City Union Bank Recruitment : Filling up of posts in City Union Bank.
City Union Bank Recruitment : సిటీ యూనియన్ బ్యాంక్ లో పోస్టుల భర్తీ.
City Union Bank Recruitment : వివిధ రాష్ట్రాల్లోని సిటీ యూనియన్ బ్యాంక్ శాఖల్లో ఖాళీల భర్తీ చేపట్టనున్నారు. ఈనోటిఫికేషన్ ద్వారా బ్రాంచ్ మేనేజర్ (స్కేల్ I, II, III), డిప్యూటీ మేనేజర్ (స్కేల్ I, II, III) అసిస్టెంట్ మేనేజర్, బ్రాంచి డెవలప్‌మెంట్ మేనేజర్ పోస్టులను బర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి డిగ్రీ, పీజీ అర్హతతోపాటు, సంబంధిత విభాగాల్లో అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. జేఏఐఐబీ/ సీఏఐఐబీ అర్హత ఉన్నవారికి ప్రాధాన్యతనిస్తారు. నిబంధనల ప్రకారం పని అనుభవం ఉండాలి. 24 నుంచి 30 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. ఎంపిక విధానం విషయానికి వస్తే అర్హతలు, అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
అభ్యర్ధులు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అక్టోబరు 31లోగా దరఖాస్తు చేస్తుకోవాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://www.cityunionbank.com పరిశీలించగలరు.
దరఖాస్తు విధానం :
స్టెఫ్ 1:- సిటీ యూనియన్ బ్యాంక్‌కేరీర్ పేజీ @ https://www.cityunionbank.com/web-page/careersలోకి ప్రవేశించాలి.
స్టెప్ 2:- సిటీ యూనియన్ బ్యాంక్‌లో ప్రస్తుతం ప్రకటించిన ఉద్యోగ అవకాశాలపై క్లిక్ చేయాలి.
స్టెప్ 3:- మన అర్హతకు సంబంధించిన ఉద్యోగ నోటిఫికేషన్ పై క్లిక్ చేయాలి.
స్టెప్ 4:- అర్హత ప్రమాణాలు, కీలక బాధ్యతలను జాగ్రత్తగా పరిశీలించాలి.
స్టెప్ 5:- ఉద్యోగం కోసం దరఖాస్తు చేయడానికి అవసరమైన అనుభవం తదితర వివరాలు చూసుకోవాలి.
స్టెప్ 6: అనంతరం దరఖాస్తుకు సంబంధించిన బటన్‌ను క్లిక్ చేయాలి.
స్టెప్ 7:- ఏ జాబ్ కు దరఖాస్తు చేయాలనుకుంటున్నారో దానిపై క్లిక్ చేయాలి.
స్టెప్ 8:- దీంతో లాగిన్ పేజీ ఓపెన్ అవుతుంది. అందులో అంతకు ముందే మీకు లాగిన్ అయి ఉంటే, పేరు మరియు పాస్‌వర్డ్‌ను నమోదు చేయాలి. లేదంటే కొత్త లాగిన్ క్రియేట్ చేయాలి.
స్టెప్ 9:- తరువాత మీ పేరు, తండ్రి పేరు, చిరునామా, మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్ IDని నమోదు చేయాలి. అలాగే, మీ రెజ్యూమ్‌ని అప్‌లోడ్ చేసి సబ్ మిట్ చేయాలి.
Important Links:
FOR NOTIFICATION CLICKHERE.
FOR APPLY CLICKHERE.
COMMENTS