UPI: UPI payments even without internet.. Easy with this simple setting.. How to do it?
UPI: ఇంటర్నెట్ లేకున్నా యూపీఐ పేమెంట్స్.. ఈ సింపుల్ సెట్టింగ్‌తో ఈజీ.. ఎలా చేయాలంటే?
Offline UPI Payment: గూగుల్ పే, పేటీఎం, ఫోన్‌పే, క్రెడ్ ఇలా ఎవరి మొబైల్లో అయినా వీటిల్లో ఒకటికి మించి యాప్స్ ఉంటాయి. నిత్య జీవితంలో యూపీఐ పేమెంట్స్, ఈ యాప్స్ ఒక భాగంలా మారాయి. అయితే ఇంటర్నెట్ లేకుంటే పరిస్థితి ఏంటి? అత్యవసర సమయాల్లో డబ్బు పంపాల్సి వస్తే.. ఇంటర్నెట్ లేకుంటే ఎలా?
Google Pay: ప్రస్తుతం ఎవరికి డబ్బులు పంపాలన్నా.. బయట ఏదైనా వస్తువులు తీసుకుంటే పేమెంట్ చేయాలన్నా.. ఏ బిల్స్ కట్టాలన్నా.. ఫోన్‌పే, గూగుల్ పే, క్రెడ్, పేటీఎం ఇవే ఇప్పుడు. ఇవి ఇప్పుడు ప్రతి ఒక్కరి జీవితంలో భాగమైపోయాయి. కరోనా పరిస్థితుల నేపథ్యంలో డిజిటల్ పేమెంట్స్ పెరిగిపోయాయి. అప్పుడు అనివార్యంగా ఉండగా.. ఈ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ .. పూర్తి అవసరంగా మారిపోయాయి. పాల ప్యాకెట్‌కు 10 రూపాయల నుంచి.. వేల రూపాయల షాపింగ్ బిల్స్‌కు కూడా యూపీఐ ద్వారానే పేమెంట్స్ చేస్తున్నారు. అయితే అకౌంట్లో డబ్బులున్నా.. ఫోన్లో ఛార్జింగ్ ఉన్నా కూడా.. ఇంటర్నెట్ లేకుంటే మాత్రం చెల్లింపులు చేయలేరు.
ఈ రోజుల్లో చాలా మంది దగ్గర ఇంటర్నెట్ ఉన్నా.. అప్పుడప్పుడు ఈ సమస్య వేధిస్తుంది. ఇకపై ఈ పరిస్థితికి చెక్ పెట్టొచ్చు. మొబైల్ ఫోన్లో ఒక్క సెట్టింగ్ చేసుకుంటే చాలు.. ఇంటర్నెట్ లేకున్నా.. యూపీఐ ద్వారా చెల్లింపులు జరపొచ్చు. మరి ఆ సెట్టింగ్ ఏంటి.. దాన్నెలా సెట్ చేసుకోవాలి. వంటి వివరాలు ఇప్పుడు చూద్దాం.
ఇంటర్నెట్ లేకున్నా కూడా నగదు లావాదేవీలు జరిపేందుకు *99# సేవలు వినియోగించుకోవాలి. దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఈ సేవ అందుబాటులో ఉంది. దేశంలోని 83 ప్రముఖ బ్యాంకులు ఈ సర్వీస్ అందిస్తున్నాయి. 4 టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు కూడా ఈ సేవలు అందిస్తున్నారు. ఇంగ్లీష్, హిందీ సహా దేశంలోని 13 ప్రముఖ భాషల్లో ఇది అందుబాటులో ఉంది. ఈ సేవకు సంబంధించిన సెట్టింగ్ ఒకసారి చేసుకుంటే చాలు.. తర్వాత రెగ్యులర్‌గా ఆఫ్‌లైన్‌లోనే యూపీఐ పేమెంట్స్ చేసుకోవచ్చు.
ఇలా సెట్ చేసుకోవాలి..
- మీరు యూపీఐ పేమెంట్స్ చేసే మొబైల్ నంబర్ నుంచి *99# నంబర్‌కు డయల్ చేయాలి.
- తర్వాత మీకు నచ్చిన భాష ఎంచుకోవాలి.
- తర్వాత మీ బ్యాంక్ పేరు ఎంటర్ చేయాలి.
- మీ మొబైల్ నంబర్‌కు లింక్ చేసిన బ్యాంక్ అకౌంట్స్ లిస్ట్ కనిపిస్తుంది.
- ఏ అకౌంట్ నుంచి ట్రాన్సాక్షన్ జరగాలని అనుకుంటున్నారో.. దానిని సెలక్ట్ చేసుకోండి.
- తర్వాత మీ Debit Card ఎక్స్పైరీ డేట్‌తో పాటు కార్డు నంబర్లోని చివరి ఆరంకెలను నమోదు చేయండి. దీంతో సక్సెస్‌ఫుల్‌గా సెట్టింగ్స్ కంప్లీట్ చేసినవారవుతారు.
పేమెంట్స్ ఎలా అంటే?
- ఇంటర్నెట్ లేకుండా డబ్బులు పంపాలంటే.. *99# నంబర్‌కు కాల్ చేసి.. తర్వాత 1 నొక్కాలి.
- తర్వాత నగదు పంపాలనుకుంటున్న వ్యక్తి మొబైల్ నంబర్/UPI ID/ బ్యాంక్ అకౌంట్ నంబర్ ఎంటర్ చేయాలి.
- ఎంత డబ్బు పంపాలో ఎంటర్ చేసి.. తర్వాత UPI పిన్ నంబర్ ఎంటర్ చేయాలి.
- అంతే డబ్బులు విజయవంతంగా బదిలీ అవుతాయి.
- ఈ ఆప్షన్‌తో ఒకసారి రూ. 5 వేల వరకు చెల్లించొచ్చు.
- అయితే *99# సర్వీస్ వినియోగించుకుంటున్నందుకు ప్రతిసారీ 50 పైసల ఛార్జీ పడుతుంది.
COMMENTS