Tech Tips: Here's how to make sure no one knows what you're looking at online.
Tech Tips: మీరు ఆన్‌లైన్‌లో ఏం చూస్తున్నారో ఎవరికీ తెలియకూడదంటే ఇలా చేయండి.. సింపుల్ టిప్స్..
మీరు ఆన్ లైన్ చేసే ప్రతి పని ఇతరులకు తెలిసే అవకాశం ఉందని మీకు తెలుసా? మీరు చూస్తున్న వెబ్ సైట్లు, మీ లోకేషన్ ను ఇట్టే కనిపెట్టగలరని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? నిజమండీ బాబు.. మీ ప్రైవసీకి భద్రత లేదు. మీ సిస్టమ్ లేదా ఫోన్ డేటా మొత్తం ఇతరులకు తెలిసేపోయే ప్రమాదం ఉంది. మీరు ఇంటర్ నెట్ ఆన్ చేసి, లోకేషన్ కూడా ఆన్ చేసి ఉంచితే చాలు మీ ఎక్కడున్నది, ఏం చేస్తున్నది కనిపెట్టొచ్చు. అందుకే చాలా మంది తమ ఐడెంటిని ఎక్స్ పోజ్ కాకుండా చూసుకునేందుకు ఇష్టపడతారు. ప్రైవసీ కాపాడుకునేందుకు తాపత్రయపడతారు. అయితే ఇలా ఐడెంటిటీ రివీల్ కాకుండా, ఒకరకంగా అజ్ఞాతంలో ఉండి వెబ్ వినియోగించడం అనైతికమని చాలా మంది భావిస్తారు. అయితే చాలా కంపెనీలు, సంస్థలు ఇదే సరియైన విధానమని భావిస్తాయి. ఎందుకంటే వారి బిజినెస్ వ్యవహారాలు, వారి ఉద్యోగులకు సంబంధించిన సమాచారం బయటకు వెళ్లకూడదని జాగ్రత్తలు తీసుకుంటాయి. ఇదే కోణంలో వ్యక్తిగత భద్రతకు ఎవరికి వారు ప్రాధాన్యం ఇవ్వడంలో తప్పు ఉండదు. ఈ నేపథ్యంలో మీరు ఐడెంటీని రివీల్ చేయకుండా ఆన్ లైన్ లో వెబ్ వినియోగించడం ఎలాగో తెలుసుకుందాం..
అసలు మన డేటా ఎలా బయటకెళ్తుంది..
చాలా మంది ఇదో ధర్మ సందేహం. మన డేటా ఆన్ లైన్ లో ఎలా బయటకు వెళ్తుంది? అయితే ఇది అర్థం కావాలంటే కంప్యూటర్ వినియోగంపై కనీస పరిజ్ఞానం ఉండాలి. ప్రతి కంప్యూటర్ కి, మీరు వాడే ఇంటర్ నెట్ కి ప్రత్యేక ఇంటర్ నెట్ ప్రోటోకాల్(ఐపీ) అడ్రస్ ఉంటుంది. ఇది ఇంటర్ నెట్ బ్రౌజర్ కి సంబంధించిన చాలా ముఖ్యంమైన అంశం. అయితే ఈ ఐపీ అడ్రస్ లో మీ వ్యక్తిగత డేటా ఏమి ఉండదు. అయితే ఇది ఇంటర్ నెట్ సర్వీస్ ప్రోవైడర్(ఐఎస్పీ)కి కనెక్ట్ అయితే అది మీ వ్యక్తిగత డేటా ను కూడా కంబైన్ చేస్తుంది. ఫోన్ నంబర్, పేరు, అడ్రస్ వంటి వివరాలు తెలుస్తాయి. వాస్తవానికి ఈ ఐఎస్పీ కూడా మీ డేటాను షేర్ చేయదు, కొన్ని సందర్భాల్లో మాత్రం ఈ ఐఎస్పీకి ఎటువంటి చాయిస్ లేక ఐపీ అడ్రస్ కి సంబంధించిన డేటా ను షేర్ చేస్తుంది.
వెబ్ సైట్ కుకీస్ గురించి మీరు వినే ఉంటారు. ఇది మీ బ్రౌజింగ్ వివరాలను క్రోడీకరించి, మీ సెర్చ్ లను మరింత అనుకూలంగా చేస్తాయి. ఈ కుకీస్ ను కూడా పలు అడ్వర్టైజ్ మెంట్ సంస్థలు వినియోగించుకుంటాయి. వీటి ద్వారా తమ ఉత్పత్తులను బ్రాండింగ్ చేసుకుంటాయి.
వెబ్ ద్వారా వినియోగించే ఈ-మెయిల్స్ అకౌంట్స్ ద్వారా కూడా మీ ప్రైవసీకి భంగం కలగొచ్చు. మీరు ఈ-మెయిల్, ఇంటర్ నెట్ సెర్చ్ లను సింగిల్ వెబ్ సైట్లో వినియోగిస్తే, సైబర్ క్రిమినల్స్ మిమ్మల్ని ట్రాక్ చేయడం సులభం అవుతుంది.
ప్రైవసీ కాపాడుకోవడం ఎలా..
ప్రోక్సీ సర్వర్ ను వినియోగించి ఏదైనా పేజ్ రిక్వెస్ట్ ల నుంచి ఐసీ అడ్రస్ లను తొలగించొచ్చు. హౌస్టఫ్ వర్క్స్ రిపోర్టు ఆధారంగా సర్వర్ ని ఆన్ చేయడం కోసం ప్రోక్సీ సర్వీసెస్ వెబ్ సైట్ ను సందర్శించాలి. అక్కడ ప్రత్యేకమైన బాక్స్ లో మీ వెబ్ అడ్రస్ ను టైప్ చేయాలి. అప్పుడు మీరు పంపే రిక్వస్ట్ బయటకు తెలియకుండా సర్వర్ ను చేరుతుంది.
ఇంటర్ నెట్ లో ఎప్పటికప్పుడు మీ సెర్చ్ హిస్టరీని డిలీట్ చేయాలి. ప్రతి వెబ్ బ్రౌజర్ ఈ ఆప్షన్ ను కలిగి ఉంటాయి.
అలాగే గూగుల్ క్రోమ్ లో ప్రైవేట్ బ్రౌజింగ్ మోడ్ అయిన ఇన్ కాగ్నిటో లో మీరు బ్రౌజర్ వినియోగించడం మేలు. దీనిలో వినియోగించడం వల్ల మీ సెర్చ్ రిజల్ట్స్, పాస్ వర్డ్స్, కుకీలు వంటి వాటిని బ్రౌజర్ సేవ్ చేయలేదు.
మీ వ్యక్తిగత వివరాలైన ఈ-మెయిల్, పాస్ వర్డ్స్, ఫోన్ నంబర్లను ఏ వెబ్ సైట్లోనూ ఇవ్వొద్దు. ఒకే రకమైన వివరాలను అన్ని వెబ్ సైట్లకు ఇవ్వొద్దు. వేరు వేరు వెబ్ సైట్లకు వేరు వేరు యూజర్ నేమ్స్, పాస్ వర్డ్ లు ఇవ్వడం మేలు.
COMMENTS