Google Internship: Bumper offer for finalist students.. A lump sum of Rs. Google internship with a salary of 83,000.. Don't miss the opportunity..
Google Internship: ఫైనాలియర్ విద్యార్థులకు బంపర్ ఆఫర్.. ఏకంగా రూ. 83,000 జీతంతో గూగుల్ ఇంటర్న్‌షిప్.. అవకాశం వదలొద్దు..
సాఫ్ట్ వేర్ ఇంజినీర్‌గా కెరియర్‌లో స్థిరపడాలని కలలు కంటున్నారా? అందుకోసం శక్తి వంచన లేకుండా కష్టపడుతున్నారా? అకడమిక్స్ మంచి మార్కులు సాధించి, ప్రాక్టికల్ నాలెడ్జ్ సంపాదించాలని ఫోకస్డ్ గా పనిచేస్తున్నారా? అయితే మీకో శుభవార్త. ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ మీకు అద్భుతమైన అవకాశాన్ని అందిస్తోంది. వింటర్ ఇంటర్న్‌షిప్-2024 పేరిట ప్రత్యేక ప్రోగ్రామ్ ను ప్రకటించింది. కంప్యూటర్స్ సైన్స్ లో బ్యాచిలర్ డిగ్రీ, మాస్టర్స్, డ్యూయల్ డిగ్రీ కోర్సుల్లో చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు దీనిలో దరఖాస్తు చేసుకునే వీలు ఉంది. ఎంపికైన విద్యార్థులు టెక్ జెయింట్ అయిన గూగుల్ తో కలసి పనిచేయడంతో పాటు భారీగా స్టైఫండ్ కూడా పొందొచ్చు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
ఇంటర్న్‌షిప్‌లకు డిమాండ్..
ఇటీవల కాలంలో ఇంటర్న్‌షిప్‌లకు బాగా డిమాండ్ పెరుగుతోంది. విద్యార్థులకు ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించే ముందే పని అనుభవం దీని ద్వారా అందుతుంది. తద్వారా ఉద్యోగంలో చేరిన మొదటి రోజు నుంచే కంపెనీ పని ప్రారంభించే అవకాశం ఉంటుంది. ఎటువంటి ట్రైనింగ్ లేకుండా కంపెనీలకు మేలు జరుగుతోంది. ప్రస్తుతం అనేక సంస్థలు ఈ ఇంటర్న్‌షిప్‌లకు అవకాశం కల్పిస్తున్నాయి. ఇవి చేయడం ద్వారా సంబంధిత ఫీల్డ్ లో వర్క్ చేసే విధానంపై అవగాహన ఏర్పడుతుంది. అవసరమైన నైపుణ్యాలు పెంపొందించుకోవచ్చు. ఇదే క్రమంలో గూగుల్ వింటర్ ఇంటర్న్‌షిప్-2024ను ప్రకటించింది.
దరఖాస్తు ఇలా..
ముందుగా రెజ్యూమ్ ను సిద్ధం చేసుకోవాలి. దానిలో జ్యూమ్ లో కోడింగ్ లాంగ్వేజ్ స్కిల్స్ వివరాలను తప్పనిసరిగా పేర్కొనాలి. తర్వాత ఈ లింక్ లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. https://cse.noticebard.com/internships/google-winter-internship-2024
లింక్ ఓపెన్ చేశాక రెజ్యూమ్ సెక్షన్ లోకి వెళ్లి మీ రెజ్యూమ్ ని అప్ లోడ్ చేయాలి.
ఆ తర్వాత హయ్యర్ ఎడ్యుకేషన్ సెక్షన్ లో సంబంధిత వివరాలు ఎంటర్ చేయాలి. డిగ్రీ స్టేటెస్ కింద నౌ అటెండింగ్ ఆప్షన్ ను ఎంచుకోవాలి.
ఆ తరువాత రీసెంట్ ఇంగ్లిష్ ట్రాన్స్క్రిప్ట్ ను అప్ లోడ్ చేసి, అప్లికేషన్ సబ్ మిట్ చేయాలి.
అర్హతలు ఇవి..
సాఫ్ట్ వేర్ డెవలమ్ మెంట్ లేదా సంబంధిత సాంకేతిక రంగంపై దృష్టి సారించే అసోసియేట్, బ్యాచిలర్ లేదా మాస్టర్స్ డిగ్రీ ప్రోగ్రామ్ లో నమోదై ఉండాలి. సాఫ్ట్ వేర్ డెవలమెంట్ లో అనుభవం అవసర. సీ, సీ++, జావా, జావా స్క్రిప్ట్ , పైథాన్ వంటి భాషల్లో నైపుణ్యం ఉండాలి. అంతే కాక డేటా స్ట్రక్చర్స్, అల్గారిథమ్స్, వెబ్ అప్లికేషన్ డెవలప్మెంట్ యూనిక్స్, లైనక్స్ ఎన్విరాన్మెంట్లు, మొబైల్ అప్లికేషన్ డెవలప్మెంట్, డిస్ట్రిబ్యూట్ అండ్ ప్యారలల్ సిస్టమ్స్, మెషీన్ లెర్నింగ్, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, నెట్ వర్కింగ్ వంటి అంశాలపై కనీస అవగాహన ఉండాలి. ముఖ్యంగా ఇంగ్లిష్ భాషపై పట్టు తప్పనిసరి.
ఏం చేయాలి..
గూగుల్ ఇంటర్న్‌షిప్‌నకు ఎంపికైన మీరు సంస్థలో సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ ఇంటర్న్ గా పనిచేయాల్సి ఉంటుంది. గూగుల్ సాంకేతికతకు మరింత శక్తినిచ్చేలా పనిచేయాలి. అందుకోసం ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొంటూ సేవలు అందించాలి. ముఖ్యంగా సెర్చ్ సామర్థ్యాన్ని మరింత మెరుగుపరచడం, కంప్యూటింగ్ ప్లాట్ ఫారంలు, నెట్ వర్కింగ్ టెక్నాలజీలను అభివృద్ధి చేయడం, వీడియో ఇండెక్సింగ్ ఆటోమేట్ చేయడం, కఠినమైన సిస్టమ్ లను ఆప్టిమైజ్ చేయడం వంటి విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. మీకు ఎదురయ్యే క్లిష్టమైన సమస్యలకు వినూత్న పరిష్కారాలను కొనుగొనడమే ఇంటర్న్ ప్రధాన విధిగా ఉంటుంది.
ఊహించని విధంగా స్టైఫండ్..
మీరు ఇంటర్న్ షిప్ నకు ఎంపికైతే మీ పని ప్రదేశాన్ని మీరే ఎంచుకునే అవకాశం దొరకుంతుంది. బెంగళూరు, హైదరాబాద్ లొకేషన్స్‌లో ఏదో ఒకదాన్ని మీరు ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు కనీసం ఆరు నెలలు ఫుల్ టైమ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. స్టైఫండ్ కూడా భారీగా ఉంటుంది. నెలకు ఏకంగా రూ. 83, 947 వస్తుంది. ఈ ఇంటర్న్ షిప్ 2024 జనవరి నుంచి ప్రారంభం అవుతుంది. మొత్తం 22 నుంచి 24 వారాల పాటు ఇది కొనసాగుతుంది.
COMMENTS