Success Story: The farmer became rich by selling cow dung.. He built a bungalow worth crores.. Do you know somewhere?
Success Story: రైతు ఆవు పేడను అమ్మి రైతు ధనవంతుడయ్యాడు.. కోటి విలువైన బంగ్లా నిర్మించాడు.. ఎక్కడో తెలుసా?
వ్యవసాయం అంటే దండగా అన్న వారే ఇప్పుడు లక్షలాది రూపాయలు సంపాదిస్తున్నారు. వ్యవసాయాన్ని నమ్ముకుని ముందుకు సాగే రైతులు కాసుల పంట కురిపిస్తున్నారు. వ్యవసాయంపై అవగాహన పెంచుకుని రకరకాల పంటలు పండిస్తూ సంపాదించే మార్గాలను ఎంచుకుంటున్నారు. వ్యవసాయం అంటే దండగా కాదు పండగ అని నిరూపిస్తున్నారు కొందరు రైతులు. భారతదేశం వ్యవసాయ దేశం. మన దేశంలో చాలా దాదాపు 80 శాతం వరకు అగ్రికల్చర్‌పై ఆధారపడి జీవనం కొనసాగిస్తు్ంటారు. అదే సమయంలో కోట్లాది మంది రైతులు తమ ఇంటి ఖర్చులను పశుపోషణ ద్వారా కూడా నడుపుతున్నారు. పాలు అమ్ముకుని సంపాదించేందుకు కొందరుంటే.. గేదెలతో వ్యాపారం చేసేవారు మరి కొందరుంటారు. దేశంలో పాలు, దాని ఉత్పత్తులను విక్రయించడం ద్వారా చాలా మంది సంవత్సరానికి కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నారు. అయితే ఆవు పేడను అమ్మడం ద్వారా ఓ రైతు కోటీశ్వరుడు అయ్యాడంటే ఆశ్యర్యపోతారు. ఆవు పేడను అమ్మడం ద్వారా ధనవంతుడైన అటువంటి రైతు గురించి తెలుసుకుందాం.
మనం చెప్పుకోబోయే రైతు పేరు ప్రకాష్ నెమాడే. మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లా సంగోలా తాలూకాలో ఉన్న ఇమ్దేవాడి గ్రామానికి చెందిన ప్రకాష్ తన హార్డ్ వర్క్‌తో అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఆవు పేడను అమ్మి కోటి రూపాయల విలువైన బంగ్లాను కూడా నిర్మించాడు. ఈ బంగ్లాకు ‘గోధన్ నివాస్’ అని పేరు పెట్టారు. ప్రకాష్ నెమాడే తనకు 4 ఎకరాల వంశపారంపర్యంగా వచ్చిన భూమి మాత్రమే ఉందన్నారు. కానీ నీరు లేకపోవడంతో సక్రమంగా సాగు చేయలేకపోయారు. అలాంటి పరిస్థితుల్లో జీవనోపాధి కోసం ఆవుల పెంపకం ప్రారంభించాడు.
అతని వద్ద 150 ఆవులు:
ఆ తర్వాత పాలు అమ్ముతూ బాగా సంపాదించడం మొదలుపెట్టాడు. విశేషమేమిటంటే.. పాల వ్యాపారం ప్రారంభించేటప్పటికి అతడి వద్ద ఉండేది ఒకే ఆవు. మొదట్లో ఇంటింటికి పాలు అమ్మేవాడు. కానీ తీవ్రంగా శ్రమించడం వల్ల ఆవుల పెంపకంలో పెద్ద సామ్రాజ్యాన్నే నిర్మించాడు. నేడు అతని వద్ద 150 ఆవులు ఉన్నాయి. ఇప్పుడు స్మార్ట్ ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా మారారు. ఇతను ఆవుల నుంచి వచ్చే పాలతో పాటు పేడను కూడా జమ చేసి వ్యాపారం కొనసాగిస్తున్నాడు.
కోటి రూపాయలకు పైగా సంపాదన:
ప్రకాశ్ ఆవు పేడను అమ్ముతూ కోట్లాది రూపాయలను సంపాదిస్తున్నాడు. సేంద్రియ వ్యవసాయం చేస్తున్న రైతుల వద్ద నుంచి ప్రకాశ్ ఆవు పేడను కొనుగోలు చేస్తున్నాడు. ఇది కాకుండా, అతను ఆవు పేడ గ్యాస్ ప్లాంట్‌ను కూడా నిర్మించాడు. ఆవు పేడతో పాటు గ్యాస్ కూడా అమ్ముతున్నారు. గోవులకు ముసలితనం వచ్చే వరకు సేవ చేయడమే గొప్ప విషయం. ఇప్పటి వరకు ఆవు పేడ వ్యాపారం ద్వారా కోటి రూపాయలకు పైగా సంపాదించాడు.
COMMENTS