Withdrawing PF money? How many days will be credited to the account?
పీఎఫ్ మనీ విత్‌డ్రా చేస్తున్నారా? ఎన్ని రోజుల్లోగా అకౌంట్లోకి జమ అవుతుందంటే?
EPF Withdrawal: ఉద్యోగం చేసే దాదాపు ప్రతి ఒక్కరికి కూడా పీఎఫ్ అకౌంట్ ఉండే ఉంటుంది. ఇక అందులో డబ్బులను రిటైర్మెంట్ సమయంలో లేదా జాబ్ చేయని సందర్భంలో మొత్తం విత్‌డ్రా చేసుకోవచ్చు. మధ్యలో కూడా నిర్దిష్ట అవసరాలకు కొంత మొత్తంలో డబ్బులు తీసుకోవచ్చు. అయితే.. పీఎఫ్ డబ్బులు అకౌంట్లో పడేందుకు ఎన్ని రోజులు పడుతుందో తెలుసా?
EPFO: మీకు అత్యవసరంగా డబ్బులు కావాలా? ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చని మీకు తెలుసా? దాదాపు ఉద్యోగం చేసే అందరికీ పీఎఫ్ అకౌంట్ ఉంటుంది. దీంట్లో ప్రతి నెలా మన వేతనం నుంచి 12 శాతం కట్ అయి పీఎఫ్ అకౌంట్లో జమ అవుతుంది. అంతే మొత్తంలో కంపెనీ కూడా యాడ్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ పీఎఫ్ డబ్బుల్ని మన అవసరాల సమయంలో విత్ డ్రా చేసుకునే సదుపాయం ఉంది. రిటైర్మెంట్, అలాగే జాబ్ పోయిన/చేయని సందర్భాల్లో మొత్తం తీసుకునేందుకు అవకాశం ఉంటుంది.
ఇక పీఎఫ్ డబ్బులు విత్‌డ్రా ఆన్‌లైన్‌లో లేదా ఆఫ్‌లైన్‌లో చేసుకోవచ్చు. ఈ విత్‌డ్రా కోసం అప్లై చేస్తే.. డబ్బులు అకౌంట్లో పడేందుకు ఎన్ని రోజులు పడుతుంది అనే దాని గురించి మనం ఇప్పుడు చూద్దాం. డబ్బులు అత్యవసరం అయితేనే పీఎఫ్ డబ్బులు తీసుకోవడం ఉత్తమమైన ఎంపిక అని నిపుణులు చెబుతున్నారు. లేదంటే.. మనం దీర్ఘకాలిక ప్రయోజనాలను కోల్పోయే ప్రమాదం ఉంటుంది. ఐదేళ్ల సర్వీస్ ముందే విత్ డ్రా చేస్తే కూడా టాక్స్ పడే అవకాశాలు ఉంటాయి.
పీఎఫ్ విత్ డ్రా లేదా పీఎఫ్ నగదు బదిలీ మనం ఆన్‌లైన్‌లో కూడా చేసుకోవచ్చు. పీఎఫ్ విత్‌డ్రా చేసుకున్న తర్వాత లేదా ట్రాన్స్‌ఫర్ ఆప్షన్ ఎంచుకున్న తర్వాత మీ క్లెయిం స్టేటస్ కూడా ఆన్‌లైన్‌లోనే చెక్ చేసుకోవచ్చు. అందుకే మీరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం కూడా లేదు. పీఎఫ్ అకౌంట్‌తో మీ ఆధార్ లింక్ అయిన సందర్భంలోనే ఈ సర్వీసులు పొందగలరు.
ఒక వినియోగదారు అడిగిన ప్రశ్నకు పీఎఫ్ డబ్బులు ఎన్ని రోజుల్లో పడతాయోననే దానిపై ఈపీఎఫ్‌ఓ క్లారిటీ ఇచ్చింది. EPFO ట్వీట్ ప్రకారం.. పీఎఫ్ విత్‌డ్రా కోసం సాధారణంగా 20 రోజుల టైం పడుతుంది. పీఎఫ్ ఖాతాదారులు.. ఇంకా పీఎఫ్ ఫైనల్ సెటిల్‌మెంట్ కోసమైతే ఫాం-16 ఉపయోగించాలి. పెన్షన్ విత్‌డ్రాయల్ కోసం ఫాం-10c వాడాలి. పీఎఫ్ నగదు పాక్షికంగా విత్‌డ్రా చేసుకునే వారు ఫాం-31 ఉపయోగించాలి. పీఎఫ్ విత్‌డ్రా కు సంబంధించి ఏమైనా కంప్లైంట్స్ ఉంటే.. పీఎఫ్ కమిషనర్‌కు ఫిర్యాదు చేయొచ్చు. వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో కూడా ఫిర్యాదు చేయొచ్చు.
ఎలా విత్‌డ్రా చేసుకోవాలంటే?
పీఎఫ్ నగదు ఉపసంహరణ కోసం.. ఈపీఎఫ్‌ఓ పోర్టల్‌కు వెళ్లాలి. అక్కడ సర్వీసెస్ ట్యాబ్‌లోకి వెళ్లాల్సి ఉంటుంది. దాంట్లో ఎంప్లాయీస్ ఆప్షన్ ఎంచుకోవాలి. తర్వాత మెంబర్ UAN/ఆన్‌లైన్ సర్వీసెస్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. దీంతో కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. మీ పీఎఫ్ నంబర్, పాస్‌వర్డ్‌తో లాగిన్ కావాలి. తర్వాత ఆన్‌లైన్ సర్వీసెస్ ట్యాబ్‌లోకి వెళ్లాలి. అక్కడ క్లెయిం ఆప్షన్ ఎంచుకోవాలి. కొత్త ట్యాబ్ తెరుచుకుంటుంది. అక్కడ బ్యాంక్ అకౌంట్ నంబర్ ఎంటర్ చేయాలి. వెరిఫై చేసుకోవాలి.
తర్వాత అడిగిన అన్ని వివరాలు కూడా అందించాలి. అడ్రస్, బ్లాంక్ చెక్/లేదా పాస్‌బుక్ వంటివి సమర్పించాలి. తర్వాత ప్రొసీడ్ ఫర్ ఆన్‌లైన్ క్లెయిం ఆప్షన్ ఎంచుకుంటే.. డ్రాప్ డౌన్ మెనూలో మీరు ఎందుకు పీఎఫ్ డబ్బులు విత్‌డ్రా చేస్తున్నారో ఎంచుకొని.. తర్వాత సబ్మిట్ చేయొచ్చు. ఇలా సులభంగా పీఎఫ్ డబ్బులు తీసుకోవచ్చు.
COMMENTS