PM Kisan: Good news for farmers.. Finance Minister Nirmala Sitharaman's key announcement.. New services from today!
PM Kisan: రైతులకు శుభవార్త.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన.. ఈ రోజు నుంచే కొత్త సర్వీసులు!
Kisan Rin Portal: రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కొత్త సర్వీసుల్ని ఈ రోజు నుంచి అందుబాటులోకి తీసుకురాబోతుంది. దీని వల్ల అన్నదాతలకు ప్రయోజనం కలుగుతుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్.. ఇవాళ ఒక పోర్టల్ ప్రారంభించనున్నారు.
Nirmala Sitaraman: కేంద్ర ప్రభుత్వం రైతులకు తీపికబురు అందించింది. కొత్త సర్వీసుల్ని తీసుకొస్తోంది. ఇవాళ మోదీ సర్కార్ కొత్త సేవలు తీసుకురానుంది. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, ఇంకా వ్యవసాయ మంత్రి నరేంద్ర తోమర్ కిసాన్ పోర్టల్ ప్రారంభించనున్నారు. ఈ పోర్టల్‌తో రైతులకు సబ్సిడీ రేటుతో లోన్లు పొందొచ్చు. కిసాన్ క్రెడిట్ కార్డు ఉన్న వారికి ఈ బెనిఫిట్ లభించనుంది. ఇంటింటికీ కిసాన్ క్రెడిట్ కార్డు స్కీం కూడా లాంఛ్ చేయనున్నారు. దీంతో పాటు.. వెదర్ ఇన్ఫర్మేషన్ నెట్‌వర్క్ డేటా సిస్టమ్స్ (విండ్స్ ) పోర్టల్ అందుబాటులోకి రానుంది.
అగ్రికల్చరల్ మినిస్టర్ నరేంద్ర సింగ్ తోమర్ ప్రకారం చూస్తే.. కిసాన్ రిన్ డిజిటల్ ప్లాట్‌ఫాంతో రైతులకు సంబంధించి సమగ్ర డేటా పొందొచ్చు. లోన్ మంజూరు వివరాలు, స్కీం వినియోగం, వడ్డీ తగ్గింపు, బ్యాంకుల ఇంటిగ్రేషన్ ఇలా ఎన్నో అంశాలు తెలుసుకోవచ్చు. దీనితో అగ్రికల్చర్ క్రెడిట్ మరింత సమర్థంగా లభిస్తుందని ఆయన పేర్కొన్నారు.
మార్చి 30 వరకు చూస్తే.. దాదాపు 7.35 కోట్ల KCC అకౌంట్లు ఉన్నాయి. వీరికి దాదాపు 8.85 లక్షల కోట్ల లిమిట్ మంజూరైంది. అధికారిక డేటా ప్రకారం చూస్తే.. సర్కార్ అగ్రి క్రెడిట్ కింద సబ్సిడీ వడ్డీ రేటుతో రూ. 6,573 కోట్లు మంజూరు చేసింది. ఏప్రిల్- ఆగస్ట్ త్రైమాసికంలో ఈ మేరకు రుణాలు జారీ అయ్యాయి. కేసీసీ ప్రయోజనాల్ని మరింత విస్తరించేందుకు, డోర్ టు డోర్ క్యాంపెయిన్ తీసుకొస్తామని.. నాన్ కేసీసీ హోల్డర్లకు కూడా ఈ సర్వీసులు అందుబాటులోకి తీసుకొస్తామని ఆయన చెప్పారు. పీఎం కిసాన్ స్కీంలో చేరిన అందరికీ KCC లోన్లు లభించేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
మరోవైపు మోదీ సర్కార్ పీఎం కిసాన్ స్కీం కింద ఏటా అర్హులైన రైతులకు రూ. 6 వేలు అందిస్తోంది. ఇప్పటికే 14 విడతల డబ్బులు రైతుల అకౌంట్లలోకి జమ చేసింది. ఇప్పుడు 15వ విడత డబ్బులు కూడా రావాల్సి ఉంది. త్వరలోనే ఈ డబ్బులు రానున్నాయి.
పండగ సీజన్‌లోనే కేంద్రం.. రైతుల బ్యాంక్ అకౌంట్లో ఈ మేరకు డబ్బులు జమ చేయొచ్చనే అంచనాలున్నాయి. నవంబర్ నెల్లోనే డబ్బులు అన్నదాతకు అందనున్నట్లు తెలుస్తోంది. దీని వల్ల చాలా మందికి ఊరట కలుగుతుందని చెప్పొచ్చు. కేంద్రం మాత్రం దీనిపై అధికారిక ప్రకటన వెలువరించనప్పటికీ.. త్వరలోనే తీపికబురు అందించనుంది.
Kisan credit card har yek kisan dhena jaruri hai. kshetra sthayilo AEO se visit karaake dhena jaruri hai.
ReplyDelete