Whatsapp: There are three new features in your WhatsApp, have you noticed.? What is the use of these..
Whatsapp: మీ వాట్సాప్‌లో మూడు కొత్త ఫీచర్లు వచ్చాయి, గమనించారా.? వీటి ఉపయోగం ఏంటంటే..
ప్రపంచంలో ఎక్కువ మంది ఉపయోగించే మెసేజింగ్ యాప్స్‌లో వాట్సాప్ మొదటి స్థానంలో ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రతీ ఒక్కరి స్మార్ట్ ఫోన్లో ఈ యాప్ ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. యూజర్ల అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పడు కొంగొత్త ఫీచర్లను తీసుకొస్తోంది కాబట్టే ఈ యాప్‌కు ఇంతటి క్రేజ్ ఉంది.
యూజర్ల అవసరాలకు లేటెస్ట్ టెక్నాలజీకి అనుగుణంగా కొంగొత్త ఫీచర్లను తీసుకొస్తోంది వాట్సాప్. మార్కెట్లో ఎన్నో రకాల మెసేజింగ్ యాప్స్ అందుబాటులోకి వస్తున్నా వాట్సాప్ క్రేజ్ మాత్రం తగ్గకపోవడానికి ఇదే ప్రధాన కారణంగా చెప్పొచ్చు. ఇలా నిత్యం ఏదో ఒక కొత్త యాప్‌ను తీసుకొస్తున్న వాట్సాప్ తాజాగా యూజర్ల కోసం మరో మూడు కొత్త ఫీచర్లను ప్రవేశపెట్టింది. అయితే ఈ ఫీచర్లు ఇప్పటికే అందుబాటులోకి వచ్చినా చాలా మందికి తెలియదు. ఇంతకీ ఈ ఫీచర్లు ఏంటి.? వీటి వల్ల కలిగే ప్రయోజనం ఏంటి.? లాంటి వివరాలపై ఓ లుక్కేయండి..
1. వాట్సాప్ కొత్త అందుబాటులోకి తీసుకొచ్చిన మొదటి ఫీచర్ స్క్రీన్ షేరింగ్ ఫీచర్. సాధారణంగా ఇలాంటి స్క్రీన్ షేరింగ్ ఫీచర్ గూగుల్ మీట్, జూమ్ వంటి వీడియో కాలింగ్ ప్లాట్‌ఫామ్స్‌లో అందుబాటులో ఉంటాయనే విషయం తెలిసిందే. అయితే తాజాగా వాట్సాప్ కూడా ఈ ఫీచర్‌ను పరిచయం చేసింది. ఈ ఫీచర్ సహాయంతో యూజర్లు వీడియో కాల్స్‌లో మాట్లాడుకునే సమయంలో తమ ఫోన్ స్క్రీన్‌ను షేర్ చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల ఫోన్ ఆపరేటింగ్‌కు సంబంధించి ఎదుటి వ్యక్తికి ఏవైనా సందేహాలు ఉంటే తీర్చవచ్చు. ప్రస్తుతం బీటా వెర్షన్లో అందుబాటులో ఉన్న ఈ ఫీచర్ త్వరలోనే అందరికీ అందుబాటులోకి రానుంది.
2. ఇక వాట్సాప్‌లో కొత్త అందుబాటులోకి వచ్చిన మరో ఫీచర్.. ఇటీవల వాట్సాప్‌లో స్పామ్ కాల్స్ ఎక్కువవుతోన్న విషయం తెలిసిందే. ఎవరో తెలియని నెంబర్ల నుంచి ఫోన్ కాల్స్ రావడం సైబర్ నేరాలు వంటివి జరగడకం చూస్తున్నాం. అయితే తాజాగా అందుబాటులోకి వచ్చిన కొత్త ఫీచర్‌తో ఇలాంటి స్పామ్ కాల్స్‌ను రిస్ట్రిక్ట్ చేయొచ్చు. ఇందుకోసం ముందుగా మీ వాట్సాప్‌లో సెట్టింగ్స్‌లోకి వెళ్లాలి అనంతరం ప్రైవసీలోకి వెళ్లాలి, తర్వాత కాల్స్ ఆప్షన్ సెలక్ట్ చేసుకోవాలి చివరిగా ‘సైలెన్స్ అన్నోన్ కాలర్స్’ అనే ఆప్షన్‌ను అనేబుల్ చేసుకుంటే సరిపోతుంది. దీంతో మీకు అన్నోన్ నెంబర్స్ నుంచి ఎలాంటి కాల్స్ రావు.
3. ఇక కొత్త అందుబాటులోకి వచ్చిన మూడో ఫీచర్ ఎడిటింగ్. వాట్సాప్‌లో పొరపాటున తప్పుడు మెసేజ్ చేయడం సహజమే. అయితే ఇలా సెండ్ చేసిన రాంగ్ మెసేజ్‌ను ‘డిలీట్ ఫర్ ఆల్’ చేసి ఆ తర్వాత మళ్లీ సెండ్ చేస్తుంటాం. అయితే ఇందుకోసమే వాట్సాప్ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఎడిట్ పేరుతో తీసుకొచ్చిన ఈ ఫీచర్ సహాయంతో మీరు తప్పుగా పంపించిన మెసేజ్‌ను ఎడిట్ చేసుకోవచ్చు. ఇందుకోసం మీరు తప్పుగా పంపిన మెసేజ్‌పై లాంగ్ ప్రెస్ చేయాలి. అనంతరం పైన ఉండే ‘త్రీ డాట్స్’పై క్లిక్ చేసి, ఎడిట్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి, ఆ తర్వాత మెసేజ్‌ను ఎడిట్ చేస్తే అవతలి వ్యక్తికి ఎడిట్ అయిన మెసేజ్ కనిపిస్తుంది.
COMMENTS