TS: Teachers Recruitment Test (TRT) – Full details here
టీఎస్: టీచర్స్ రిక్రూట్మెంట్ టెస్ట్ (టీఆర్టీ) – పూర్తి వివరాలు ఇవే
టీచర్స్ రిక్రూట్మెంట్ టెస్ట్ (టీఆర్టీ) నోటిఫికేషన్ వెలువడింది. నవంబరు 20 నుంచి 30వ తేదీ మధ్య కంప్యూటర్ ఆధారిత పరీక్షలు (సీబీటీ) నిర్వహించనున్నారు. అర్హులైన అభ్యర్థులు సెప్టెంబరు 20 నుంచి అక్టోబరు 21 వరకు ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ సెప్టెంబరు 7న నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఇటీవలే 5,080 ఉపాధ్యాయ ఖాళీలతో పాటు మరో 1,523 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ల ఖాళీలను భర్తీ చేసేందుకు టీఆర్టీ నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ఇటీవలే ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది. ఈక్రమంలోనే నోటిఫికేషన్ ను జారీ చేశారు. సెకండరీ గ్రేడ్ టీచర్లు, స్కూల్ అసిస్టెంట్లు, పీఈటీలు, భాషా పండితుల పోస్టులను భర్తీ చేస్తారు. అయితే ఈ నోటిఫికేషన్లో 1,523 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ల ఖాళీల భర్తీ గురించి ప్రస్తావించలేదు.
తొలిసారిగా ఆన్లైన్ పరీక్షలు నిర్వహించనున్నారు. మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ, సంగారెడ్డిలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తారు.
అభ్యర్ధుల గరిష్ఠ వయోపరిమితి 44 సంవత్సరాలు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్ధులకు అయిదేళ్లు సడలింపు ఇస్తారు. అది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా వర్తిస్తుంది. దివ్యాంగులకు మాత్రం పది సంవత్సరాల సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు రూ.1000గా నిర్ణయించారు. ఈనెల 20 నుంచి అక్టోబరు 20 వరకు ఫీజు చెల్లించవచ్చు. ఆన్లైన్ దరఖాస్తును దాఖలు చేసే దశల వారీ ప్రక్రియ, జిల్లా వారీగా ఖాళీలు, ఇతర వివరాలన్నీ ఈనెల 15 నుంచి అధికారిక వెబ్సైట్ లో అందుబాటులో ఉంచుతామని విద్యాశాఖ వివరించింది.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ: 20-09-2023
దరఖాస్తు ప్రక్రియ చివరి తేదీ: 20-10-2023
పరీక్షల తేదీలు: 20-11-2023 నుండి 30-11-2023 వరకు
The Telangana Direct Recruitment for the posts of Teachers (Scheme of Selection) Rules, 2023 – Notification – Orders – Issued.
School Education (Ser.III) Department
G.O.Ms.No.25, Date: 05.09.2023
========================
DOWNLOAD G.O.25 WITH ALL DETAILS
========================
REFERENCE:
TS: Filling up 5,089 Vacant Teacher Posts - Direct Recruitment through Departmental Selection Committee (DSC) – G.O Released
జిల్లాల వారీగా & డిపార్ట్మెంటల్ వారీగా ఖాళీల వివరాలు ఇవే
COMMENTS