PM Kisan Samman Nidhi: That's good news for farmers.. festival bonanza.. money into accounts earlier this time!
PM Kisan Samman Nidhi: రైతులకు అదిరే గుడ్‌న్యూస్.. పండగ బొనాంజా.. ఈసారి ముందే అకౌంట్లలోకి డబ్బులు!
PM Kisan Kyc: రైతులకు శుభవార్త అందనుందా? అంటే అవుననే తెలుస్తోంది. పండగ సీజన్‌లోనే అకౌంట్లలోకి డబ్బులు రానున్నాయా? పీఎం కిసాన్ స్కీం 15వ విడత డబ్బులు ఈసారి ముందుగానే రానున్నట్లు తెలుస్తోంది. ఎందుకో తెలుసుకోండి. అకౌంట్లలో రూ. 2 వేలు పడనున్నాయా?
PM Kisan 15th Installment: రైతులకు ఆర్థికంగా మద్దతు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో ఒకటి పీఎం కిసాన్ స్కీమ్. ఇందులో భాగంగా ఏటా 3 విడతల్లో రూ. 2 వేల చొప్పున మొత్తం 6 వేల రూపాయల్ని అందిస్తోంది. నేరుగా ఈ డబ్బులు అకౌంట్లలోనే పడతాయి. ఇప్పటికే 14 విడతల డబ్బుల్ని అందించింది. అంతా 15వ విడత డబ్బుల కోసం ఎదురుచూస్తున్నారు. ఇవి షెడ్యూల్ ప్రకారం.. నవంబర్ లేదా డిసెంబర్‌లో రావాల్సి ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఈ రైతులకు శుభవార్త అందించే అవకాశం ఉంది. పీఎం కిసాన్ లబ్ధిదారులకు.. ఊరట కలిగే నిర్ణయం తీసుకోనున్నట్లు పలు రిపోర్టులను బట్టి తెలుస్తోంది.
పండగ సీజన్ నేపథ్యంలో రైతుల అకౌంట్లలో 15వ విడత డబ్బుల్ని ముందుగానే జమ చేయనున్నట్లు ఇప్పటికే మీడియాల్లో కథనాలు వస్తున్నాయి. ఇదే జరిగితే చాలా మందికి పండగ సమయంలో బెనిఫిట్ అని చెప్పొచ్చు. నివేదికల ప్రకారం చూస్తే.. దసరా, దీపావళి వంటి పండగలు వచ్చే నెలలో రాబోతున్నందున అప్పుడే పీఎం కిసాన్ డబ్బుల్ని విడుదల చేయనున్నట్లు సమాచారం.
ఈసారి దసరా అక్టోబర్ 24న ఉండగా.. అంతకుముందు బతుకమ్మ, దుర్గాష్టమి ఉంది. ఇక నవంబర్ 10న దీపావళి పండగ. ఈ ఫెస్టివల్స్‌కు రైతులకు డబ్బులందే ఛాన్స్ ఉంది. కేంద్ర ప్రభుత్వం మాత్రం ఇప్పటివరకు దీనిపై అధికారిక ప్రకటన చేయలేదు. నివేదికల ప్రకారం.. దసరా లేదా దీపావళికే రైతుల బ్యాంక్ అకౌంట్లలో ఈసారి డబ్బులు పడే అవకాశాలు ఉన్నాయి.
సాధారణంగా ప్రతిసారి 3 విడతల్లో భాగంగా.. ఏప్రిల్- జులై కాలానికి ఒకసారి.. ఆగస్ట్- నవంబర్ కాలానికి ఒకసారి.. డిసెంబర్ - మార్చి కాలానికి ఒకసారి డబ్బులు అందుతున్నాయి. ఈ మధ్య కాలంలో ఎప్పుడైనా రైతుల అకౌంట్లో డబ్బులు అకౌంట్లలో పడుతున్నాయి. పీఎం కిసాన్ 13వ విడత డబ్బులు ఫిబ్రవరి 27న రైతుల అకౌంట్లలో పడ్డాయి. అదే 14వ విడత జులై 27న వచ్చాయి. ఈసారి 15వ విడత మరి ఎప్పుడు వస్తుందోనని ఎదురుచూస్తున్నారు.
పీఎం కిసాన్ స్కీమ్‌కు మొదట మీరు అర్హులో కాదో తెలుసుకోవాలి. అనర్హులు కూడా అప్లై చేసుకుంటే మాత్రం.. వారి నుంచి రీఫండ్ కూడా వసూలు చేస్తోంది కేంద్రం. ఇటీవల ఇలా బిహార్ నుంచి 81 వేల మంది అనర్హులు.. పీఎం కిసాన్ స్కీమ్ ప్రయోజనాల్ని పొందుతున్నట్లు గుర్తించింది. వారి అకౌంట్లను ఫ్రీజ్ చేయాలని బ్యాంకులకు ఆదేశాలు కూడా జారీ చేసింది.
COMMENTS