Tourist Places: The value of our rupee is high in these countries.. Explore the beauty of these foreign countries cheaply..
Tourist Places: ఈ దేశాల్లో మన రూపాయి విలువ అధికం.. చౌకగా ఈ విదేశాల అందాలను చుట్టేయండి..
కొన్ని దేశాల్లో రూపాయి విలువ చాలా రెట్లు పెరుగుతోంది. మీరు చౌకగా మీ బడ్జెట్ లో విదేశాలకు వెళ్లాలనుకుంటే.. కొన్ని దేశాలను ఎంపిక చేసుకోండి. మీరు మీ బడ్జెట్ లో ఈ దేశాలను సందర్శించవచ్చు. ఈ దేశాల్లో భారత రూపాయి విలువ గణనీయంగా పెరిగింది. అందువల్ల మీరు డబ్బు గురించి చింతించకుండా ఈ దేశాలను సందర్శించవచ్చు.
మీ బడ్జెట్‌లోనే విదేశాలకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకోవచ్చు. నిజానికి ఈ దేశాల్లో భారత రూపాయి విలువ అనేక రెట్లు పెరుగుతూ ఉంది. అందువల్ల ఈ దేశాల్లో సందర్శించే సమయంలో ఖర్చుల గురించి చింతించాల్సిన పని ఉండదు. తక్కువ బడ్జెట్ లో సందర్శించే దేశాల గురించి ఈ రోజు తెలుసుకుందాం.
ఇండోనేషియా - హనీమూన్‌కి వెళ్లేందుకు ఇది సరైన గమ్యస్థానం. బాలి, జకార్తా, ఉబుద్, బాతం, బోరోబుదూర్ టెంపుల్, నుసా లెంబొంగన్ వంటి అనేక ప్రదేశాలు ఇక్కడ ఉన్నాయి. ఈ దేశంలో ఒక భారతీయ రూపాయి విలువ 184.12 ఇండోనేషియా రూపాయలు. కనుక మీ బడ్జెట్ లో ఈ దేశం సందర్శించడం బెస్ట్ ఎంపిక.
వియత్నాం - ఈ దేశం చాలా మంది పర్యాటకులను ఆకర్షిస్తుంది. ఇక్కడ పచ్చని దట్టమైన అడవులు.. వంకరగా ఉండే కొండ కోనలు ప్రకృతి ప్రేమికులను ఎంతగానో ఆకర్షిస్తాయి. హలోంగ్ బే, హనోయి, హా గియాంగ్, సాపా వంటి ప్రదేశాలు సందర్శించడానికి చాలా ప్రసిద్ధి చెందాయి. వియత్నాంలో ఒక భారతీయ రూపాయి విలువ 289.54 వియత్నామీస్ డాంగ్‌కి సమానం.
కంబోడియా - కంబోడియా అత్యంత ప్రసిద్ధి చెందిన ఆకర్షణీయమైన పర్యాటక ప్రదేశాల్లో ఒకటి. మీరు ఈ అందమైన దేశానికి ట్రిప్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు. అంగ్‌కోర్ వాట్ టెంపుల్, కో రాంగ్ వంటి ప్రదేశాలు ఇక్కడ ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలు. ఇక్కడ ఒక భారతీయ రూపాయి విలువ 50.05 కంబోడియన్ రియాల్.
శ్రీలంక - సాహస ప్రియులకు బెస్ట్ ఎంపిక శ్రీలంక. ఈ దేశాన్ని ప్రకృతి ప్రేమికులు, సాహసికులు తప్పక సందర్శించాల్సిందే. ట్రెక్కింగ్ వంటి కార్యక్రమాలలో పాల్గొనవచ్చు. ఇక్కడ నైన్ ఆర్చ్ బ్రిడ్జ్, మింటెల్, గల్ విహార్, రావణ జలపాతం వంటి అనేక ప్రసిద్ధ ప్రదేశాలు ఉన్నాయి. ఇక్కడ ఒక భారతీయ రూపాయి విలువ 3.89 శ్రీలంక రూపాయలకు సమానం.
COMMENTS