Income Tax Notice: If you pay house rent like that, you will get tax notice.. Be careful..!!
Income Tax Notice: ఇంటి అద్దె అలా కడితే టాక్స్ నోటీసులొస్తాయ్.. జాగ్రత్త..!!
Fake Rent Payments: దేశంలో డిజిటల్ ఆర్థిక వ్యవస్థ ఊపందుకోవటంతో చాలా మంది క్రెడిట్ కార్డులను విరివిగా వినియోగిస్తున్నారు. చెల్లింపుల్లో సౌకర్యంతో పాటు భద్రత, క్యాష్ బ్యాక్స్, రివార్డులు వంటి ప్రోత్సాహకాల కారణంగా వీటి నినియోగం వేగంగా పెరుగుతోంది.
ఈ క్రమంలో కొందరు ఇంటి అద్దె చెల్లింపుల పేరుతో నకిలీ ట్రాన్సాక్షన్లు చేస్తున్నారు. ఆ డబ్బును బంధువులు లేదా స్నేహితుల ఖాతాలకు మళ్లిస్తున్నారు. దీనిపై అనేక ప్లాట్‌ఫారమ్‌లు నామమాత్రపు రుసుము 1% యూజర్ల నుంచి వసూలు చేస్తున్నాయి. చాలా మంది రివార్డులను సంపాదించటానికి ఈ మార్గాన్ని ఎంచుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే కొందరు మాత్రం తక్కువ ఖర్చులో క్రెడిట్ కార్డుల నుంచి డబ్బును తీసుకోవటానికి ఈ మార్గాన్ని ఎంచుకుంటున్నారు.
కొందరు తమ క్రెడిట్ కార్డు స్పెండింగ్ లిమిట్స్ లక్ష్యాలను చేరుకునేందుకు ఇలాంటి మార్గాన్ని ఎంచుకున్నట్లు సమాచారం. మరికొందరు పన్ను మినహాయింపుల కోసం ఇలా చేస్తున్నారు. టాక్స్ మినహాయింపుల కోసం ఇలా డబ్బు ట్రాన్సాక్షన్లు చేసి వాటికి నకిలీ అద్దె రసీదులు సమర్పించటం చట్ట విరుద్ధమని గుర్తుంచుకోండి. ఇలాంటి వాటిని పన్ను అధికారులు పర్యవేక్షిస్తున్నారు. పన్ను ఎగవేతదారులకు నోటీసులు కూడా పంపుతున్నారు.
అద్దె ఆదాయాన్ని మీ బంధువులకు లేదా స్నేహితులకు పంపినప్పుడు దానిని వారు ఆదాయపుపన్ను రిటర్నుల్లో చూపించాల్సి ఉంటుంది. ఏడాదికి అద్దె ద్వారా ఆదాయం లక్ష దాటితే మీకు అద్దె చెల్లించిన వారి పాన్ వివరాలు తప్పక నమోదు చేయాల్సి ఉంటుంది. దీనిని చేయటంలో విఫలమైతే పన్ను అధికారుల నుంచి నోటీసులు అందుకోవచ్చు. అలాగే నిర్థేశించిన పరిమితులకు మించి అద్దె వసూలు చేస్తున్నప్పుడు దానిలో నుంచి టీడీఎస్ తీసివేయాల్సి ఉంటుంది. లేకుంటే పెనాల్టీ పడుతుంది.
దేశంలో అద్దెను చెల్లించేటప్పుడు లేదా తీసుకునేటప్పుడు అవి ఆదాయపు పన్ను నిబంధనలకు అనుగుణంగా ఉండేలా చూసుకోవటం చాలా కీలకం. దానికి సంబంధించిన నియమాలు, బాధ్యతల గురించి తప్పక తెలుసుకోవాలి. క్రెడిట్ కార్డు ద్వారా తప్పుడు అద్దె చెల్లింపులు చేయటం మిమ్మల్ని సమస్యల వలయంలో చిక్కుకునేలా చేసే ప్రమాదం ఉంది. చట్టవిరుద్ధంగా చేసే చెల్లింపుల కారణంగా ఆదాయపు పన్ను శాఖ నుంచి నోటీసులు పొందే ప్రమాదం ఉంది. అవి తీవ్రమైన పరిణామాలకు దారితీయవచ్చని గుర్తుంచుకోండి. ఫేక్ రెంట్ పేమెంట్స్‌కి దూరంగా ఉండడం ఉత్తమం.
COMMENTS