If you change according to the times.. earning money is very easy. Cash money with this business..
కాలానికి అనుగుణంగా మారితే.. డబ్బు సంపాదన చాలా ఈజీ. ఈ బిజినెస్‌తో డబ్బే డబ్బు..
Business Ideas: మారుతోన్న కాలానికి అనుగుణంగా మనమూ మారితే డబ్బు సంపాదన పెద్ద విషయం కాదనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రజల అవసరాన్ని, అప్పటి మార్కెట్‌ను అంచనా వేసి వ్యాపారం మొదలు పెడితే.. నష్టాలు అనేవి ఉండవు. అలాంటి ఓ మంచి బిజినెస్ ఐడియా గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రస్తుతం ఈ కామర్స్ సైట్స్ హవా పెరుగుతోంది. పట్టణాలు మొదలు పల్లెల వరకు అంతా ఆన్‌లైన్‌లో షాపింగ్ చేసేస్తున్నారు. దీంతో ఆన్‌లైన్ డెలరీలు విపరీతం పెరుగుతున్నాయి. వస్తువులను డెలివరీ చేసే కంపెనీలతో పాటు డెలివరీ ఉపయోగించే కార్డ్‌బోర్డ్ బాక్సుల వినియోగం కూడా భారీగా పెరిగింది. దీంతో సహజంగానే కార్డ్‌బోర్డ్‌లకు డిమాండ్ పెరిగింది. దీంతో వీటి తయారీ వ్యాపారంలోకి ఇటీవల చాలా మంది దిగుతున్నారు. తక్కువ ఖర్చుతో నష్టాలు లేని వ్యాపారం కావడం దీని విశేషం. ఇంతకీ ఈ వ్యాపారిన్ని ఎలా ప్రారంభించాలి.? ఇందుకోసం అయ్యే ఖర్చు ఎంత.? ఎంత వరకు ఆదాయం పొందొచ్చు.? లాంటి పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి..
ఇక కార్డ్‌బోర్డ్‌ల వ్యాపారాన్ని ప్రారంభించే ముందు దానికి సంబంధించిన కొన్ని విషయాలను తెలుసుకోవాలి. ఇందుకోసం కొన్ని సంస్థలు కోర్సులు కూడా అందిస్తున్నాయి. 3,6,12 నెలల కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఈ కోర్సు ద్వారా వ్యాపారం లక్షణం, వ్యాపారంలో లాభ, నష్టాల గురించి ఓ అంచనాకు రావొచ్చు. ఇక కాటన్ బాక్స్‌లను తయారు చేసే ఫ్యాక్టరీని ప్రారంభించేందుకు సుమారు 5,500 చదరపు అడుగుల స్థలం అవసరం ఉంటుంది. ఈ ఫ్యాక్టరీని ప్రారంభించే ముందు ఎస్‌ఎస్‌మీలో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా చేస్తే ప్రభుత్వం నుంచి అందే రుణాలను సులభంగా పొందొచ్చు. వీటితో పాటు ఫ్యాక్టరీ లైసెన్స్, పొల్యుషన్ సర్టిఫికేట్, జీఎస్‌టీ రిజిస్ట్రేషన్ ఉండాల్సి ఉంటుంది.
ఇదిలా ఉంటే ఈ ఫ్యాక్టరీని ప్రారంభంచేందుకు సెమీ ఆటోమేటిక్ మిషన్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం రూ. 20 లక్షల వరకు పెట్టుబడి అవసరం ఉంటుంది. కాటన్ బాక్స్‌ల తయారీకి క్రాఫ్ట్ పేపర్‌తోపాటు మిషన్ అవసరపడుతుంది. ఇందుకోసం సింగిల్ ఫేస్ పేపర్ కార్గేషన్ మిషన్, రీల్ స్టాండ్ లైట్ మోడల్‌తో కూడిన బోర్డ్ కట్టర్, షీట్ పేస్టింగ్ మిషన్, షీట్ ప్రెస్సింగ్ మిషన్, ఎక్సెంట్రిక్ స్లాట్ మిషన్‌లు కావాల్సి ఉంటుంది. ఈ కామర్స్ సైట్స్ లేదా కిరాణా వస్తువుల తయారీ కంపెనీలతో ఒప్పందం చేసుకుంటే కాటన్ బాక్స్‌లకు మంచి గిరాకీ ఉంటుంది. డిమాండ్‌కు అనుగుణంగా ఈ బిజినెస్ నెలకు రూ. లక్షల్లో సంపాదించుకోవచ్చు.
నోట్: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు అందించనది మాత్రమే. వ్యాపారాన్ని ప్రారంభించే ముందు లాభా, నష్టాలను అంచనవేయడానికి అంతకుముందు ఇదే వ్యాపారాన్ని నడిపిస్తున్న వారిని నేరుగా కలిసి అభిప్రాయాన్ని తీసుకోవడం మంచిది.
COMMENTS