Is your SBI ATM card blocked? Unblock easily like this..
మీ SBI ఏటీఎం కార్డు బ్లాక్ అయిందా? ఇలా ఈజీగా అన్‌బ్లాక్ చేసుకోండి..
SBI: బ్యాంకు ఖాతాదారుల వద్ద దాదాపుగా ఏటీఎం డెబిట్ కార్డు అనేది ఉంటుంది. దానిని సక్రమంగా వినియోగించుకుంటే ఎలాంటి సమస్య ఉండదు. కానీ అనుకోకుండా చేసే కొన్ని పొరపాట్ల వల్ల ఒక్కోసారి డెబిట్ కార్డు బ్లాక్ అయ్యే అవకాశం ఉంది. అలా ఏటీఎం కార్డు బ్లాక్ అయితే తిరిగి అన్‌బ్లాక్ ఎలా చేయాలి? అనేది చాలా మందికి తెలియదు. అలాగే ఎలాంటి కారణాలతో ఏటీఎం కార్డు బ్లాక్ అవుతుంది? ఎస్‌బీఐ బ్యాంక్ ఏటీఎం కార్డు వాడుతున్న కస్టమర్లు ఏ విధంగా బ్లాక్ అయిన తమ ఏటీఎం కార్డును అన్‌బ్లాక్ చేసుకోవచ్చు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం.
బ్లాక్ అయ్యేందుకు కారణాలు..
ఏటీఎం కేంద్రంలో డబ్బులు తీసుకునేందుకు పిన్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అయితే, కొందరు చాలా రకాల కార్డుల వాడడంతో దేని పిన్ దేనిదో మర్చిపోతుంటారు. ఇలా ఏటీఎంలో పిన్ వరుసగా మూడు సార్లు తప్పుగా ఎంటర్ చేస్తే ఆ కార్డు ఆటోమేటిక్ గా బ్లాక్ అవుతుంది. ఈ కారణంతో అయితే 24 గంటల పాటు ఏటీఎం కార్డు పని చేయదు. ఇది తాత్కాలికమే. అయితే, ఏటీఎం కార్డుకు ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది. ఆ తేదీ ముగుస్తే కార్డును బ్యాంకులు బ్లాక్ చేస్తాయి. అయితే, బ్యాంకులే నేరుగా కొత్త కార్డును పంపిస్తాయి. అయితే, ఇతర కారణాలతోనూ ఒక్కోసారి కార్డు బ్లాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది.
అలా జరిగినప్పుడు అన్‌బ్లాక్ చేసుకునేందుకు ఈ కింది స్టెప్స్ ఫాలో అయితే సరిపోతుంది.
- ముందుగా మీ ఫోన్‌లో YONO యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలి.
- MPIN ద్వారా యోనో యాప్ లోకి లాగిన్ కావాలి.
- బాటమ్ లైన్ వద్ద సర్వీస్ రిక్వెస్ట్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
- తర్వాత ఏటీఎం డెబిట్ కార్డు ఆప్షన్ ఎంచుకోవాలి.
- తర్వాత మీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్‌వర్డ్ ఎంటర్ చేయాలి.
- సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయాలి. తర్వాత యాక్టివ్ కార్డుపై క్లిక్ చేయాలి.
- అన్‌బ్లాక్ చేయాలనుకుంటున్న ఖాతాను ఎంచుకోవాలి.
- ఇప్పుడు కార్డు నంబర్ ఎంటర్ చేసి నెక్ట్స్ పై క్లిక్ చేయాలి.
- ఫోన్‌కు ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేస్తే సరిపోతుంది.
మరోవైపు.. కస్టమర్ కేర్ ద్వారాను అన్‌బ్లాక్ చేసుకోవచ్చు. అందుకు 1800112211, 18004253800కు ఫోన్ చేసి చేసుకోవచ్చు.
అయితే, ఏటీఎం కార్డు తాత్కాలికంగా బ్లాక్ అయినప్పుడు మాత్రమే యాక్టివేట్ చేసుకోవచ్చని గుర్తుంచుకోవాలి. శాశ్వతంగా బ్లాక్ అయితే బ్యాంకును సంప్రదించి కొత్త కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
COMMENTS