HPCL Recruitment 2023: Jobs in Hindustan Petroleum Corporation Limited with a salary of Rs.2,80,000 per month
HPCL Recruitment 2023: నెలకు రూ.2,80,000 జీతంతో హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. ఈ అర్హతలు అవసరం..
కేంద్ర ప్రభుత్వ విభాగానికి చెందిన ముంబయిలోని హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెపీసీఎల్).. 37 సీనియర్ ఆఫీసర్, సీనియర్ మేనేజర్, చీఫ్ మేనేజర్/ డిప్యూటీ జనరల్ మేనేజర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి అనలిటికల్/ ఆర్గనిక్/ ఫిజికల్ కెమిస్ట్రీ/ కెమికల్ ఇంజనీరింగ్/ రెనెవబుల్ ఎనర్జీ/ ఎనర్జీ/ మెకానికల్/ థర్మల్ ఇంజనీరింగ్/ ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీరింగ్/ ఆటోమొబైల్/ మెటలర్జీ/ మెటీరియల్ సైన్స్ తత్సమాన కోర్సులో పీహెచ్ డీ లేదా కెమికల్/ ఎలక్ట్రానిక్స్/ ఎటక్ట్రోకెమికల్ ఇంజనీరింగ్/ థర్మల్ ఇంజనీరింగ్/ ఆర్గానిక్ కెమిస్ట్రీ/ కెమికల్ ఇంజనీరింగ్ లేదా తత్సమాన కోర్సులో ఎంటెక్ లేదా ఎంఈలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే సంబంధిత పనిలో మూడు నుంచి 12 ఏళ్ల అనుభవం కూడా ఉండాలి.
అలాగే వయోపరిమితి 30 నుంచి 48 ఏళ్ల మధ్య ఉండాలి. ఈ అర్హతలున్నవారు ఆన్‌లైన్ విధానంలో సెప్టెంబర్ 30, 2023వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో యూఆర్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ కేటగిరీలకు చెందిన అభ్యర్థులు రూ.1180 అప్లికేషన్ ఫీజు కింద చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగ కేటగిరీలకు చెందిన అభ్యర్థులు ఎలాంటి ఫీజు చెల్లించనవసరం లేదు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, గ్రూప్ టాస్క్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.
జీతభత్యాల వివరాలు..
ఎంపికైన వారికి చీఫ్ మేనేజర్ పోస్టులకైతే నెలకు రూ.1,00,000 నుంచి రూ.2,60,000 వరకు జీతంగా చెల్లిస్తారు. డిప్యూటీ జనరల్ మేనేజర్ పోస్టులకు రూ.1,20,000 నుంచి రూ.2,80,000 వరకు జీతంగా చెల్లిస్తారు. సీనియర్ మేనేజర్ పోస్టులకు నెలకు రూ.90,000 నుంచి రూ.2,40,000 వరకు జీతంగా చెల్లిస్తారు. అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు నెలకు రూ.70,000 నుంచి రూ.2,20,000 వరకు జీతంగా చెల్లిస్తారు.
వివరాలు:
సీనియర్ ఆఫీసర్/ అసిస్టెంట్ మేనేజర్/ మేనేజర్ పోస్టులు: 27
సీనియర్ మేనేజర్ పోస్టులు: 6
చీఫ్ మేనేజర్/ డిప్యూటీ జనరల్ మేనేజర్ పోస్టులు: 4
Important Links:
FOR NOTIFICATION CLICKHERE.
FOR FULL INFORMATION CLICKHERE.
COMMENTS