UPI ATM: New UPI ATMs in the country.. Hitachi launched.
UPI ATM: దేశంలో కొత్తగా యూపీఐ ఏటీఎంలు.. ప్రారంభించిన హిటాచీ.. కార్డులు అక్కర్లే..
UPI ATM: యూపీఐ.. యూపీఐ.. యూపీఐ ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే చెల్లింపుల వ్యవస్థ నడుస్తోంది. ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా ప్రజలు సులువుగా చెల్లింపులు చేసుకునేందుకు దీనిని తీసుకురావటంతో జనాధరణ పొందింది. దేశంలోని ప్రతి మారుమూల ప్రాంతానికీ ఇది విస్తరించింది.
దేశవ్యాప్తంగా వైట్ లేబుల్ ఏటీఎంలతో సేవలను అందిస్తోంది హిటాచీ పేమెంట్ సర్వీసెస్ కంపెనీ. అయితే ఇది తాజాగా దేశంలోనే తొలిసారిగా యూపీఐ ఏటీఎంలను అందుబాటులోకి తెస్తోంది. వీటిని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(NPCI) సహకారంతో సురక్షితమైన క్యాష్ విత్‌డ్రా సేవలను ప్రవేశపెట్టింది. ఫిజికల్ కార్డుల అవసరాన్ని తొలగించడం ద్వారా కస్టమర్ భద్రత మెరుగుపడుతుందని కంపెనీ తెలిపింది.
హిటాచీ మనీ స్పాట్ UPI ATM వినియోగదారులకు ఏకీకృత, సురక్షితమైన వినియోగదారు అనుభవాన్ని అందిస్తుందని కంపెనీ వెల్లడించింది. వారికి కార్డ్ లెస్ నగదు ఉపసంహరణల సౌలభ్యాన్ని అందిస్తుంది. హిటాచీ పేమెంట్ సర్వీసెస్ ప్రస్తుతం క్యాష్ డిపాజిట్ సదుపాయాన్ని అందించే వైట్ లేబుల్ ATM ఆపరేటర్ మాత్రమే అని కంపెనీ తెలిపింది. ఈ సేవను 3,000 కంటే ఎక్కువ ATMలలో యాక్సెస్ చేయవచ్చు. QR కోడ్ ఆధారిత నగదు ఉపసంహరణ అన్ని బ్యాంక్ వినియోగదారులు పొందగలరని ఎండి, సీఈవో సుమిల్ వికామ్సే వెల్లడించారు.
హిటాచీ మనీ స్పాట్ UPI ATM ఆండ్రాయిడ్ OSపై నిర్మించబడిందని హిటాచీ పేమెంట్ సర్వీసెస్ ప్రొడక్ట్స్ అండ్ డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ డైరెక్టర్ మహేష్ పటేల్ తెలిపారు. లావాదేవీల ప్రాసెసింగ్, ATM మేనేజ్‌మెంట్ లెగసీ ఆర్కిటెక్చర్ నుంచి టెక్నాలజీ మార్పులకు అనుగుణంగా పరిష్కారాలను అందించడానికి భారీ అవకాశాలను కలిగి ఉన్నట్లు వెల్లడించారు. దీంతో దేశంలో నవతరం ఏటీఎంల హవా ప్రారంభమైందని చెప్పుకోవచ్చు.
COMMENTS