Why are there only 12 months in a year? Who is behind the names of the months?
సంవత్సరానికి 12 నెలలే ఎందుకు ఉన్నాయి? నెలల పేర్లు వెనుకున్నది ఎవరు?
జనవరి నుంచి డిసెంబర్ వరకు ఉన్న ఒక్కో నెలకు ఒక్కో హిస్టరీ ఉంది. నెలలకు రోమన్ దేవతలు, చక్రవర్తులు, గొప్ప వ్యక్తులు, ప్రత్యేక సంఖ్యలు, సెలవుల పేర్లపై ఆధారపడి ఉన్నాయి.
సంవత్సరానికి ఎన్ని రోజులు.? అలాగే ఎన్ని నెలలు.? అదేం ప్రశ్న.. సంవత్సరానికి 365రోజులు. అలాగే పన్నెండు నెలలు. ఈ ప్రశ్నలకు సమాధానం అందరికి తెలుసు. కానీ.. అసలు సంవత్సరానికి కేవలం 12నెలలు మాత్రమే ఎందుకు ఉన్నాయి. అలాగే ఒక్కో నెలకు ఒక్కో పేరు ఎలా అసలు ఎవరు పెట్టారు. అసలు జనవరి నుంచి డిసెంబర్ వరకు ఉన్న నెలలకు పేర్లు పెట్టేందుకు బలమైన కారణం సూర్యుడు, చంద్రుడేనని చరిత్ర చెబుతుంది.
రోమన్లు చంద్ర గ్రీకు ఆధారంగా వారి సౌర క్యాలెండర్‌ను సృష్టించిన్నట్లు తెలుస్తోంది. అయితే ఆ రోజుల్లో సంవత్సరానికి 304రోజులు ఉండేవని, దానిని పది నెలలకు డివైడ్ చేసిన్నట్లు తెలుస్తోంది. అయితే ఆ కాలంలో మొదటి నెల జనవరి అని అనుకుంటే మాత్రం పొరపాటే. ఎందుకంటే.. అప్పుడు మొదటి నెల ఇప్పుడున్న మూడో నెల అప్పుడు మొదటి నెల. అదే మార్చి నెల. ఆ కాలంలోనే మార్చి మొదటి రోజునే.. హ్యాపీ న్యూ ఇయర్‌గా జరుపుకునే వాళ్లు. అయితే కొద్ది ఇలా పదినెలలకు ఒక్క ఏడాదిగా కౌంట్ చేశారు. కానీ ఆ తర్వాత రోమ్ పాలకులలో ఒకరైన నుమా పాంపిలియస్, సమయం, రోజులలో మార్పులు తెస్తూ.. కాలాన్ని మరింత ఈజీ చేసేందుకు మరో 2 నెలలు జోడించాలని నిర్ణయించుకున్నారు. కానీ ఇక్కడ విచిత్రం ఏమిటంటే.. పది నెలలకు ఇంకో రెండు నెలలు జోడించి మొత్తం పన్నెండు నెలలు అయినప్పటికీ.. రోజులు మాత్రం 355రోజులుగానే ఉన్నాయి.
ఇక జూలియస్ సీజర్ క్యాలెండర్‌ను ఒకే రూపానికి తీసుకువచ్చి, ఆ తర్వాత 366రోజులతో లీప్ ఇయర్‌ని ప్రవేశపెట్టారు నుమా. అయితే ఆ తర్వాత క్యాలెండర్ ఒకటి కంటే ఎక్కువసార్లు మార్చారు. చంద్రుని దశల ఆధారంగా సరిదిద్దారు. కానీ విచిత్రం ఏమిటంటే.. 1582లో పోప్ గ్రెగొరీ13th మాత్రమే క్యాలెండర్‌ను క్రమబద్ధీకరించారు. అయితే ఇప్పుడు యావత్ ప్రపంచం వాడుతున్న క్యాలెండర్ ఇదే కావడం విశేషం.
నెలలకు పేర్లు ఎలా వచ్చాయి.!
జనవరి నుంచి డిసెంబర్ వరకు ఉన్న నెలలకు పెట్టిన పేర్లు ఒక్కో హిస్టరీ ఉందనే చెప్పాలి. అయితే ఈ ఇంగ్లీష్ క్యాలెండర్ ను పురాతన కాలంలో తయారు చేశారు కాబట్టి.. రోమన్ దేవతలు, చక్రవర్తులు, గొప్ప వ్యక్తులు, ప్రత్యేక సంఖ్యలు, సెలవుల పేర్లపై ఆధారపడి ఉన్నాయి.
జనవరి:
జనవరి మాసాన్ని జావన్ అనే రోమన్ దేవునికి అంకింతం చేశారు. జావన్ గాడ్‌కు, రెండు తలలు ఉంటాయి. ఒక తల వెనక్కి ఉండి క్రితం సంవత్సరాన్ని చూస్తే, ఇంకొక తల ప్రస్తుతం కొనసాగుతున్న సంవత్సరం వైపు ఉంటుంది. అందుకే ఏడాది ప్రారంభం జనవరి నెలతో ప్రారంభమవుతుంది.
ఫిబ్రవరి:
పాపాల నుంచి ప్రక్షాళన చేసే రోమన్ సెలవుదినం కాబట్టి.. ఈనెలకు ఫిబ్రవరి అని పేరు పెట్టారు.
మార్చి:
అత్యంత "బలమైన" నెలకు రోమన్ యుద్ధ దేవుడు మార్స్ పేరును మార్చిగా పెట్టారు.
ఏప్రిల్:
ప్రేమ ఇక అందం యొక్క గ్రీకు దేవత ఆఫ్రొడైట్ - అఫ్రిలిస్ గౌరవార్థం వసంత నెలకు ఏప్రిల్‌గా పేరు పెట్టారు.
మే:
గ్రీకు సంతానోత్పత్తి దేవత అయిన మాయ పేరు మీద వసంతకాలం చివరి నెలకు మే అని పేరు పెట్టారు.
జూన్:
అద్భుతమైన వేసవి రోజు వివాహానికి సంబంధించిన రోమన్ దేవత, సాధారణంగా మహిళల మధ్యవర్తి అయిన జూనో - జూనో చేత ప్రోత్సహించబడింది. అందుకే జూన్ అనే పేరును నామకరణం చేశారు.
జూలై:
జూలియస్ సీజర్ అనే వ్యక్తి గొప్ప కమాండర్, అలాగే రాజకీయ నాయకుడు జన్మించిన నెల ఇది. తనను తాను అమరత్వం పొందాలని నిర్ణయించుకున్నారు. కానీ అంతకుముందు, జూలైని క్వింటిలిస్ అని పిలిచేవారు, దీనికి ఐదో అని అర్థం. కానీ ఆ తర్వాత జూలైగా మార్చారు.
ఆగష్టు:
పురాతన రోమన్ రాజకీయ నాయకుడు, రోమన్ సామ్రాజ్య స్థాపకుడైన ఆక్టేవియన్ అగస్టస్ పేరును ఆగస్టుగా పెట్టారు.
సెప్టెంబర్, అక్టోబరు, నవంబర్, డిసెంబర్:
ఇక ఇంగ్లిష్ క్యాలెండర్‌లోని సెప్టెంబరు, అక్టోబరు, నవంబరు, డిసెంబరు మాసాలను మన తెలుగు అంకెలతో పోలిస్తే , సెప్టెంబరు అనే పదం మన సప్త సంఖ్యను పోలి ఉంటుందంటారు విశ్లేషకులు. మొదట తయారయిన ఇంగ్లిష్ క్యాలెండర్‌లో సెప్టెంబరు మాసం ఏడో కావడం వల్ల ఆ పేరును నిశ్చయించినట్లు చరిత్ర చెబుతోంది. అక్టోబర్- అష్ట, నవంబరు- నవ, డిసెంబరు- దశ... ఈ పదాలన్నీ కూడా మన పదాలకు దగ్గర దగ్గరగా ఉన్నాయి.
COMMENTS