BEL Recruitment: 232 Probationary Engineer, Probationary Officer Posts in Bharat Electronics Limited.
BEL Recruitment: భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో 232 ప్రొబేషనరీ ఇంజినీర్, ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులు.
భారత రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని 'భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్', దేశవ్యాప్తంగా ఉన్న యూనిట్లు/కార్యాలయాల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 232 ప్రొబేషనరీ ఇంజినీర్, ప్రొబేషనరీ ఆఫీసర్,
ప్రొబేషనరీ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులను భర్తీచేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైనవారు బెంగళూరు, ఘజియాబాద్, పుణె, హైదరాబాద్, చెన్నై, మచిలీపట్నం, పంచకుల, కోట్‌ద్వారా, నవీ ముంబయిలో విధిగా పనిచేయాల్సి ఉంటుంది.
వివరాలు..
* ఖాళీల సంఖ్య: 232.
పోస్టుల కేటాయింపు: జనరల్-96, ఓబీసీ-62, ఎస్సీ-34, ఎస్టీ-17, ఈడబ్ల్యూఎస్-23.
➥ ప్రొబేషనరీ ఇంజినీర్: 205 పోస్టులు
అర్హత: బీఈ/ బీటెక్/ బీఎస్సీ (ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్/ మెకానికల్/ కంప్యూటర్ సైన్స్).
వయోపరిమితి: 01.09.2023 నాటికి 25 సంవత్సరాలకు మించకూడదు.
➥ ప్రొబేషనరీ ఆఫీసర్ (హెచ్‌ఆర్): 12 పోస్టులు
అర్హత: ఎంబీఏ/ ఎంఎస్‌డబ్ల్యూ/ పీజీ/ పీజీ డిప్లొమా(హ్యూమన్ రిసోర్సెస్ మేనేజ్‌మెంట్(HRM)/ఇండస్ట్రియల్ రిలేషన్స్/ పర్సనల్ మేనేజ్‌మెంట్).
వయోపరిమితి: 01.09.2023 నాటికి 25 సంవత్సరాలకు మించకూడదు.
➥ ప్రొబేషనరీ అకౌంట్స్ ఆఫీసర్: 15 పోస్టులు
అర్హత: సీఏ/ సీఎంఏ ఫైనల్ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 01.09.2023 నాటికి 30 సంవత్సరాలకు మించకూడదు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు
దరఖాస్తు ఫీజు: రూ.1180. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది.
జీతభత్యాలు: నెలకు రూ.40,000-రూ.1,40,000. ఇతర భత్యాలు ఉంటాయి.
ముఖ్యమైన తేదీలు...
➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 04.10.2023.
➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 28.10.2023.
➥ కంప్యూటర్ ఆధారిత పరీక్షతేది: డిసెంబర్ 2023.
Important Links:
FOR NOTIFICATION CLICKHERE.
FOR WEBSITE CLICKHERE.
COMMENTS