World Tourism Day: IRCTC Bumper Offer.. Zero Convenience Fee on Flight Tickets.. Then Rs.2000 Discount!
World Tourism Day: ఐఆర్‌సీటీసీ బంపర్ ఆఫర్.. విమాన టికెట్లపై జీరో కన్వీనెన్స్ ఫీ.. ఆపై రూ.2000 డిస్కౌంట్!
World Tourism Day: విమాన ప్రయాణికులకు బంపర్ ఆఫర్ అందుబాటులో ఉంది. ఐఆర్‌సీటీసీ ఈ ఆఫర్ ప్రకటించింది. విమాన టికెట్ బుకింగ్స్ పై జీరో కన్వీనెన్స్ ఫీ ప్రకటించింది. అలాగే రూ. 2000 వరకు డిస్కౌంట్ సైతం పొందవచ్చు. అది ఎలాగో ఇప్పుడే తెలుసుకోండి మరి.
World Tourism Day: విమాన ప్రయాణికులకు అదిరే గుడ్‌న్యూస్. ప్రముఖ ఆన్‌లైన్ టికెటింగ్ ప్లాట్ ఫామ్ ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ) తీపి కబురు అందించింది. తమ ప్లాట్ ఫామ్ పై బుక్ చేసుకునే విమాన టికెట్లపై ఎలాంటి కన్వీనెన్స్ ఫీ వసూలు చేయమని ప్రకటించింది. సెప్టెంబర్ 27న ఐఆర్‌సీటీసీ 24వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ ఆఫర్ అందిస్తున్నట్లు తెలిపింది. అంతే కాదు.. ఇదే రోజున ప్రపంచ పర్యాటక దినోత్సవం కూడా ఉండడం వల్ల రెండు కలిసి వచ్చే విధంగా ఈ ఆఫర్ అందిస్తున్నట్లు తెలిపింది. కానీ, ఈ ఆఫర్ కేవలం 3 రోజులు మాత్రమే అందుబాటులో ఉంటుందని ప్రయాణికులు గుర్తుంచుకోవాలి. ఇప్పటికే ఒకరోజు ముగిసిపోయింది. ఎవరైతే సెప్టెంబర్ 25 నుంచి సెప్టెంబర్ 27 మధ్య ఐఆర్‌టీసీ వెబ్‌సైట్ లేదా ఐఆర్‌సీటీసీ యాప్ ద్వారా విమాన టికెట్లను బుక్ చేసుకుంటారో వారికి ఈ ఆఫర్ వర్తిస్తుంది.
ఈ ఆఫర్ దేశీయ ప్రయాణాలతో పాటు అంతర్జాతీయ ప్రయాణాలకు సైతం వర్తిస్తుందని ఐఆర్‌సీటీసీ వెల్లడించింది. ఈ ఆఫర్ పొందాలనుకునే విమాన ప్రయాణికులు ఐఆర్‌సీటీసీకి చెందిన ఎయిర్ టికెటింగ్ పోర్టల్ https://www.air.irctc.co.in/ లేదా ఐఆర్‌సీటీసీ ఎయిర్ టికెటింగ్ యాప్ ద్వారా టికెట్స్ బుక్ చేసుకోవాల్సి ఉంటుందని తెలిపింది. సెప్టెంబర్ 25- 27 తేదీల మధ్య జీరో కన్వీనెన్స్ ఫీజు ఆఫర్ అందించడమే కాకుండా వివిధ బ్యాంకులకు చెందిన క్రెడిట్ లేదా డెబిట్ కార్డుల ద్వారా ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకుంటే అదనంగా మరో రూ. 2000 వరకు డిస్కౌంట్ పొందే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు ఐఆర్‌సీటీసీ తెలిపింది.
ఐఆర్‌సీటీసీ కేవలం ట్రైన్, ఫ్లైట్ టిక్కెట్లు మాత్రమే కాకుండా బస్సు టికెట్లను, హోటల్ బుకింగ్స్ అలాగే టూరిజం ప్యాకేజీలను సైతం తమ వినియోగదారులకు అందిస్తోంది. ప్రస్తుతం ఐఆర్‌సీటీసీ వివిధ పర్యాటక ప్రదేశాలకు తక్కువ ధరకే టూరిజం ప్యాకేజీలను అందిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో ట్రైన్ జర్నీతో పాటు ఫ్లైట్ జర్నీని అందించే టూరిజం ప్యాకేజీలు కూడా ఉంటాయి. తెలుగు రాష్ట్రాల్లోని పర్యాటక ప్రదేశాలకు సైతం ఐఆర్‌సీటీసీ ద్వారా బుక్ చేసుకుని వెళ్లవచ్చు. ఇందులో అందరికి అనువైన ప్యాకేజీలు ఉంటాయని చెప్పవచ్చు.
COMMENTS