AI Company: Business in crores at the age of 16..Indian girl's success in tech world.
AI Company: 16ఏళ్ల వయసులోనే కోట్లలో వ్యాపారం..టెక్కీ ప్రపంచంలో భారతీయ యువతి విజయం.
చిన్న వయసులోనే కంప్యూటర్ కోడింగ్ చేసిన, గేమ్‌లు డిజైన్ చేసిన పిల్లల గురించి వినే ఉంటారు. ప్రతిభ చూపాలే గానీ టెక్ ఇండస్ట్రీలో వయసుతో సంబంధం లేకుండా అవకాశాలు వస్తాయి. ఇప్పుడు మన దేశానికి చెందిన ఓ పదహారేళ్ల బాలిక స్టార్టప్ కంపెనీని స్టార్ట్ చేసి టెక్ ప్రపంచాన్ని ఆశ్చర్యరుస్తోంది. ఆమె పేరు ప్రాంజలి అవస్థి(Pranjali Awasthi). ఆమె స్టార్ట్ చేసిన AI స్టార్టప్ పేరు Delv.AI. ఇటీవల మియామి టెక్ వీక్ ఈవెంట్‌లో ప్రాంజలి తన కంపెనీ వివరాలను వెల్లడించింది.
టెక్నాలజీలో మనవాళ్లు..
ప్రాంజలి 2022 జనవరిలో తన కంపెనీని స్థాపించింది. దాదాపు రూ.3.7 కోట్ల ఫండ్స్‌ని సమీకరించింది. ఇప్పుడు Delv.AI లింక్డ్ఇన్ ప్రొఫైల్‌లో కంపెనీలో 10 మంది ఉద్యోగులు పని చేస్తున్నట్లు కనిపిస్తుంది. తన ఎంటర్‌ప్రెన్యూరల్ జర్నీని ప్రారంభించడానికి తన తండ్రినే ఆదర్శంగా తీసుకున్నానని ప్రాంజలి వివరించింది.
చిన్నప్పటి నుంచి తండ్రి ప్రోత్సాహం..
ప్రాంజలికి చిన్న వయసులోనే టెక్నాలజీపై ఆసక్తి పెరిగింది. ఆమె తండ్రి ఇంజనీర్, అంతే కాకుండా పాఠశాలల్లోనే కంప్యూటర్ సైన్స్ ఎడ్యుకేషన్ ఉండాలని బలంగా నమ్ముతారు. తండ్రి ప్రోత్సాహంతో ప్రాంజలి ఏడేళ్ల వయస్సులో కోడింగ్ చేయడం ప్రారంభించింది. ఆ వయసులోనే తన ఎక్స్‌ట్రార్డినరీ జర్నీకి అడుగులు పడ్డాయి. ఆమెకు 11 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు, కుటుంబం ఫ్లోరిడాకు షిష్ట్ అయింది. దీంతో ఆమెకు మరిన్ని అవకాశాలు లభించాయి.
13ఏళ్లకే బలమైన పునాది..
ప్రాంజలికి కంప్యూటర్ సైన్స్ క్లాస్‌లు, కాంపిటీటిట్ మ్యాథ్ గణిత ప్రోగ్రామ్‌లు తీసుకునే అవకాశం లభించింది. అయితే ఆమె 13 సంవత్సరాల వయస్సులో ఫ్లోరిడా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ రీసెర్చ్ ల్యాబ్‌లలో ఇంటర్న్‌షిప్ జాయిన్ అయింది. అదే ఆమె ఎంటర్‌ప్రెన్యూరల్ జర్నీకి బలమైన వేదికగా మారింది.
ఇంటర్న్‌షిప్‌తో మలుపు..
ఈ ఇంటర్న్‌షిప్ సమయంలో, మహమ్మారి కారణంగా వర్చువల్ హైస్కూల్‌లో చదువుతున్నప్పుడు ప్రాంజలి మెషీన్ లెర్నింగ్ ప్రాజెక్ట్‌లలో మునిగిపోయింది. ఈ సమయంలోనే OpenAI ChatGPT-3 బీటాను రిలీజ్ చేసింది. అప్పుడే ప్రాంజలికి రీసెర్చ్ డేటా ఎక్స్‌ట్రాక్షన్, సమ్మరైజేషన్‌కి AIని ఉపయోగించాలనే ఆలోచన వచ్చింది. ఇలా Delv.AI కంపెనీ పుట్టింది. ప్రాంజలి డేటా ఎక్స్‌ట్రాన్ ప్రాసెస్‌లను మెరుగుపరచడానికి, డేటా సిలోస్‌ను ఎలిమినేట్ చేయడానికి మెషిన్ లెర్నింగ్‌ను ఉపయోగించాలనే లక్ష్యంతో ఉంది.
చదువుకు తాత్కాలికంగా బ్రేక్..
బ్యాకెండ్ క్యాపిటల్‌కు చెందిన లూసీ గువో, డేవ్ ఫాంటెనోట్ నేతృత్వంలోని మయామిలోని AI స్టార్టప్ యాక్సిలరేటర్‌లో చేరినప్పుడు ప్రాంజలి ప్రయాణం కీలక దశకు చేరుకుంది. ప్రోగ్రాంలో భాగం కావడానికి ప్రాంజలి అంగీకరించడం, ఆమె కలలను సాకారం చేసుకోవడంలో ఆమె నిబద్ధతను సూచిస్తుంది. ప్రస్తుతానికి తాత్కాలికంగా ఆమె హైస్కూల్‌ను వదిలిపెట్టింది. సాఫ్ట్‌వేర్‌ను షేర్ చేసుకోవడంలో సహాయపడే ప్లాట్‌ఫారమ్ అయిన ప్రోడక్ట్ హంట్‌లో Delv.AI బీటా లాంచ్ అద్భుతమైన విజయాన్ని సాధించిందని ఆమె వెల్లడించింది.
రూ.12 కోట్ల విలువ..!
ఎప్పటికప్పుడు విస్తరిస్తున్న ఆన్‌లైన్ కంటెంట్ మధ్యలో నిర్దిష్ట సమాచారాన్ని సమర్థవంతంగా యాక్సెస్ చేయడంలో పరిశోధకులకు సహాయం చేయడమే Delv.AI ప్రాథమిక లక్ష్యం అని ప్రాంజలి తెలిపింది. ఆన్ డెక్, విలేజ్ గ్లోబల్ నుంచి ప్రాంజలి పెట్టుబడులను సురక్షితం చేయడంలో యాక్సిలరేటర్ ప్రోగ్రామ్ కీలక పాత్ర పోషించింది. మొత్తంగా Delv.AI $450,000 (సుమారు రూ. 3.7 కోట్లు) నిధులను సేకరించింది. ప్రస్తుతం $12 మిలియన్ల(దాదాపు రూ.12 కోట్లు) అంచనా విలువను కలిగి ఉంది.
పేరెంట్స్‌కి పేరు తెస్తున్న ప్రాంజలి ..
ప్రాంజలి తల్లిదండ్రులు చదువు ముఖ్యమని భావిస్తున్నా, ప్రాంజలి మాత్రం తన బాధ్యతలు, వృద్ది చెందుతున్న సంస్థకే సమయం కేటాయిస్తోంది. ప్రస్తుతానికి కాలేజీ ఎడ్యుకేషన్ వాయిదా వేయాలని నిర్ణయించుకుంది. అయితే తన ఎంటర్‌ప్రెన్యూరల్ జర్నీకి ప్రయోజనం చేకూర్చే వ్యాపార నైపుణ్యాలను సంపాదించడానికి భవిష్యత్తులో ఉన్నత విద్య చదవాలని ప్రాంజలి భావిస్తోంది.
COMMENTS