Do you know about IRCTC travel insurance policy..? Less cost, more protection.
IRCTC ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీ గురించి మీకు తెలుసా..? ఖర్చు తక్కువ రక్షణ ఎక్కువ..
Travel Insurance: ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం ప్రస్తుతం ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్రాముఖ్యతను తెరమీదకు తెచ్చింది. భారతీయ రైల్వేలలో ప్రయాణించే వారు దీని ప్రయోజనాన్ని పొందటం ఎలా అనేదానిపై ఇప్పుడు అందరి దృష్టి పడింది.
IRCTC పోర్టల్ ద్వారా టిక్కెట్లను బుక్ చేసుకునేటప్పుడు ట్రావెల్ ఇన్సూరెన్స్ ఎంచుకునే ఎంపికను పాసింజర్లకు రైల్వేలు అందిస్తోంది. అయితే ఇది తప్పనిసరి మాత్రం కాదు. ఇన్సూరెన్స్ పాలసీని టిక్కెట్ తో పాటు కొనుగోలు చేసిన వ్యక్తులకు రైలు ప్రయాణ సమయంలో ప్రమాదం జరిగి దెబ్బలు తగిలినా లేక మరణం సంభవించినా పరిహారం అందించబడుతుంది.
భారతీయ రైల్వేలు అందిస్తున్న ట్రావెల్ ఇన్సూరెన్స్ అత్యంత తక్కువ ఖర్చుతోనే ప్రయాణికులకు రక్షణను అందిస్తోంది. ఆన్ లైన్ లో టిక్కెట్ బుక్ చేసుకునేటప్పుడు ఒక్కో ప్రయాణికుడు కేవలం 0.35 పైసలు చెల్లించి ఇన్సూరెన్స్ రక్షణను పొందవచ్చు. అలా కవర్ కొనుగోలు చేసిన వారికి ఐదు రకాల ప్రయోజనాలను పొందవచ్చు.
- ప్రయాణ సమయంలో దెబ్బలు తగిలిన దానివల్ల వ్యక్తి 12 నెలల్లో మరణిస్తే వారికి 100 శాతం క్లెయిమ్ అందించబడుతుంది. అంటే పాలసీ ప్రకారం వారికి రూ.10 లక్షల పరిహారం అందుతుంది.
- ఒకవేళ ప్రయాణ సమయంలో ప్రమాదం వల్ల 12 నెలల్లోపు శాశ్వతంగా పూర్తి వైకల్యం ఏర్పడితే వారికి ఇన్సూరెన్స్ పాలసీ కవర్ కింద 100 శాతం అంటే రూ.10 లక్షల పరిహారం చెల్లించబడుతుంది.
- ప్రయాణికుడు ప్రమాదం వల్ల 12 నెలల్లోపు శాశ్వత పాక్షిక వైకల్యానికి గురైతే పాలసీ కింద వారికి రూ.7.50 లక్షల వరకు పరిహారంగా అందుతుంది. అయితే పాలసీలో పేర్కొన్న విధంగా ప్రయాణీకుల పరిస్థితులపై ఆధారపడి అందుబాటులో ఉన్న మెుత్తం చెల్లించటం జరుగుతుంది.
- అలాగే ప్రమాదం వల్ల ఆస్పత్రిపాలైతే అందుకోసం ఇన్సూరెన్స్ కవర్ కింద చికిత్స కోసం రూ.2 లక్షల వరకు అందించబడుతుంది.
- పాలసీ కింద పేర్కొన్న విధంగా ప్రమాదం లేదా అవాంఛనీయ సంఘటనల కారణంగా ప్రయాణ సమయంలో బీమా చేయబడిన ప్రయాణీకుడు మరణిస్తే, ప్రయాణీకుల నివాస స్థలానికి లేదా దహన సంస్కారాలకు లేదా ఖననం చేయడానికి ఇన్సూరెన్స్ కంపెనీ రవాణా ఖర్చుల కోసం రూ.10,000 చెల్లిస్తుంది.
అయితే ట్రావెల్ ఇన్సూరెన్స్ కవర్ తీసుకున్న బాధితుడు లేదా వారి కుటుంబ సభ్యులు పరిహారం పొందేందుకు అర్హులు. క్లెయిమ్ పొందేందుకు వారు సమీపంలోని ఎల్ఐసీ బీమా సంస్థ కార్యాలయాన్ని సంప్రదించి పూర్తి స్టేట్మెంట్ అందించాల్సి ఉంటుంది. వారు అడిగిన తగిన ఆధారాలు, రుజువులను సమర్పించాలి.
COMMENTS