How to Change Truecaller Name: You can change your name in Truecaller.. Did you know?
How to Change Truecaller Name : ట్రూ కాలర్‌లో మీ పేరు మార్చుకోవచ్చు.. మీకు తెలుసా?
Change Your Name on Truecaller : ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ కలిగిన కాలర్ ఐడీ యాప్‌గా .. ట్రూ కాలర్‌ను చెప్పుకోవచ్చు. ముఖ్యంగా నేటి ఆధునిక కాలంలో పెరుగుతున్న సైబర్ మోసాల(Cyber Frauds)ను దృష్టిలో పెట్టుకొని చాలా మంది ఈ యాప్‌ను ఫాలో అవుతున్నారనే చెప్పుకోవచ్చు. మన కాంటాక్ట్ లిస్ట్‌లో లేని వ్యక్తులు కాల్ చేసినప్పుడు.. వారి వివరాలను తెలియజేస్తుందీ యాప్. ఫోన్ రింగ్ అవడానికి ముందే మనకు ఎవరు కాల్ చేస్తున్నారో ఇట్టే చెప్పేస్తుంది.
How to Change Your Truecaller Name in Online : అయితే కొన్నిసార్లు ట్రూ కాలర్ యాప్(Truecaller APP) లో యూజర్ పేరు తప్పుగా ఉంటుంది. లేదంటే.. మరో యూజర్ తన పేరు మార్చుకొని.. నిక్ నేమ్ పెట్టుకోవాలని అనుకోవచ్చు. ఇలాంటి వారు.. ట్రూ కాలర్‌లో తమ పేరు ఎలా మార్చుకోవాలో తెలియక ఇబ్బంది పడుతుంటారు. ఇలాంటి వారికోసమే ఈ స్టోరీ. ఈ సింపుల్ టిప్స్ తో ఇప్పుడే ట్రూ కాలర్ మీ పేరును మార్చుకోండి.
How to Change Truecaller Name with Mobile App :
మొబైల్ యాప్ ద్వారా మీ ట్రూ కాలర్ పేరు ఎలా మార్చుకోవాలో చూద్దాం..
మొదట మీ మొబైల్లో Truecaller యాప్‌ని ఓపెన్ చేయాలి.ఆ తర్వాత మీ మొబైల్ స్క్రీన్ పై లెఫ్ట్ కార్నర్లో ఉన్న ప్రొఫైల్ ఐకాన్‌పై నొక్కాలి.అనంతరం మీ ప్రొఫైల్ విభాగంలోకి వెళ్లి.. 'Complete Your Profile' అనే బటన్‌పై క్లిక్ చేయాలి.ఇప్పుడు మీరు Truecallerలో ప్రదర్శించాలనుకుంటున్న కొత్త పేరును నమోదు చేయాలి.పేరు మార్చిన తర్వాత 'Save' ఆప్షన్ పై క్లిక్ చేయాలి.ఇలా మార్చిన తర్వాత.. మారిన పేరును వెంటనే ప్రొఫైల్‌లో చూపుతుంది.ఇతర ట్రూకాలర్ వినియోగదారులకు చూపించడానికి కొంత సమయం పడుతుంది.
ట్రూకాలర్‌లో కొత్త ఫీచర్.. ఆటోమెటిక్ కాల్ ఆన్సర్.. అవతలి వ్యక్తి మాటలు మీ స్క్రీన్‌పై టెక్స్ట్ రూపంలో..వెబ్ సైట్ ద్వారా మార్చుకోండిలా..పేరు మార్చుకోవడానికి ప్రత్యేకంగా యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలా..? అని కొందరు అనుకుంటారు. ఇలాంటి వారికి మరో ఆప్షన్ కూడా ఉంది. అదే వెబ్ సైట్. కంప్యూటర్ లో Truecaller వెబ్సైట్ లోకి వెళ్లి.. పేరు ఈజీగా మార్చుకోవచ్చు. ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
How to Change Your Truecaller Name Using Web Browser :
మొదట మీరు Truecaller వెబ్‌సైట్‌కి వెళ్లి.. టాప్ రైట్ కార్నర్లో ఉన్న 'Sign in' ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.ఆ తర్వాత, మీ మెయిల్ ద్వారా లాగిన్ అయ్యి.. 'any option from those' అనే దానిపై క్లిక్ చేయాలి.మీ మొబైల్ నంబర్‌ను, అలాగే ఏ నంబర్ పేరును మార్చాలనుకుంటున్నారో దానిని సెర్చ్ చేయండి. ఆపై 'search option'పై నొక్కాలి.అనంతరం 'Suggest Name' అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.కొత్త పేరును టైప్ చేసి.. 'Submit' బటన్‌పై క్లిక్ చేస్తే ప్రక్రియ పూర్తవుతుంది.
COMMENTS