7th Pay Commission: Good news for central government employees..
7th Pay Commision: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏ పెంపుపై కీలక ప్రకటన వచ్చే చాన్స్..
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులందరికీ కేంద్ర ప్రభుత్వం త్వరలో శుభవార్త చెప్పనుంది. ముఖ్యంగా డియర్‌నెస్ అలవెన్స్ పెంపును మోడీ ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉందిన ఉద్యోగ సంఘాల నాయకులు పేర్కొంటున్నారు. ఈ నెలాఖరులోగా డీఏ పెంపును ప్రకటించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపుతున్నాయి. పలు నివేదికల ప్రకారం జూలై 1, 2023 నుంచి అమల్లోకి వచ్చే డీఏ పెంపు 3 శాతంగా ఉంటుందని అంచనా. అంటే ఈ తాజా పెంపు తర్వాత కరువు భత్యం 45 శాతానికి చేరుకుంటుంది.
జీతం పెరుగుదల ఇలా
కేంద్ర ప్రభుత్వం నమ్మి 3 శాతం డీఏ పెంపును ప్రకటిస్తే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతం కచ్చితంగా పెరుగుతుంది. ఒక ఉద్యోగి జీతం నెలకు రూ.50,000 అనుకుంటే మూల వేతనంగా రూ. 15,000 ఉంటుంది. ప్రస్తుతం ఉన్న వేతనం ప్రకారం వారి డీఏ ఇప్పుడు రూ.6,300 ఉంటుంది. అంటే మూల వేతనంలో 42 శాతంగా ఉంటుంది. అయితే ఇప్పుడు ప్రభుత్వం 3 శాతం పెంచితే ఆ ఉద్యోగి నెలకు రూ.6,750 పొందుతారు. ఇది నెలకు రూ.450 ఎక్కువ. అందువల్ల ఒక ఉద్యోగి నెలకు రూ. 50,000 జీతం రూ. 15,000 ప్రాథమిక వేతనంగా పొందినట్లయితే అతని లేదా ఆమె జీతం నెలకు రూ. 450 పెరుగుతుంది. ప్రస్తుత పెంపు ప్రకారం తక్కువగానే ఉన్నా ధీర్ఘాకాలిక లెక్కల ప్రకారం చూస్తే ఇది ఉద్యోగికి మేలు జరుగుతుంది.
డీఏ పెంపు లెక్కింపు ఇలా
ఉద్యోగులు, పెన్షనర్లకు డియర్‌నెస్ అలవెన్స్‌తో పాటు డియర్‌నెస్ రిలీఫ్ పెంపుదల అనేది లేబర్ బ్యూరో ప్రతి నెలా విడుదల చేసే ఇండస్ట్రియల్ వర్కర్స్ కోసం తాజా వినియోగదారుల ధరల సూచిక ఆధారంగా రూపొందిస్తారు. ముఖ్యంగా ఈ లేబర్ బ్యూరో కార్మిక మంత్రిత్వ శాఖకు చెందిన విభాగం. జూలై 2023లో విడుదలైన తాజా డేటా ప్రకారం జూలై 2023కి సంబంధించిన ఆల్ ఇండియా సీపీఐ-ఐడబ్లయూ 3.3 పాయింట్లు పెరిగి 139.7కి చేరుకుంది. ఒక నెల శాతం మార్పుపై సంవత్సరం క్రితం సంబంధిత నెలల మధ్య నమోదైన 0.90 శాతం పెరుగుదలతో పోల్చితే గత నెలతో పోలిస్తే సూచిక 2.42 శాతం పెరిగింది. అయితే ఉద్యోగ సంఘాల నేతలు డీఏను 4 శాతం పెంచాలని డిమాండ్ చేస్తున్నాయి.
COMMENTS