Traffic Challan: Did you get a message on your phone saying Rs.200, Rs.300 fine? Traffic police warning!
Traffic Challan: రూ.200, రూ.300 ఫైన్ అంటూ మీ ఫోన్‌కు మెసేజ్ వచ్చిందా? ట్రాఫిక్ పోలీసుల హెచ్చరిక!
Traffic Fine :మీకు కారు లేదా బైక్, స్కూటర్ వంటి టూవీలర్ వంటివి ఉన్నాయా? అయితే మీరు కచ్చితంగా ఈ విషయం తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు సైబర్ మోసాలు కూడా నానాటికీ పెరిగిపోతున్నాయి.
మోసగాళ్లు కొత్త కొత్త మార్గాల్లో ప్రజలను బురిడి కొట్టిస్తున్నారు. మీరు ఏమరపాటుగా ఉంటే మాత్రం జేబు ఖాళీ అయిపోతుంది. అందుకే మీరు జాగ్రత్తగా ఉండాలి.
ఇటీవల కాలంలో ట్రాఫిక్ చలానా మోసాలు పెరుగుతున్నట్లు తెలుస్తోంది. అంటే మీ ఫోన్‌కు ట్రాఫిక్ చాలానా అంటూ మెసేజ్ వస్తుంది. మీరు ట్రాఫిక్ చలానా వచ్చిందని కదా? కట్టేద్దాం అని అనుకేంటే మాత్రం మీ బ్యాంక్ అకౌంట్ ఖాళీ అయిపోయే ప్రమాదం ఉంది.
ఎందుకని అనుకుంటున్నారా? ఎందుకంటే ఇప్పుడు మోసగాళ్లు కూడా ట్రాఫిక్ ఇ-చలానా మెసేజ్‌లతో వాహనదాలను మోసం చేసుతున్నారు. ఫేక్ ట్రాఫిక్ చలానా మెసేజ్ పంపి డబ్బులు కొట్టేస్తున్నారు. మీరు ఇక్కడ ఇంకో విషయం కూడా గుర్తు పెట్టుకోవాలి.
ట్రాఫిక్ చలానా రూ.100 లేదా రూ. 200 వచ్చిందని కట్టేయాలని అనుకొని, చెల్లిస్తే.. పోయేది రూ.100, రూ.200 మాత్రమే కాదు. మీ అకౌంట్ పూర్తిగా ఖాళీ కావొచ్చు. అందుకే జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీకు వచ్చే ఫేక్ ట్రాఫిక్ చలానా మెసేజ్‌లో లింక్ కూడా ఉంటుంది. మీరు దాని మీద క్లిక్ చేస్తే అంతే సంగతి.
మీరు లింక్‌పై క్లిక్ చేసి పేమెంట్ చేస్తే.. మీ బ్యాంక్ వివరాలు అన్ని మోసగాళ్ల చేతికి వెళ్లిపోతాయి. అప్పుడు వారు మీ బ్యాంక్ వివరాలను సయాంతో లాగిన్ అయ్యి పూర్తి డబ్బులు కొట్టేసే ప్రమాదం ఉంటుంది. అందుకే ఇలాంటి ట్రాఫిక్ చలానా మెసేజ్ వస్తే.. దాన్ని ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి.
మీకు కూడా ఇలాంటి లింక్స్ ఏమైనా వస్తే.. వెంటనే 1930 నెంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయొచ్చు. లేదంటే సైబర్ క్రైమ్ పోర్టల్‌కు వెళ్లి ఫిర్యాదు ఇవ్వొచ్చు. మోసపూరిత లింక్స్‌పై క్లిక్ చేసి మీ బ్యాంకింగ్ విరాలను మాత్రం ఎంటర్ చేయవద్దు. లేదంటే ఫిషింగ్ ఎటాక్‌కు గురి కావొచ్చు.
మీకు వచ్చే ఫెక్ ట్రాఫిక్ చలానాలో కేవలం మీ వెహికల్ నెంబర్ మాత్రమే ఉండొచ్చు. మిగతా వివరాలు ఏమీ ఉండకపోవచ్చు. వెహికల్ నెంబర్ కరెక్ట్‌గానే ఉందని మోసపోవద్దు. కంగారు పడి లింక్‌పై క్లిక్ చేస్తే బ్యాంక్ అకౌంట్ ఖాళీ అయిపోతుంది. మెసేజ్ ఎక్కడి నుంచి వచ్చింది? లింక్ యూఆర్ఎల్ ఏంటి? అనేవి ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి.
COMMENTS