IIT Graduate: A new record.. An IIT Bombay graduate earns Rs. A job with a salary of 3.7 crores!
IIT Graduate: సరికొత్త రికార్డ్.. ఐఐటీ బాంబే గ్రాడ్యుయేట్‌కు ఏడాదికి రూ. 3.7 కోట్ల జీతంతో ఉద్యోగం!
IIT Jobs: ఐఐటీ బాంబే గ్రాడ్యుయేట్ ఒకరు చరిత్ర సృష్టించారు. ప్లేస్‌మెంట్ డ్రైవ్‌లో అత్యధిక వార్షిక వేతనంతో జాబ్ ఆఫర్ అందుకున్నారు. ఐఐటీ బాంబే ఇటీవలే యాన్యువల్ ప్లేస్‌మెంట్ డ్రైవ్ నిర్వహించగా.. ఒక గ్రాడ్యుయేట్ రూ. 3.7 కోట్ల వార్షిక వేతనంతో ఇంటర్నేషనల్ ఆఫర్‌కు ఎంపికయ్యారు. ఇదే ఐఐటీ బాంబే హైయెస్ట్ ఎవర్ ఇంటర్నేషనల్ ఆఫర్ కావడం విశేషం. ఇక టాప్ డొమెస్టిక్ శాలరీ (దేశీయంగా ఉద్యోగం) విషయానికి వస్తే అత్యధికంగా ఒకరు ఏడాదికి రూ.1.7 కోట్ల జీతంతో సెలక్ట్ అయ్యారు.
గతేడాదితో పోలిస్తే వేతన ప్యాకేజీలు భారీగా పెరగడం విశేషం. ఇంటర్నేషనల్ ఆఫర్‌కు సంబంధించి కిందటేడాది అత్యధికంగా వార్షిక వేతనం రూ.2.1 కోట్లు మాత్రమే కాగా.. ఈసారి 70 శాతం వరకు పెరిగింది. దేశీయంగా అత్యధిక వేతనాలకు సంబంధించి మాత్రం కాస్త తగ్గింది. కిందటేడాది ఐఐటీ గ్రాడ్యుయేట్ దేశీయంగా జాబ్ ఆఫర్లకు సంబంధించి వార్షిక వేతనం అత్యధికంగా రూ.1.8 కోట్లు అందుకోగా.. ఈసారి అది రూ.1.7 కోట్లకు తగ్గింది.
టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ ప్రకారం.. ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ సెక్టార్ నుంచి ఎక్కువగా ఈసారి ప్లేస్‌మెంట్లకు సెలక్ట్ అయ్యారు. సగటు వేతన ప్యాకేజీలు మాత్రం గతేడాదితో పోలిస్తే కాస్త మెరుగయ్యాయి. పోవై (ముంబయి) క్యాంపస్‌లో సీజన్‌లో సగటు వేతనం రూ. 21.8 లక్షలుగా ఉండగా.. అంతకుముందు ఆర్థిక సంవత్సరం రూ.21.5 లక్షలుగా,, 2020-21లో ఇది సగటున రూ.17.9 లక్షలుగా ఉండేది.
లేటెస్ట్ ప్లేస్‌మెంట్ డ్రైవ్స్‌లో దాదాపు 16 ఇంటర్నేషనల్ ఆఫర్లు.. రూ. కోటికిపైగా వార్షిక వేతనంతో వచ్చాయి. మొత్తం 300 ఉద్యోగాలకు గానూ 194 మంది ఆఫర్లను అందుకున్నారు. వీటిల్లో 65 ఉద్యోగ ఆఫర్లు అంతర్జాతీయ స్థాయిలో ఉండటం విశేషం. కిందటేడాదితో పోలిస్తే ఇది కాస్త తక్కువేనని చెప్పొచ్చు. ఇంటర్నేషనల్ ఆఫర్లు ఎక్కువగా అమెరికా, జపాన్, యూకే, నెదర్లాండ్స్, హాంగ్ కాంగ్, తైవాన్ నుంచి ఉన్నాయి. రష్యా- ఉక్రెయిన్ యుద్ధం, ఆర్థిక మాంద్యం సంకేతాలు, ప్రపంచ వ్యాప్తంగా అనిశ్చిత పరిస్థితుల నడుమ కూడా ఈ స్థాయిలో ప్లేస్‌మెంట్ ఆఫర్స్ రావడం సానుకూల పరిణామమని నిపుణులు చెబుతున్నారు.
COMMENTS