Gold: Do you know how much gold a person can have? If you don't get a receipt after buying gold, you're done
Gold: ఒక వ్యక్తి వద్ద ఎంత బంగారం ఉండొచ్చో తెలుసా ? బంగారం కొన్నాక రసీదు దాయకపోతే మీరు అయిపోయారు.
Gold: బంగారాన్ని ఇష్టపడనివారు ఉండరు. ధన త్రయోదశి, మార్గశిరమాసం అంటూ, వివాహం, పుట్టినరోజు అంటూ అనేక సిచ్యువేషన్స్ లో బంగారం కొంటూనే ఉంటారు. నిరుపేద నుంచి కోట్లకు పడగలెత్తిన వారు కూడా గోల్డ్ ని బాగా ఇష్టపడుతుంటారు. అందుకే రోజురోజుకు గోల్డ్ వాల్యూ కొండెక్కి కూర్చుంటుంది. కొందరు అదే పనిగా ఎక్కువ బంగారం కొంటుంటారు. అవసరానికి మించి ఆభరణాలు ధరిస్తుంటారు. అయితే మన దేశంలో ఒక్కొక్క వ్యక్తి ఎంత బంగారం కలిగి ఉండాలి అనేది మనలో చాలా మందికి అవగాహన ఉండకపోవచ్చు. అలాంటి వారికి అవగాహన కలిగించేందుకే ఈ ఆర్టికల్. పరిమితికి మించి బంగారం కలిగి ఉండడం వల్ల ఎలాంటి ఎఫెక్ట్ కలుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
మన దేశంలో ఇప్పటికే బంగారం పరిమితి నియంత్రణ చట్టాన్ని రద్దు చేయడం జరిగింది. అందువల్ల బంగారానికి సంబంధించి ఇంత మాత్రమే ఉండాలని ఎటువంటి కండిషన్స్ కూడా లేవు. ఒక సర్వే ప్రకారం సెంట్రల్ బోర్డ్ అఫ్ డైరెక్ట్ టాక్సెస్.. గోల్డ్ పై ఒక వ్యక్తి దగ్గర ఎంత ఉండాలి అనే పరిమితిని తీసుకువచ్చింది. ఈ రూల్స్ ప్రకారం ఫ్యామిలీలోని ప్రతి ఒక పురుషుడు వద్ద 100 గ్రాముల వరకు బంగారాన్ని వాళ్లతో ఉంచుకోవచ్చు. అదే విధంగా పెళ్లి అయిన స్త్రీ అయితే 500 గ్రాముల, పెళ్లి కాని వాళ్ళు 250 గ్రాముల బంగారు ఆభరణాలు కలిగి ఉండొచ్చని నిర్ణయించింది. ఈ CBDT రూల్స్ ప్రకారం పరిమితిని మించి బంగారం ఉండకూడదా..? అనే డౌట్ కూడా అందరిలో ఉంటుంది.
ప్రతి వ్యక్తి ఇచ్చిన పరిమితి కన్నా ఎక్కువ బంగారం కలిగి ఉండొచ్చు. అయితే ఇది బంగారం పై గల ఈ పరిమితి ఆదాయ పన్ను లెక్కింపు కోసం మాత్రమే. పరిమితికి మించిన బంగారం ఉంటే దానికి సంబంధించిన రసీదులు వంటివి జాగ్రత్త చేసుకోవాల్సి ఉంటుంది. ఒక వేళ ఇన్కమ్ టాక్స్ రైడ్ జరిగినప్పుడు బంగార అభరణాలకు సంబంధించిన రసీదులు చూపించటం వలన వాటిని జప్తు చేయకుండ వదిలేస్తారు. అదే విధంగా కొందరికి తాత ముత్తాతల నుంచి కానుకగా బంగారు ఆభరణాలు సంక్రమిస్తాయి. ఇలాంటి వారు సరైన ప్రూఫ్స్ తో కూడిన వీలునామాను చూపటం ద్వారా మీ బంగారాన్ని జప్తు చేయలేరు. ఇలా సరైన ఆధారాలని చూపించటం ద్వారా మన బంగారం గురించి భయపడాల్సిన అవసరం లేదు. ధైర్యంగా ఉండొచ్చు.
COMMENTS