Success Secret: He used to sell ice-creams on the streets.. Today Rs. Head of 20 thousand crores.. Is this what success means..!
Success Secret: నాడు వీధుల్లో ఐస్‌క్రీమ్స్ అమ్మేవాడు.. నేడు రూ. 20 వేల కోట్లకు అధిపతి.. సక్సెస్ అంటే ఇది కదా..!
ఒక వ్యక్తి అంకితభావంతో, కష్టపడి పనిచేస్తే.. వారి విజయాన్ని ఎవరూ ఆపలేరు. మన చుట్టూ ఇలాంటి వారు చాలా మందే ఉంటారు. ఇక మన దేశ వ్యాప్తంగా చూస్తే ఇలా సక్సెస్‌ఫుల్ స్టోరీస్ చాలానే ఉన్నాయి. ఎంతో మంది కింది స్థాయి నుంచి అంచలంచెలుగా ఎదిగి బిలియనీర్స్ అయిన వారు ఉన్నారు. జీవితం ప్రారంభ రోజుల్లో పేదవారిగా ఉండి.. పిల్లల తిండి కోసం కూడా అవస్థలు పడిన వారు.. ఇవాళ వేల కోట్ల సామ్రాజ్యాన్ని సృష్టించారు. సమాజంలో గర్వంగా తలెత్తుకుని తిరుగుతున్నారు. గతంలో కూలీగా చేసిన వారే.. ఇప్పుడు వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్నారు. అలాంటి ఓ బిజినెస్‌మెన్ సక్సెస్‌ఫుల్ జర్నీ గురించి ఇవాళ..
ఒక వ్యక్తి అంకితభావంతో, కష్టపడి పనిచేస్తే.. వారి విజయాన్ని ఎవరూ ఆపలేరు. మన చుట్టూ ఇలాంటి వారు చాలా మందే ఉంటారు. ఇక మన దేశ వ్యాప్తంగా చూస్తే ఇలా సక్సెస్‌ఫుల్ స్టోరీస్ చాలానే ఉన్నాయి. ఎంతో మంది కింది స్థాయి నుంచి అంచలంచెలుగా ఎదిగి బిలియనీర్స్ అయిన వారు ఉన్నారు. జీవితం ప్రారంభ రోజుల్లో పేదవారిగా ఉండి.. పిల్లల తిండి కోసం కూడా అవస్థలు పడిన వారు.. ఇవాళ వేల కోట్ల సామ్రాజ్యాన్ని సృష్టించారు. సమాజంలో గర్వంగా తలెత్తుకుని తిరుగుతున్నారు. గతంలో కూలీగా చేసిన వారే.. ఇప్పుడు వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్నారు. అలాంటి ఓ బిజినెస్‌మెన్ సక్సెస్‌ఫుల్ జర్నీ గురించి ఇవాళ మనం తెలుసుకుందాం..
ఆర్‌జి. చంద్రమోగన్.. భారతదేశంలో ఉన్న బలియనీర్లలో ఒకరు. ఇప్పుడైతే ఆయన బిలియనీర్.. కానీ, ఆయన ప్రారంభ జీవితంలో మాత్రం ఒక సాధారణ కూలి. రోజూ రూ. 65 లకు కూలీపనికి వెళ్లేవాడు. ఒకప్పుడు వీధుల్లో తిరుగుతూ ఐస్‌క్రీమ్స్ అమ్మే ఈయన.. ఇప్పుడు అదే ఐస్‌క్రీమ్స్ కంపెనీకి ఓనర్‌గా మారడు. ఆయన కంపెనీ కంపెనీ విలువ ఇప్పుడు రూ. 19,077 కోట్లు. మరి ఆయన ఈ స్థాయికి చేరుకోవడానికి కారణం ఆయన కష్టం. సక్సెస్‌ఫుల్ బిజినెస్ మెన్‌గా నిలిచిన ఆర్‌జి చంద్రమోగన్ జీవితంలో చోటు చేసుకున్న పరిణామాలు, ఆయన ఎదిగిన విధానాన్ని ఓసారి చూద్దాం.
ఆర్‌జి చంద్రమోగన్.. 1970లో చిన్న తోపుడు బండిపై ఐస్‌క్రీమ్స్ అమ్మేవారు. ఆ తరువాత ఆ ఉద్యోగాన్ని మానేసి తానే స్వయంగా ఐస్‌క్రీమ్ వ్యాపారాన్ని ప్రారంభించారు. తొలుత ఒడిదుడుకులు ఎదురైనా.. ఆ తరువాత మంచి లాభాలు రావడంతో ఇక వెనుదిరిగి చూసుకోలేదు. కేవలం రూ. 13,000 లతో వ్యాపారం ప్రారంభించిన ఆయన నేడు రూ. 19,077 కోట్లతో కుభేరుల జాబితాలో చోటు దక్కించుకున్నారు.
42 కంటే ఎక్కువ కంపెనీలకు పాల ఉత్పత్తుల సరఫరా..
రామచంద్రమోగన్ కంపెనీ నాన్ హట్సన్ ఆగ్రో ప్రొడక్ట్ లిమిటెడ్. ఈ కంపెనీ దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ డెయిరీ కంపెనీలలో ఒకటిగా నిలిచింది. 10,000 గ్రామాలకు చెందిన 40,0000 మంది రైతుల వద్ద నుంచి ఈ కంపెనీ పాలు సేకరిస్తుంది. ఈ రైతులందరూ ఆర్‌జి రామచంద్రమోగన్ కంపెనీలో పాలు విక్రయిస్తున్నారు. దీంతో ఆ రైతులకు మరింత లాభం చేకూరుతుంది. విశేషమేమిటంటే ఆయన కంపెనీ 42కి పైగా కంపెనీలకు పాల ఉత్పత్తులను సరఫరా చేస్తోంది.
వ్యాపారం కోసం ఉద్యోగం మానేసి..
ఆర్‌జి చంద్రమోగన్ మొదట్లో పని చేసేవారు. అయితే తర్వాత ఉద్యోగం మానేసి ఏడాది తర్వాత రూ.13 వేలతో ఐస్‌క్రీం వ్యాపారం ప్రారంభించాడు. మొదట్లో ఊరిలో ఓ చిన్న బండి తీసుకుని స్వయంగా ఐస్ క్రీం అమ్మేవాడు. తన కఠోర శ్రమ వల్ల విజయం ఆయన్ను వరించింది. ఏడాదిలోపే రూ.13 వేల వ్యాపారం రూ.1.5 లక్షలకు పెరిగింది. ఆ తర్వాత, 1981లో, తన చిన్న వ్యాపారాన్ని పెద్ద నగరాలకు తీసుకెళ్లడానికి అరుణ్ ఐస్ క్రీమ్ బ్రాండ్ స్థాపించారు. 1986లో, కంపెనీ పేరును ప్రస్తుత హ్యాట్సన్ ఆగ్రో ప్రొడక్ట్‌గా మార్చాడు. ఇలా ఆయన కెరీర్.. కూలీ పనిని నుంచి ఎంతో మందికి ఉపాధి కల్పించే స్థాయికి చేరుకున్నారు.
COMMENTS