SBI Cash Withdrawal: Any ATM...you can withdraw money with your phone
SBI Cash Withdrawal: ఏటీఎం ఏదైనా సరే... మీ ఫోన్‌తో డబ్బులు డ్రా చేయొచ్చు ఇలా..
ఏటీఎంలో డబ్బులు డ్రా చేయాలంటే డెబిట్ కార్డులు (Debit Cards) కావాలి. ఇది ఒకప్పుడు. ఇప్పుడు టెక్నాలజీతో ఏటీఎం కార్డ్ (ATM Card) అవసరం లేకుండా డబ్బులు డ్రా చేయొచ్చు. మీ ఫోన్ ఉంటే చాలు. సులువుగా డబ్బులు డ్రా చేయొచ్చు. తాజాగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), బ్యాంక్ ఆఫ్ బరోడా (Bank of Baroda) వారి ఏటీఎంలల్లో ఇంటర్‌ఆపరబుల్ కార్డ్‌లెస్ క్యాష్ విత్‌డ్రాయల్ (Cardless Cash Withdrawal) ఆప్షన్‌ను అందిస్తున్నాయి.

దేశంలోని అన్ని బ్యాంకు ఏటీఎంలల్లో ఇంటర్‌ఆపరబుల్ కార్డ్‌లెస్ క్యాష్ విత్‌డ్రాయల్ సేవల్ని తీసుకొస్తామని, ఈ లావాదేవీలు యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) ద్వారా ప్రాసెస్ చేయబడతాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గతంలోనే చెప్పిన సంగతి తెలిసిందే.

మీకు అకౌంట్ ఉన్న బ్యాంక్ ఏటీఎంలో ఫోన్ ద్వారా డబ్బులు డ్రా చేసే సదుపాయం ఇప్పటికే ఉంది. కానీ మీరు యూపీఐ సదుపాయాన్ని ఉపయోగించే ఏ బ్యాంకు ఏటీఎంలో అయినా డబ్బులు డ్రా చేసే ఫీచర్‌నే ఇంటర్‌ఆపరబుల్ కార్డ్‌లెస్ క్యాష్ విత్‌డ్రాయల్ అంటారు.
ఉదాహరణకు మీకు ఐడీబీఐ బ్యాంక్ అకౌంట్ ఉందనుకుందాం. మీకు దగ్గర్లో ఎస్‌బీఐ ఏటీఎం ఉంది. మీరు యూపీఐ సదుపాయం ద్వారా ఎస్‌బీఐ ఏటీఎంలో సులువుగా డబ్బులు డ్రా చేయొచ్చు. యూపీఐ ద్వారా ఏటీఎంలో డబ్బులు ఎలా డ్రా చేయాలో తెలుసుకోండి.
మీకు దగ్గర్లో ఉన్న ఏటీఎంలో UPI QR Cash ఆప్షన్ ఎంచుకోవాలి. మీరు ఎంత డ్రా చేయాలనుకుంటున్నారో అమౌంట్ సెలెక్ట్ చేయాలి. ఏటీఎం స్క్రీన్ పైన క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది. మీ స్మార్ట్‌ఫోన్‌లో యూపీఐ యాప్ ఓపెన్ చేసి క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాలి. యూపీఐ పిన్ ఎంటర్ చేసి డబ్బులు డ్రా చేయొచ్చు.
ఎస్‌బీఐ అకౌంట్ హోల్డర్స్ ఎస్‌బీఐ యోనో, యోనో లైట్ యాప్స్ ఉపయోగించి కూడా క్యూఆర్ కోడ్ స్కాన్ చేయొచ్చు. బ్యాంక్ ఆఫ్ బరోడా కస్టమర్లు ఆ బ్యాంకుకు చెందిన మొబైల్ యాప్ ఉపయోగించవచ్చు. యూపీఐ ద్వారా ఏటీఎంలో ఒక ట్రాన్సాక్షన్‌లో రూ.5,000 డ్రా చేయొచ్చు. యూపీఐ ద్వారా ఏటీఎంలో నెలకు రూ.1 లక్ష డ్రా చేయొచ్చు.
ఒకవేళ సాంకేతిక కారణాల వల్ల ఏటీఎంలో యూపీఐ ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయితే వెంటనే మీ బ్యాంక్ అకౌంట్ చెక్ చేయాలి. డబ్బులు డిడక్ట్ అయ్యాయేమో చూడాలి. ఒకవేళ అకౌంట్‌లో డబ్బులు కట్ అయినా, మీకు ఏటీఎంలో డబ్బులు రాకపోతే వెంటనే మీ బ్యాంకును సంప్రదించాలి. ఏడు వర్కింగ్ డేస్‌లో మీ డబ్బులు మీకు వెనక్కి వస్తాయి.
ఇంటర్‌ఆపరబుల్ కార్డ్‌లెస్ క్యాష్ విత్‌డ్రాయల్ ఫీచర్ ద్వారా బ్యాంక్ అకౌంట్ ఉన్నవారు డెబిట్ కార్డ్ అవసరం లేకుండా యూపీఐ యాప్ ఉపయోగించి ఏ ఏటీఎంలో అయినా డబ్బులు డ్రా చేయొచ్చు. ప్రతీసారి డెబిట్ కార్డ్ తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. దీంతో క్యాష్ విత్‌డ్రాయల్ ప్రాసెస్ చాలా సులభం అవుతుంది. కార్డ్ క్లోనింగ్ లాంటి మోసాలకు చెక్ పడుతుంది.
COMMENTS