Small Savings Account: If this document is not submitted, all your accounts will be closed.. No interest will be charged.. Here are the complete details..
Small Savings Account: ఈ డాక్యుమెంట్ సమర్పించకపోతే మీ ఖాతాలన్నీ క్లోజ్.. వడ్డీ కూడా పడదు.. పూర్తి వివరాలు ఇవి..
పీపీఎఫ్, ఎన్ఎస్సీ, ఎస్సీఎస్ఎస్ వంటి సేవింగ్స్ స్కీమ్‌ల కోసం తగిన డాక్యుమెంట్‌లను సెప్టెంబర్ 30లోపు సమర్పించకపోతే ఖాతా స్తంభింపజేయడంతోపాటు కొన్ని సమస్యలకు దారితీయవచ్చు. పెట్టుబడిదారులు వడ్డీ రాబడి వంటి ప్రయోజనాలను కూడా పొందలేరు. ఇలా ఎందుకు జరుగుతుంది? పూర్తి వివరాలు తెలుసుకుందాం రండి..
మీరు ఒకవేళ స్మాల్ సేవింగ్స్ స్కీమ్ ఉంటే ఈ కథనం మీ కోసమే. స్మాల్ సేవింగ్స్ స్కీమ్ అంటే ఏమిటి అని ఆలోచిస్తున్నారా? పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్), సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ (ఎస్సీఎస్ఎస్ ), నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్(ఎన్ఎస్సీ) వంటి ఇతర పోస్టాఫీసు పథకాలను చిన్న పొదుపు పథకాలు అంటారు. మీరు వీటిల్లో పెట్టుబడి పెడితే మీరు వెంటనే కొన్ని పత్రాలను పోస్ట్ ఆఫీసులో సమర్పించాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు నిర్ణీత సమయంలోపు ఆ పత్రాలు సమర్పించకపోతే మీ ఖాతా స్తంభించిపోయే అవకాశం ఉంది. ఆ ప్రతాలు ఏంటి? డెడ్ లైన్ ఎప్పుడు? తెలుసుకుందాం రండి..
డెడ్ లైన్ ఇది..
పీపీఎఫ్, ఎన్ఎస్సీ, ఎస్సీఎస్ఎస్ వంటి సేవింగ్స్ స్కీమ్‌ల కోసం తగిన డాక్యుమెంట్‌లను సెప్టెంబర్ 30లోపు సమర్పించకపోతే ఖాతా స్తంభింపజేయడంతోపాటు కొన్ని సమస్యలకు దారితీయవచ్చు. పెట్టుబడిదారులు వడ్డీ రాబడి వంటి ప్రయోజనాలను కూడా పొందలేరు. ఇలా ఎందుకు జరుగుతుంది తెలుసుకుందాం..
మీరు సెప్టెంబరు 30, 2023లోగా ఆధార్ నంబర్‌ను బ్యాంక్ లేదా పోస్టాఫీసు బ్రాంచ్‌కి సమర్పించడంలో విఫలమైతే మీ చిన్న పొదుపు ఖాతా స్తంభించిపోతుంది. ఈ చిన్న పొదుపు పథకాలలో పెట్టుబడి పెట్టడానికి ఆధార్ కార్డ్ అత్యంత ముఖ్యమైన పత్రాలలో ఒకటిగా పనిచేస్తుంది. అందువల్ల, ఆధార్ వివరాలను సమర్పించడంలో వైఫల్యం ఈ పథకాల ప్రయోజనాలను పరిమితం చేస్తుంది. సెప్టెంబరు 30 గడువులోగా మీరు ఆధార్ నంబర్‌ను అందించనంత వరకు బ్యాంక్ లేదా పోస్టాఫీసు సేవింగ్స్ ఖాతాను స్తంభింపజేసే అవకాశం ఉంది.
ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటన ఇది..
పీపీఎఫ్, ఎన్ఎస్సీ, ఎస్సీఎస్ఎస్ వంటి చిన్న పొదుపు పథకాలలో పెట్టుబడి పెట్టాలనుకుంటే ఆధార్, పాన్ తప్పనిసరి అని మార్చి 31న ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అంతేకాకుండా, ఇప్పటికే ఉన్న పెట్టుబడిదారులు ఆధార్ నంబర్‌ను అందించడాన్ని కూడా తప్పనిసరి చేసింది. ఒక డిపాజిటర్ ఇప్పటికే ఖాతా తెరిచి, తన ఆధార్ నంబర్‌ను ఖాతాల కార్యాలయానికి సమర్పించకపోతే, అతను 2023 ఏప్రిల్ 1వ తేదీ నుండి ఆరు నెలలలోపు ఆధార్ సమర్పించాలని సూచించింది. ఈ ఆరు నెలల వ్యవధి సెప్టెంబర్ 30తో ముగుస్తుంది. కాబట్టి, వెంటనే మీరు గడువు తేదీకి ముందు మీ ఆధార్ నంబర్‌ను సమర్పించాలి.
మీ పొదుపు ఖాతా స్తంభించిపోతే ఏమవుతుందంటే..
- చెల్లించాల్సిన వడ్డీ లబ్ధిదారుని బ్యాంక్ ఖాతాకు జమ చేయబడదు.
- పీపీఎఫ్, ఎన్ఎప్సీ, ఇతర పథకాలకు సంబంధించిన వారి పొదుపు ఖాతాలలోకి డిపాజిట్లు చేయకుండా పెట్టుబడిదారులు నిషేధించబడవచ్చు.
- పెట్టుబడిదారు అదే ఖాతా వివరాలను ఉపయోగించి పథకం మెచ్యూరిటీ మొత్తాన్ని అందుకోలేరు.
మరోవైపు, పాన్ నంబర్ కూడా చాలా కీలకమైన పత్రమే. అయితే పెట్టుబడిదారులకు దీనిని సమర్పించడానికి ఎక్కువ సమయం ఉంటుంది. మీ ఖాతా బ్యాలెన్స్ రూ.50,000 మించిపోయినా.. ఏ ఆర్థిక సంవత్సరంలోనైనా పొదుపు ఖాతాలోని మొత్తం క్రెడిట్‌లు రూ. 1 లక్ష కంటే ఎక్కువగా ఉన్నా.. ఒక నెలలోపు ఖాతా నుంచి చేసిన అన్ని బదిలీలు లేదా ఉపసంహరణల మొత్తం రూ. 10,000 కంటే ఎక్కువ ఉంటే మీకు అప్పుడు మీరు రెండు నెలలలోపు పాన్ నంబర్ సమర్పించాల్సి ఉంటుంది.
COMMENTS