Dasara Festival 2023 Date : When is Dasara Festival? On which day of 23rd and 24th should it be held?
Dasara Festival 2023 Date : దసరా పండుగ ఎప్పుడు? 23, 24వ తేదీల్లో ఏ రోజున నిర్వహించుకోవాలి?
దుర్గా దేవి:
దసరా పండుగ తేదీపై చాలా మందికి అనుమానాలు ఉన్నాయి. అక్టోబర్ 23వ తేదీన అని కొందరు, లేదు లేదు.. అక్టోబర్ 24వ తేదీన అని మరికొందరు అయోమయంలో ఉన్నారు. దీనిపై సస్పెన్స్ కొనసాగుతోంది. అధర్మంపై ధర్మం, అసత్యంపై సత్యం గెలిచిన కారణంగా దసరా జరుపుకొంటారు. ఈ పండగ ఎప్పుడు అనేదానిపై జనాల్లో క్లారిటీ లేదు.
ప్రతీ ఏటా ఆశ్వయుజ మాసం శుద్ధ దశమి రోజున విజయదశమి నిర్వహిస్తారు. పురాణాల ప్రకారం.. విజయదశమి రోజున దుర్గామాత మహిషాసురుడిని వధించినట్టుగా చెబుతారు. మరో కథ కూడా ఉంది.. దసరా రోజునే రావణుడిని రాముడు సంహరించినట్టుగా అంటారు.
అయితే విజయదశమి పండుగకు దశమితో కూడిన శ్రవణా నక్షత్రం కూడా కావాలి. ఈ శ్రవణ నక్షత్రం సమయంలోనే శమీ పూజ చేస్తారు. శవణా నక్షత్రం 22వ తేదీన ఆదివారం సాయంత్రం 3.35 గంటలకు మెుదలై.. తెల్లారి అంటే.. సోమవారం 23వ తేదీ సాయంత్రం 3.35 నిమిషాల వరకూ ఉంటుందని కొందరు పండితులు చెప్పేమాట. మంగళవారం నాడు ధనిష్ట నక్షత్రం వస్తుంది. ఈరోజు విజయ దశమి పండుగకు విరుద్ధమని పండితులు అంటున్నారు.
ఈ సమయంలో శ్రవణా నక్షత్రంతో దశమి కూడితే అది విజయదశమి అవుతుందని పండితులు చెబుతున్నారు. దశమితో శ్రవణ నక్షత్రం కూడినందున తేదీ 23 -10- 2023 సోమవారం రోజు దసరా పండుగ,శమీ పూజ జరుపుకోవాల్సిన ఆవశ్యకత ఉందని అంటున్నారు.
ముఖ్యమైన ఆలయాల్లోనూ విజయదశమి శమీ పూజ సోమవారం నాడే నిర్వహిస్తున్నారు. పంచాంగ కర్తలు సైతం విజయదశమి అక్టోబర్ 23 సోమవారం జరుపుకోవాలని నిర్ణయించినారు. ఈ కారణంగా 23వ తేది సోమవారం దసరా పండుగ జరుపుకొంటేనే మంచిదని వారి అభిప్రాయం.
అయితే మరో విషయం ఏంటంటే.. పంచాంగం ప్రకారం అశ్వయుజ శుక్ల పక్ష దశమి తిథి సోమవారం, అక్టోబర్ 23వ తేదీ సాయంత్రం 5.44 గంటలకు మెుదలవుతుంది. మంగళవారం అక్టోబర్ 24 మధ్యాహ్నం 3:14 గంటలకు ముగుస్తుంది. రెండు రోజులు దశమి తిథి ఉండడంతో దసరాపై సందిగ్ధత నెలకొంది. కొందరు మాత్రం.. 24వ తేదీ దసరా.., అంటున్నారు. మరికొందరు పండితులేమో.. 24వ తేదీన విజయదశమి జరుపుకోవాలని చెబుతున్నారు.
COMMENTS