The final results of Telangana SI and RSI are here.. This is the final list!
Telangana SI Final Results 2023: తెలంగాణ ఎస్‌ఐ, ఆర్‌ఎస్సై తుది ఫలితాలు వచ్చేశాయ్.. ఫైనల్ లిస్ట్ ఇదే!
రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది అభ్యర్థులు ఉత్కంఠగా ఎదురుచూస్తోన్న ఎస్సై, ఆర్‌ఎస్సై పోస్టుల తుది ఎంపిక ఫలితాలు ఎట్టకేలకు విడుదలయ్యాయి. మొత్తం 587 పోస్టులకుగానూ 434 పురుష అభ్యర్థులు, 153 మంది మహిళా అభ్యర్థులు ఎంపికయ్యారు. ఈ మేరకు తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ నియామక మండలి (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) ఎంపిక జాబితా విడుదల చేసింది. ఎంపికైన అభ్యర్థుల వివరాలు, కట్ ఆఫ్ మార్కుల వివరాలు సోమవారం ఉదయం పోలీస్ నియామక మండలి అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతామని బోర్టు తెలిపింది. కీలకమైన కటాఫ్ మార్కుల ప్రక్రియను పూర్తి చేసిన బోర్డు తాజాగా తుది ఫలితాలను, ఎంపికైన అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది.
కాగా 587 ఎస్సై పోస్టుల భర్తీకి గానూ TSLPRB 2022 నోటిఫికేషన్ గతేడాది విడుదల చేయగా.. దాదాపు 2.47 లక్షల మంది అభ్యర్ధులు ఆగస్టు 7న ప్రిలిమినరీ పరీక్ష రాశారు. ఎస్‌ఐ పోస్టుల రిక్రూట్‌మెంట్‌లో భాగంగా అభ్యర్థులకు ప్రిలిమినరీ పరీక్ష తర్వాత తుదపరి దశలైన మెయిన్స్, దేహదారుఢ్య పరీక్షలన్నింటినీ బోర్డు నిర్వహించింది. తాజాగా ఎంపికైన అభ్యర్థులు అటెస్టేషన్ ఫార్మ్, ఇతర ధృవీకరణ పత్రాలను వెబ్‌సైట్‌లో ఆగష్టు 9 నుంచి ఆగష్టు 11 వరకు ఆన్‌లైన్‌లో పూర్తించవల్సి ఉంటుంది. అర్హత సాధించిన అభ్యర్థుల ప్రవర్తన, క్రిమినల్ కేసులపై బోర్డు పది రోజులపాటు ఆరా తీయనుంది. అందుకు స్పెషల్ బ్రాంచ్ (ఎస్‌బీ) విభాగంతో ఒక్కో అభ్యర్ధి గురించి విచారణ జరిపించనుంది. క్లీన్ చీట్ ఉన్న వారికి ఎంపిక లేఖలు బోర్డు జారీ చేస్తుంది. గస్టు రెండోవారంలోగా అర్హుల జాబితాను పోలీసు, ఎక్సైజ్, ఫైర్, జైళ్లు ఇలా అన్ని విభాగాలకు పంపించనున్నట్లు సమాచారం. ఈ ప్రక్రియ పూర్తయితే ఎస్సై పోస్టులకు అపాయింట్‌మెంట్ లెటర్లు జారీ చేస్తుంది.
ఇక పోలీస్ కానిస్టేబుల్ తుది ఎంపిక ఫలితాలు ఇప్పట్లో విడుదలయ్యే అవకాశం లేదు. కంటీజియస్ జిల్లా కేడర్ పరిధిలోని కానిస్టేబుల్ పోస్టులపై హైకోర్టు తీర్పు వెలువరించిన తర్వాతే ఎంపిక ఫలితాలు విడుదలకానున్నాయి.
Important Links:
FOR Telangana SI and RSI Final Results 2023 CLICKHERE
COMMENTS