WhatsApp New Feature: Your WhatsApp chat is more secure.. No one can open it without password..
WhatsApp New Feature: మీ వాట్సాప్ చాట్ ఇక మరింత భద్రం.. పాస్‌వర్డ్ లేకుండా ఎవరూ ఓపెన్ చేయలేరు..
మెటా యాజమాన్యంలో నడిచే వాట్సాప్ వినియోగదారులకు మరో కొత్త ఫీచర్ ను పరిచయం చేసింది. ఇది వాట్సాప్ డెస్క్ టాప్ వెర్షన్ కు సంబంధించిన అప్ డేట్. ఇప్పటి వరకూ వాట్సాప్ అనేక కొత్త ఫీచర్లు, అప్ డేట్లను పరిచయం చేసింది. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను పరిచయం చేయడంలో వాట్సాప్ ముందుంటుంది. అందుకే గ్లోబల్ లెవెల్లో మెసేజింగ్ ప్లాట్ ఫారంలో ముందంజలో ఉంది. మరీ ముఖ్యంగా మన దేశంలో ప్రతి రంగంలోనూ వాట్సాప్ కీలకంగా మారింది. కేవలం వ్యక్తిగత అవసరాలకు మాత్రమే కాకుండా, వ్యాపార, కుటుంబ అవసరాలకు కూడా వాట్సాప్ ఉపయోగపడుతోంది. అందరినీ కనెక్ట్ చేసి ఉంచుతుంది. అయితే వాట్సాప్ చాట్ భద్రత విషయంలో ఇప్పటి వరకూ ఓ భయం అందిరిలోనూ ఉంది. అదే చాట్ లకు ప్రత్యేకమైన భద్రత లేకపోవడం. అందరూ దానిని చూసే వీలుంటుంది. ఉదాహరణకు వాట్సాప్ డెస్క్ టాప్ వెర్షన్ తీసుకుంటే కోడ్ స్కాన్ చేయగానే చాట్ మొత్తం కనిపిస్తుంది. పొరపాటున దానిని లాగ్ అవుట్ చేయకపోతే చాట్ లు మొత్తం కనిపిస్తాయి. అందుకే ఇప్పుడు వాట్సాప్ సరికొత్త అప్ డేట్ డెస్క్ టాప్ వెర్షన్ల కోసం తీసుకొచ్చింది. అదే స్క్రీన్ లాక్ పీచర్. దీనిని ఎనేబుల్ చేసుకుంటే పాస్ వర్డ్ లేకుండా మీ చాట్లు ఓపెన్ కావు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
అందరికీ అందుబాటులోకి..
వాస్తవానికి ఈ ఫీచర్ గురించి గత కొంత కాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అందరికీ అందుబాటులోకి రాలేదు. వాబీటాఇన్ ఫో నివేదిక ప్రకారం వాట్సాప్ వెబ్ తాజా ఫీచర్ తో కూడిన వెర్షన్ వారికి అలాగే అధికారిక బీటా ప్రోగ్రామ్లో భాగమైన బీటా టెస్టర్లకు ఈ ఫీచర్ ఇప్పటికే అందుబాటులో ఉంది.
ఇలా ఎనేబుల్ చేయాలి..
వాట్సాప్ లో స్క్రీన్ లాక్ ఫీచర్ ఎనేబుల్ చేస్తే.. వీ చాట్లు అన్ని లాక్ అవుతాయి. మళ్లీ పాస్ వర్డ్ ఎంటర్ చేస్తేనే చాట్లు ఓపెన్ అవుతాయి. వినియోగదారులు ఇంకా దీనిని యాక్టివేట్ చేయకపోతే.. ముందు మీ వాట్సాప్ ని అప్ డేట్ చేసుకోవాలి. తర్వాత వాట్సాప్ సెట్టింగ్స్ లోకి వెళ్లి ప్రైవసీని క్లిక్ చేయాలి. దానిలో స్క్రీన్ లాక్ పాయింట్ అనేది మీకు కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి, పాస్ వర్డ్ సెట్ చేసుకుంటే సరిపోతోంది. ఈ పాస్‌వర్డ్ ప్రాంప్ట్ ఎప్పుడు కనిపించాలో ఎంచుకోవడం ద్వారా వినియోగదారులు ఫీచర్ ని కాన్ఫిగర్ చేయవచ్చు. పాస్‌వర్డ్ మర్చిపోయినట్లయితే, వాట్సాప్ వెబ్ నుండి లాగ్ అవుట్ చేసి, క్యూఆర్ తో మళ్లీ స్కాన్ చేసుకోవాల్సి ఉంటుంది.
అదనపు భద్రత..
స్క్రీన్ లాక్ ఫీచర్‌ను ప్రారంభించడం వలన మీ ప్రైవసీకి అదనపు లేయర్ యాడ్ అవుతుంది. వినియోగదారు దూరంగా ఉన్నప్పుడు ఎవరైనా కంప్యూటర్‌కు యాక్సెస్ చేస్తే మీ పర్సనల్ చాట్లు భద్రంగా ఉంటాయి. అవి పాస్‌వర్డ్ లేకుండా చాట్లు ఓపెన్ కావు కాబట్టి మీకు టెన్షన్ ఉండదు. ఈ వెబ్ బీటా తాజా వెర్షన్‌తో స్క్రీన్ లాక్ ఫీచర్ క్రమంగా అందరి వినియోగదారులకు అందుబాటులోకి వస్తోంది. రాబోయే వారాల్లో మరింత మంది వ్యక్తులు అప్‌డేట్‌ను అందుకోవచ్చని భావిస్తున్నారు.
COMMENTS