Santoor Scholarship : Wipro Consumer Care Scholarships..Who is Eligible to Apply?
Santoor Scholarship : విప్రో కన్జ్యూమర్ కేర్ సంస్థ స్కాలర్‌షిప్‌లు..దరఖాస్తుకు ఎవరు అర్హులంటే?
Santoor Scholarship : నిరుపేద విద్యార్థినులకు విప్రో మంచి శుభవార్తనందించింది. విప్రో కన్జ్యూమర్ కేర్ సంస్థ స్కాలర్‌షిప్‌ల ద్వారా తమవంతు ఆర్దిక సహాయంను ప్రకటించింది. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే చాలా మంది అమ్మాయిలు తగినంత ఆర్థిక వనరులు లేక ఇబ్బందులు పడే వారికి ఆర్ధిక సాయం అందించనుంది. ఇందులో భాగంగా ప్రస్తుత విద్యాసంవత్సరానికి 2023-24 గాను పేద విద్యార్థినుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
విప్రో కన్జ్యూమర్ కేర్ సంస్థ విప్రో కేర్స్‌తో కలిసి 2016-17లో సంతూర్ స్కాలర్‌షిప్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీని ద్వారా ఏదైనా డిగ్రీ చదవాలనుకునే నిరుపేద విద్యార్థినులకు తమ వంతు ఆర్థిక సాయాన్ని అందిస్తోంది. ఈ స్కాలర్‌షిప్‌కు ఎంపికైన విద్యార్థినులకు గ్రాడ్యుయేషన్ పూర్తయ్యేవరకు సంవత్సరానికి 24 వేల రూపాయల చొప్పున అందిస్తారు. ఈ మొత్తాన్ని ట్యూషన్ ఫీ లేదా చదువుకు సంబంధించిన ఇతర అవసరాలకు ఉపయోగించుకోవచ్చు.
స్కాలర్‌షిప్:
ఈ స్కాలర్‌షిప్‌కు ఎంపికైన విద్యార్థినులకు మూడేళ్లు లేదా కోర్సు పూర్తయినంత వరకు ప్రతినెలా రూ.రెండువేల చొప్పున స్కాలర్‌షిప్ ఇస్తారు. డబ్బు నేరుగా వారి బ్యాంకు ఖాతాలో జమవుతుంది. ట్యూషన్ ఫీజులు, పుస్తకాలు, ఇతర సదుపాయాల కోసం దీన్ని ఉపయోగించుకోవచ్చు.
అర్హతలు:
పదో తరగతి, ఇంటర్మీడియట్ ప్రభుత్వ పాఠశాల, ప్రభుత్వ కాలేజీల్లోనే చదివుండాలి.
ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన పేద బాలికలే ఈ స్కాలర్‌షిప్‌కు అర్హులు.
2022-23 విద్యాసంవత్సరంలో ఇంటర్ లేదా సమాన స్థాయి కోర్సులు పూర్తిచేసినవారై ఉండాలి.
2023-24 లో ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ మొదటి సంవత్సరం కోర్సుల్లో చేరి ఉండాలి.
కనీసం మూడేళ్లు, ఆపై వ్యవధితో ఉన్న డిగ్రీ కోర్సుల్లో చేరినవారే ఈ స్కాలర్‌షిప్పు పొందడానికి అర్హులు.
హ్యుమానిటీస్, లిబరల్ ఆర్ట్స్, సైన్స్ కోర్సుల్లో చేరినవారికి, వెనుకబడిన జిల్లాలకు చెందినవారికి ఎంపికలో కొంత ప్రాధాన్యం ఉంటుంది.
అకడమిక్ మెరిట్ ప్రాతిపదికన అర్హులను ఎంపిక చేస్తారు: అప్లికేషన్ ఫామ్‌ను సంస్థ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకుని, ప్రింటవుట్ తీసుకోవాలి. అందులో పూర్తి వివరాలను నింపి పోస్టు ద్వారా పంపాలి. దరఖాస్తు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
దరఖాస్తుకు చివరి తేది: సెప్టెంబర్ 30, 2023
దరఖాస్తులు పంపాల్సిన చిరునామా: విప్రో కేర్స్- సంతూర్ స్కాలర్‌షిప్, దొడ్డకన్నెల్లి, సర్జాపూర్ రోడ్డు, బెంగళూరు - 560035, కర్ణాటక.
Important Links:
FOR WEBSITE CLICKHERE.
FOR APPLICATION DOWNLOAD CLICKHERE.
COMMENTS