CLRI Recruitment 2023: Junior Stenographer Jobs in Central Govt
CLRI Recruitment 2023: కేంద్ర ప్రభుత్వ సంస్థలో జూనియర్ స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలు.. ఇంటర్ అర్హత ఉంటే చాలు..
భారత ప్రభుత్వ రంగానికి చెందిన చెన్నైలోని సీఎస్‌ఐఆర్ ఆధ్వర్యంలోని సెంట్రల్ లెదర్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (CSIR – CLRI).. తాత్కాలిక ప్రాతిపదికన జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ వెలువరించింది. ఆసక్త కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. అక్టోబర్ 8, 2023వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి ఇంటర్మీడియట్ లేదా 10+2 లేదా 12వ తరగతి లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే అభ్యర్ధుల వయసు తప్పనిసరిగా 27 ఏళ్లకు మించకుండా ఉండాలి. వయోపరిమితి విషయంలో ఓబీసీ కేటగిరీకి చెందిన అభ్యర్ధులకు మూడేళ్లు, పీడబ్ల్యూబీడీ కేటగిరీకి చెందిన అభ్యర్ధులకు పదేళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఆసక్తి కలిగిన వారు అక్టోబర్ 8, 2023వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరూ రూ.100 రిజిస్ట్రేషన్ ఫీజు కింద చెల్లించాలి. ఎంపికైన వారికి నెలకు రూ.48,207 జీతంగా చెల్లిస్తారు. పరీక్ష కేంద్రం చెన్నైలో ఉంటుంది.
రాత పరీక్ష విధానం...
ఆన్‌లైన్ విధానంలో రాత పరీక్ష ఉంటుంది. మూడు పార్టులుగా 200 మార్కులకు పరీక్ష ఉంటుంది. మొత్తం 2 గంటల 40 నిముషాల వరకు పరీక్ష ఉంటుంది. 200 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలకు వంద మార్కులకు రాత పరీక్ష ఉంటుంది. ప్రశ్నాపత్రం ఇంగ్లిష్, హిందీ మాద్యమంలో మాత్రమే ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 0.25 నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. ల్యాంగ్వేజ్ స్కిల్ టెస్ట్ ఇంగ్లిష్‌కు 50 నిముషాలు, హిందీకి 64 నిముషాలు పరీక్ష ఉంటుంది.
Important Links:
FOR NOTIFICATION CLICKHERE.
FOR FULL INFORMATION CLICKHERE.
COMMENTS