౌకర్యవంతంగా యాక్సెస్ చేయవచ్చు.
అంతేకాదు.. భారత్‌లో వివిధ బెనిఫిట్స్ కోసం ఉపయోగించవచ్చు. మీరు విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్‌లలో మీ ఐడెంటిటీని నిరూపించుకోవాల్సిన అవసరం ఉన్నా లేదా సర్వీస్ ప్రొవైడర్‌లతో మీ eKYC సమాచారాన్ని షేర్ చేయాల్సిన అవసరం ఉన్నా mAadhaar యాప్ ద్వారా పూర్తి చేసుకోవచ్చు. అయితే, మీ పేరు, పుట్టిన తేదీ, మొబైల్ నంబర్ వంటి జనాభా వివరాలను అప్‌డేట్ చేసేందుకు mAadhaar మిమ్మల్ని అనుమతించదని గమనించాలి.
మీ ఆధార్ ప్రొఫైల్‌ను క్రియేట్ చేయాలంటే? :
* మీ Android లేదా iOS డివైజ్‌లో mAadhaar యాప్‌ని డౌన్‌లోడ్ చేసి, ఇన్‌స్టాల్ చేయండి.
* mAadhaar యాప్‌ని ఓపెన్ చేయండి.
* ప్రధాన డ్యాష్‌బోర్డ్‌లో, ఎగువన ఉన్న రిజిస్టర్ ఆధార్ ట్యాబ్‌పై Tap చేయండి.
* 4-అంకెల PIN లేదా పాస్‌వర్డ్‌ను క్రియేట్ చేయండి. (మీ ప్రొఫైల్‌ని యాక్సెస్ చేసేందుకు అవసరం)
* మీ వ్యాలీడ్ అయ్యే ఆధార్ నంబర్, కనిపించే క్యాప్చాను ఎంటర్ చేయండి.
* మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు OTP (వన్-టైమ్ పాస్‌వర్డ్) అందుకుంటారు. OTPని ఎంటర్ చేసి Submit చేయండి.
* మీ ప్రొఫైల్ ఇప్పుడు రిజిస్టర్ అయి ఉంటే.. మీ రిజిస్టర్డ్ ఆధార్ పేరును ఇప్పుడు చూడవచ్చు.
* మీ ఆధార్ ప్రొఫైల్‌ను యాక్సెస్ చేయడానికి, కింది మెనూలో ఉన్న ‘My Aadhaar’ ట్యాబ్‌పై నొక్కండి.
* మీరు ఇంతకు ముందు క్రియేట్ చేసిన 4-అంకెల PIN లేదా పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేయండి.
* మీ My aadhaar డ్యాష్‌బోర్డ్ కనిపిస్తుంది.
* మీ ఆధార్ వివరాలను వీక్షించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది.
మొబైల్ నెంబర్ లింక్ తప్పనిసరి కాదు :
మీ ఫొటో, పేరు, ఆధార్ నంబర్‌తో మీ పూర్తి ఆధార్ ప్రొఫైల్‌ను యాక్సెస్ చేయవచ్చు. ఎగువన ఉన్న ప్రొఫైల్ సమ్మరీని నొక్కండి. మీ ఆధార్ కార్డ్ ముందు, బ్యాక్ చూసేందుకు ఎడమవైపుకు స్వైప్ చేయండి. అదనపు ప్రొఫైల్‌లను యాక్సెస్ చేయడానికి మళ్లీ ఎడమవైపుకు స్వైప్ చేయండి. యాప్ సర్వీసుల కోసం.. డ్యాష్‌బోర్డ్ దిగువన ఉన్న ‘My Aadhaar’ ట్యాబ్‌పై నొక్కండి.
mAadhaar Profile యాప్‌ని ఉపయోగించడానికి మీ ఆధార్ కార్డ్‌కి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌ని లింక్ చేయడం తప్పనిసరి కాదని గమనించడం ముఖ్యం. భారత్‌లో స్మార్ట్‌ఫోన్ ఉన్న ఎవరైనా యాప్‌ని ఇన్‌స్టాల్ చేసి ఉపయోగించవచ్చు. అయితే, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ లేకుండా, మీరు ఆర్డర్ ఆధార్ రీప్రింట్, ఎన్‌రోల్‌మెంట్ సెంటర్‌ను గుర్తించడం, ఆధార్‌ని ధృవీకరించడం, QR కోడ్‌లను స్కాన్ చేయడం వంటి సర్వీసులకు లిమిటెడ్ యాక్సస్ పొందవచ్చు.
COMMENTS