Service Charge: Asking service charge at a restaurant? Should it be fixed? What did the center say?
Service Charge: రెస్టారెంట్‌లో సర్వీస్ ఛార్జ్ అడుగుతున్నారా? కచ్చితంగా కట్టాలా? కేంద్రం ఏం చెప్పిందంటే?
Restaurants Service Charge: మీరు బయట ఎక్కడైనా రెస్టారెంట్లలో భోజనం చేసినప్పుడు అక్కడి యాజమాన్యం సర్వీస్ ఛార్జ్ అడుగుతుందా? మీ బిల్లులో అది కనిపిస్తుందా? కచ్చితంగా చెల్లించాలని డిమాండ్ చేసిందా? దీనిపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఏం చెప్పిందో చూద్దాం.
Is Paying Service Charge in Restaurants Mandatory: హోటళ్లు, బార్లు, రెస్టారెంట్లు ఇలా ఎక్కడికైనా వెళ్లి తిన్నందుకు, తాగినందుకు కాకుండా అదనంగా సర్వీస్ చేసినందుకు చాలా వరకు సర్వీస్ ఛార్జ్ వసూలు చేస్తుంటారు. కొన్ని నెలల కిందట ఈ విషయంపై ఉత్తర్‌ప్రదేశ్ నోయిడాలోని ఒక రెస్టారెంట్లో పెద్ద గొడవ కూడా జరిగింది. దేశవ్యాప్తంగా దీని గురించి పెద్ద చర్చే నడిచింది. అప్పటి నుంచి రెస్టారెంట్లలో అసలు సర్వీస్ ఛార్జ్ కట్టాలా? చెల్లించకుంటే ఏమవుతుంది? అసలు ఎందుకు చెల్లించాలి? అనే ప్రశ్న చాలా మందిలో వ్యక్తమైంది. కేంద్ర ప్రభుత్వం దీనిపై స్పందించింది కూడా. ఒక క్లారిటీ అయితే ఇచ్చేసింది. ఏం చెప్పిందో తెలుసుకుందాం.
నోయిడా ఘటన అనంతరం.. కేంద్ర వినియోగదారుల మంత్రిత్వ శాఖ స్పందించింది. సర్వీస్ ఛార్జ్ విషయమై క్లారిటీ ఇస్తూ.. ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. దాంట్లో ఏముందంటే?.. సర్వీస్ ఛార్జ్ చెల్లించాలని కస్టమర్‌ను రెస్టారెంట్స్ బలవంతం చేయొద్దు. ఆ సేవా రుసుం చెల్లించాలా వద్దా? అనేది కస్టమర్ల ఇష్టానికి సంబంధించినదని, వారు చెల్లిస్తే తీసుకోవాలి.. లేకుంటే డిమాండ్ చేయొద్దని స్పష్టం చేసింది.
హోటల్స్ యాజమాన్యం అందించిన సేవలకు సంతృప్తి చెందితే.. కస్టమర్లు సర్వీస్ ఛార్జ్ ఎంతైనా చెల్లించొచ్చు. అంతేగానీ కచ్చితంగా చెల్లించాలని కూడా లేదు. సర్వీస్ ఛార్జ్ చెల్లించాలని వినియోగదారుల్ని బలవంతం చేసే అధికారం ఎవరికీ ఉండదని పేర్కొంది కేంద్రం. 2023, ఏప్రిల్ 12న దిల్లీ హైకోర్టు కూడా ఇదే విషయాన్ని నొక్కిచెప్పింది.
కేంద్రం క్లారిటీ ఇచ్చిన దాని ప్రకారం.. మీరు ఎలాంటి సర్వీస్ ఛార్జ్ చెల్లించాల్సిన పని లేదు. అయితే .. ఎక్కడైనా సర్వీస్ ఛార్జ్ కచ్చితంగా కట్టాల్సిందేనని ఫోర్స్ చేస్తే మాత్రం నేషనల్ కన్జూమర్ హెల్ప్‌లైన్‌కు (NCH) కంప్లైంట్ ఇచ్చే వెసులుబాటు కూడా కల్పించింది.
సర్వీస్ ఛార్జ్ అంటే ఏంటి? (What is Service Charge?)
ఆర్డర్ చేసిన భోజనం, ఇతర శీతల పానీయాల రేట్లకు వర్తించే పన్నులు రెస్టారెంట్ బిల్స్‌లో ఎక్కువ భాగంగా ఉంటాయి. తినుబండారాల ద్వారా వీటికి అదనంగా 5 నుంచి 10 శాతం సేవా రుసుం బిల్లుకు జోడిస్తారు. కస్టమర్లు దీనిపై ఆందోళన వ్యక్తం చేయగా.. సెంట్రల్ కన్జూమర్ ప్రొటెక్షన్ అథారిటీ రెస్టారెంట్లలో సర్వీస్ ఛార్జ్‌లకు వ్యతిరేకంగా మార్గదర్శకాలు విడుదల చేసింది.
మీకు అందించిన సర్వీస్‌పై బిల్లులో సర్వీస్ ఛార్జ్ వేస్తే దానిని తొలగించమని అడిగే అధికారం కస్టమర్లకు ఉంది.
బలవంతం చేస్తే మీరు వారిపై ఫిర్యాదు చేసేందుకు 1915కి కాల్ చేయాలి. NCH మొబైల్ యాప్‌లో కూడా చేయొచ్చు. జిల్లా కలెక్టర్‌కు కూడా ఫిర్యాదు చేయొచ్చు. ఇంకా com-ccpa@nic.in కు ఇ-మెయిల్ చేయడం ద్వారా నేరుగా CCPA కు ఫిర్యాదు చేయొచ్చు.
COMMENTS