Savings Scheme: Investing in this scheme will double your money.
Savings Scheme: ఈ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేస్తే మీ డబ్బు రెండింతలవుతుంది.
Kisan Vikas Patra Scheme: రిస్క్ లేకుండా మీ పెట్టుబడిపై రిటర్న్స్ పొందాలనుకుంటున్నారా? అయితే మీకు ఈ స్కీమ్ కరెక్ట్. ఈ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేసి మీ పెట్టుబడిని రెట్టింపు చేసుకోవచ్చు. ఎలాగో తెలుసుకుందాం.
1. స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయాలంటే రిస్క్ ఎక్కువ. మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెడితే ఈ మధ్య పెద్దగా రిటర్న్స్ రావట్లేదు. అందుకే గ్యారెంటీడ్ రిటర్న్స్ అంటే ఖచ్చితంగా రిటర్న్స్ వచ్చే పొదుపు పథకాలపై దృష్టి పెడుతున్నారు సామాన్యులు. ప్రభుత్వ పొదుపు పథకాలు గ్యారెంటీడ్ రిటర్న్స్ ఇస్తాయి. ఎంత రిటర్స్ వస్తాయో ముందే చెబుతాయి.
2. అలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేస్తే రిటర్న్స్ ఎంత వస్తాయన్న అవగాహన కూడా ఉంటుంది. మంచి రిటర్న్స్ పొందొచ్చు. అలాంటి స్కీమ్స్‌లో ఒకటి కిసాన్ వికాస్ పత్ర-KVP. ఇది ప్రభుత్వానికి చెందిన పొదుపు పథకం. ఈ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేసేవారికి సర్టిఫికెట్ వస్తుంది. ఇందులో ఇన్వెస్ట్ చేసే మొత్తం 10 ఏళ్ల నాలుగు నెలల్లో అంటే మొత్తం 124 నెలల్లో డబుల్ అవుతుంది.
3. భారతదేశంలోని ఏదైనా పోస్ట్ ఆఫీస్‌లో కిసాన్ వికాస్ పత్ర-KVP స్కీమ్‌లో చేరొచ్చు. పేరులో కిసాన్ ఉంది కదా అని ఇది రైతులకు సంబంధించిన స్కీమ్ అనుకుంటారు. కానీ ఇందులో ఎవరైనా చేరొచ్చు. కనీసం రూ.1,000 సర్టిఫికెట్‌తో కిసాన్ వికాస్ పత్ర సర్టిఫికెట్ తీసుకోవచ్చు. గరిష్టంగా ఎంతైనా ఇన్వెస్ట్ చేయొచ్చు. అయితే రూ.50,000 కన్నా ఎక్కువ ఇన్వెస్ట్‌మెంట్‌కు పాన్ కార్డు వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది.
4. ప్రస్తుతం కిసాన్ వికాస్ పత్ర స్కీమ్‌లో 6.9 శాతం వడ్డీ లభిస్తుంది. మీరు సర్టిఫికెట్ తీసుకున్నప్పుడే మెచ్యూరిటీ సమయంలో తిరిగి ఎంత వస్తుందో ఉంటుంది. అంటే వడ్డీ రేట్లు తగ్గినా మీకు వచ్చే రిటర్న్స్‌లో మార్పు ఉండదు. మీకు సర్టిఫికెట్‌లో ఎంత ఉంటుందో మెచ్యూరిటీ సమయంలో అంతే పొందొచ్చు. అందుకే కిసాన్ వికాస్ పత్రను సురక్షితమైన పెట్టుబడిగా భావిస్తారు.
5. 18 ఏళ్ల వయస్సు దాటిన వారెవరైనా కిసాన్ వికాస్ పత్ర సర్టిఫికెట్ తీసుకోవచ్చు. గరిష్ట వయోపరిమితి లేదు. మైనర్లు కూడా ఈ స్కీమ్‌లో చేరొచ్చు. అయితే అకౌంట్ తల్లిదండ్రులు లేదా సంరక్షకుల పేరు మీద ఉంటుంది. భారతదేశంలో ఉండేవారు మాత్రమే ఈ స్కీమ్‌లో చేరడానికి అనుమతి ఉంది. ట్రస్టులు కూడా ఈ స్కీమ్‌లో చేరొచ్చు. అయితే కంపెనీలకు అనుమతి లేదు.
6. మెచ్యూరిటీ కన్నా ముందే కిసాన్ వికాస్ పత్ర నుంచి డబ్బులు వెనక్కి తీసుకునే అవకాశం ఉంది. అయితే ఏడాదిలోపే డబ్బులు వెనక్కి తీసుకుంటే వడ్డీ రాదు. పైగా పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. ఒకటి నుంచి రెండున్నరేళ్ల మధ్య డబ్బులు వెనక్కి తీసుకుంటే పెనాల్టీ ఉండదు. కానీ వడ్డీ తక్కువగా వస్తుంది. రెండున్నరేళ్ల తర్వాత డబ్బులు వెనక్కి తీసుకుంటే పెనాల్టీ ఉండదు. వడ్డీ కూడా తగ్గదు.
COMMENTS