Bank Loan Agreement: Bank loan agreement in your own language from now on..!
Bank Loan Agreement: ఇక నుంచి మీ సొంత భాషలోనే బ్యాంకు లోన్ అగ్రిమెంట్..!
లోన్ ఎగ్రిమెంట్ సమయంలో ఇచ్చే నియమావళి ఇంగ్లీష్ లేదా హిందీలో ఉంటుంది. దీంతో ఆ భాషలు చదవడం రానివారు.. తప్పనిసరి పరిస్థితిలో అందులో ఏముందో చూడకుండానే తమ సమ్మతిని సంతకం రూపంలో ఇచ్చేస్తారు. ఇప్పుడు ఈ పరిస్థితి మారవచ్చు. ఎందుకంటే లోన్స్ కు సంబంధింగైడ్ లైన్స్ ప్రకారం హిందీ తరహాలో వినియోగదారుల సొంత భాషలోనే లోన్ అగ్రిమెంట్ ఉంటుంది. అందులో బ్యాంకులు పెనాల్టీ, ఆలస్య రుసుము నిబంధనలను బోల్డ్ అక్షరాలతో రాయాల్సి ఉంటుంది..
ఏదో ఒక అవసరం కోసం బ్యాంక్ నుంచి లోన్ తీసుకోవడం తప్పదు. లోన్స్ తీసుకునేటప్పుడు బ్యాంక్ విధించే షరతులు ఏమిటో పూర్తిగా ఎవరికీ అర్ధం కాకపోయినా.. అవసరం తీరాలనే తొందరలో అన్ని షరతులకు ఒప్పుకుంటున్నట్టు సంతకం చేసేయడం సాధారణంగా అందరూ చేసే పని. అదీకాకుండా.. లోన్ ఎగ్రిమెంట్ సమయంలో ఇచ్చే నియమావళి ఇంగ్లీష్ లేదా హిందీలో ఉంటుంది. దీంతో ఆ భాషలు చదవడం రానివారు.. తప్పనిసరి పరిస్థితిలో అందులో ఏముందో చూడకుండానే తమ సమ్మతిని సంతకం రూపంలో ఇచ్చేస్తారు. ఇప్పుడు ఈ పరిస్థితి మారవచ్చు. ఎందుకంటే లోన్స్ కు సంబంధింగైడ్ లైన్స్ ప్రకారం హిందీ తరహాలో వినియోగదారుల సొంత భాషలోనే లోన్ అగ్రిమెంట్ ఉంటుంది. అందులో బ్యాంకులు పెనాల్టీ, ఆలస్య రుసుము నిబంధనలను బోల్డ్ అక్షరాలతో రాయాల్సి ఉంటుంది.
జనవరి 1 తరువాత లోన్ అగ్రిమెంట్ కి సంబంధించి ఈ విషయాలను గమనించడం అవసరం.
- లోన్ అగ్రిమెంట్ కస్టమర్ స్వంత భాషలో ఉంటుంది. అలా చేస్తున్నప్పుడు, బ్యాంకులు లేట్ పేమెంట్స్ పై పెనాల్టీ.. లెట్ ఫీజు వంటి విషయాలను బోల్డ్ అక్షరాలతో ఇస్తాయి.
- హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు గృహ కొనుగోలుదారుకు రుణాన్ని సకాలంలో చెల్లించకపోతే ఎంత రుసుము తిరిగి ఇవ్వబడుతుందో తెలియజేస్తాయి. ఫ్లోటింగ్ నుంచి ఫిక్స్‌డ్‌కు రుణం తీసుకోవాలంటే, ఫీజు ఎంత? ప్రీమెచ్యూర్ పేమెంట్‌కు సంబంధించి పొజిషన్‌ను కూడా స్పష్టం చేయాల్సి ఉంటుంది.
- హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు స్థానిక భాషలో వినియోగదారునికి సాంక్షన్ లెటర్ ఇస్తాయి. దీనిలో, వార్షిక వడ్డీ రేటు.. EMI నిర్మాణాన్ని నిర్ణయించే ప్రక్రియ గురించి అర్థమయ్యే సమాచారం ఇవ్వాలి.
- గృహ రుణ కస్టమర్లకు వార్షిక ప్రాతిపదికన వడ్డీ రేటును తెలియజేయాలి. తద్వారా వినియోగదారుడు ఒక సంవత్సరంలో ఎంత వడ్డీ చెల్లిస్తున్నాడో తెలుసుకోవచ్చు.
- ఇంతకుముందు, పెనాల్టీ ఛార్జీ గురించి సమాచారం కూడా ఇవ్వాల్సి ఉండేది. అయితే, అది ఇప్పుడు అవసరం లేదు.
- లోన్ పై పెనాల్టీ లేదా ఛార్జీని నిర్ణయించడానికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న విధానాలను పాటిస్తారు. దీని కోసం బోర్డును ఏర్పాటు చేస్తారు. బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని అందరూ ఆమోదించాల్సి ఉంటుంది.
- ఇంతకు ముందు పేర్కొన్న షరతుల్లో ఏదైనా షరతులను కస్టమర్ ఉల్లంఘిస్తే.. దానిని స్పష్టంగా చెప్పాలి. వీటిని అమలు చేయడంలో ఏ కస్టమర్ పట్లా ఎటువంటి వివక్ష చూపించకూడదు.
- ఫైనాన్షియల్ కంపెనీల సేల్స్ టీమ్ లోన్ ఇచ్చే ముందు నిబంధనలు.. జరిమానాలను వివరంగా వివరించాలి. వడ్డీ రేట్లు వెబ్ సైట్‌లో ఉంచాలి.
- EMI చెల్లించని పక్షంలో కస్టమర్‌లకు పంపిన రిమైండర్ సందేశాలు పెనాల్టీ గురించి స్పష్టంగా వరించాలి.
- జనవరి 2024 తరువాత లోన్స్ తీసుకునే వారు ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోవడం అవసరం.
COMMENTS