Does daughter have share in father's property? No?
తండ్రి ఆస్తిలో కూతురికి వాటా ఉంటుందా? ఉండదా?….
మనదేశంలో ఆస్తి వివాదాలు కుటుంబ సంబంధాలను ప్రభావితం చేయడమే కాక, రకరకాల కొత్త సమస్యలను సృష్టిస్తుంటాయి. ఈ ఆస్తి వివాదాలు ప్రత్యేకంగా తల్లిదండ్రులు,కొడుకుల మధ్య జఠిల సమస్యలను సృష్టిస్తూ వివాదాస్పద నిర్ణయాలు తీసుకునేలా చేస్తుంటాయి. దాదాపుగా ప్రతి కుటుంబంలో ఆస్తి తగాదాలు నిత్యం ఏదో ఒక రూపంలో జరుగుతూనే ఉంటాయి. ఆస్తి సమస్యలకు పరిష్కారం దొరకాలంటే చట్టపరమైన నిబంధనలను కచ్చితంగా తెలుసుకుని తీరాలి.
తల్లిదండ్రులు తమ ఆస్తిని పిల్లల పేరు పైన రిజిస్టర్ చేయలేక పోయినప్పుడు కొడుకులు, కుమార్తెలమధ్య తీవ్రమైన విభేదాలు తలెత్తుతూ ఉంటాయి. అందుకనే 1956 నుండి 2005 వరకు ఉన్న హిందూ వారసత్వ చట్టంలోని చట్టపరమైన నియమ నిబంధనలు తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎందుకంటే ఆడపిల్లలకు కూడా మగ పిల్లల మాదిరిగానే వారసత్వ ఆస్తిపై సమాన హక్కులను హిందూ వారసత్వ చట్టం ఇస్తుంది.
ఈ చట్టం ప్రకారం కొడుకులకు,కూతుర్లకు తమ తండ్రి ఆస్తిలో సమానమైన హక్కులను పొందడానికి అర్హులుగా చెబుతుంది. జీవించి ఉండగానే మనవళ్లకు తండ్రి తన ఆస్తిని బదిలీ చేస్తే ,కూతురు ఆ ఆస్తిపై ఉన్న హక్కును కోల్పోతుంది. అయితే ఆస్తిని ఇతరులకు బదిలీ చేసిన తర్వాత తండ్రి మరణిస్తే, కుమార్తె తనకు రావాల్సిన వాటా కోసం చట్టబద్ధంగా పోరాడవచ్చు.
హిందూ కుటుంబాలలో ఆస్తిని రెండు భాగాలుగా విభజించారు….
హిందూ కుటుంబాలలో ఆస్తిని రెండు భాగాలుగా వర్గీకరించారు. మొదటిది బహుమతి పొందిన ఆస్తికాగా రెండవది స్వీయ ఆర్జిత ఆస్తిగా పరిగణిస్తారు. కూతురు తన తండ్రి వారసత్వ ఆస్తిలో హక్కులను కలిగి ఉన్నప్పటికీ, స్వీయ ఆర్జిత ఆస్తిలో కూతురు వాటా తక్కువగా ఉండవచ్చు. అంతేకాకుండా ఆస్తిని ఎవరికైనా బదిలీ చేసే అధికారం తండ్రికి ఉంటుంది. తండ్రి నిర్ణయించుకుంటే తన కుమార్తెతో పంచుకోకుండా, తనకు ఇష్టమైన వారితో ఆస్తిని పంచుకునే విచక్షణ తండ్రికి ఉంటుంది. చట్టం కూడా ఈ విషయంలో జోక్యం చేసుకోదు.
వీలునామా రాయకపోతే ఆస్తి ఎవరికి చెందుతుంది: ఒకవేళ తండ్రి తన ఆస్తి గ్రహీతలను తెలపని పక్షంలో ఆస్తులపై అధికారం కుటుంబంలోని వివిధ సభ్యుల మధ్య విభజింపబడుతుంది. అంతేకాకుండా ఆస్తులు వివరాలను తెలిపే వీలునామా లేనట్లయితే ఆస్తి భార్య, పిల్లలు, తల్లి మరియు మొదటి తరగతి కుటుంబ సభ్యుల మధ్య సమాన పద్ధతిలో పంచబడుతుంది.
తన కూతురును ఆస్తి పంపకంలో చేర్చకూడదని తండ్రి అనుకున్న సందర్భంలో, ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించే చట్టపరమైన హక్కు కూడా కూతురుకు లేదు, అంతేకాకుండా తండ్రి నిర్ణయాన్ని సవాలు చేసే హక్కు కూడా ఆమెకు లేదు.
COMMENTS