How to Claim LPG Insurance Policy: Do you know how to get insurance in case of gas cylinder explosion?
How to Claim LPG Insurance Policy: గ్యాస్ సిలిండర్ పేలితే ఇన్సూరెన్స్.. ఎలా పొందాలో మీకు తెలుసా..?
How to Claim Gas Cylinder Insurance : గ్యాస్ సిలిండర్ పేలుడు వార్తలు తరచూ చూస్తూనే ఉంటాం. ఈ ప్రమాదం జరిగితే.. ఎలాంటి నష్టం జరుగుతుందో ఊహించలేం. ప్రాణ నష్టం నుంచి ఆస్తి నష్టం దాకా ఏదైనా జరగొచ్చు. ఎంత స్థాయిలోనైనా జరగొచ్చు. అయితే.. ఎల్‌పీజీ సిలిండర్ పేలితే.. వినియోగదారుడికి పలు హక్కులు ఉన్నాయనే విషయం చాలా మందికి తెలియదు. జరిగిన నష్టానికి ఇన్సూరెన్స్ లభిస్తుందనే విషయం కూడా తెలియదు. దీని కోసం వినియోగదారులు ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. ఇంకా.. మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
Insurance Coverage Rules : గ్యాస్(LPG) కనెక్షన్ తీసుకునే వినియోగదారులందరికీ పెట్రోలియం కంపెనీలు వ్యక్తిగత ప్రమాద బీమాను కల్పిస్తున్నాయి. ఎల్‌పీజీ సిలిండర్ నుంచి గ్యాస్ లీక్ కావడం వల్ల లేదా సిలిండర్ పేలుడు వంటి కారణాలతో ప్రమాదం జరిగితే.. ప్రమాద తీవ్రతను బట్టి.. 40 లక్షల రూపాయల వరకు కంపెనీలు ఇన్సూరెన్స్ చెల్లిస్తాయి. గ్యాస్ సిలిండర్ పేలితే దానికి డిస్ట్రిబ్యూటర్, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు బాధ్యత తీసుకోవలసి ఉంటుంది.
సిలిండర్ పేలుళ్ల ఘటనలు కస్టమర్ల ఇంట్లో జరిగితేనే పర్సనల్ యాక్సిడెంట్ కవర్‌ను కంపెనీలు అందిస్తాయి. గ్యాస్ సిలిండర్ పేలుడు వల్ల కస్టమర్లకు 40 లక్షల రూపాయల వరకు ఇన్సూరెన్స్ లభిస్తుంది. ఈ ప్రమాదంలో ఎవరైనా చనిపోతే.. ఒక్కో వ్యక్తికి రూ.5 లక్షల బీమా కవరేజ్ వస్తుంది. తీవ్ర గాయాలైతే.. ఒక్కో ఘటనకు రూ.15 లక్షల వరకు వైద్య ఖర్చులు అందుతాయి. ప్రాపర్టీ డ్యామేజ్ అయితే.. గరిష్ఠంగా రూ.2 లక్షల కవరేజ్ వస్తుంది. ఎల్‌పీజీ సిలిండర్ ఇన్సూరెన్స్ బీమా పొందాలంటే.. ఘటన జరిగిన వెంటనే.. కస్టమర్ పోలీసులకు ఫిర్యాదు చేయాలి. అలాగే ఎల్‌పీజీ డిస్ట్రిబ్యూటర్‌కు కూడా విషయాన్ని చేరవేయాలి.
How to Get Rs.40 Lakhs Claim..? : ప్రమాదం గురించి డిస్ట్రిబ్యూటర్‌కి, సమీపంలోని పోలీసు స్టేషన్ కు ఫిర్యాదు చేసిన తర్వాత.. వారు విచారణ చేపడతారు. ఎల్‌పీజీ సిలిండర్ పేలడం వల్లనే ఘటన జరిగిందని నిర్ధారిస్తే.. ఆ విషయాన్ని సంబంధిత ఆయిల్ కంపెనీకి, ఇన్సూరెన్స్ కంపెనీకి డిస్ట్రిబ్యూటర్ సమాచారం అందిస్తారు. ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ చూసిన తర్వాత.. కంపెనీ వద్ద ఇన్సూరెన్స్ క్లయిమ్‌కి దరఖాస్తు చేస్తారు. దీని కోసం కన్సూమర్ నేరుగా కంపెనీతో కాంటాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు.
క్లయిమ్ కోసం కావాల్సిన డాక్యుమెంట్లు..
- మరణ ధ్రువీకరణ పత్రం
- పోస్ట్ మార్టం నివేదిక
- కరోనర్ నివేదిక
- విచారణ నివేదిక
- వైద్య బిల్లులు
- డాక్టర్ ప్రిస్క్రిప్షన్లు
- డిశ్చార్జ్ కార్డ్
COMMENTS