RC Bhargava: Leaving IAS job.. Rs. As the chairman of a 3 lakh crore company.. Do you know this success story?
RC Bhargava: ఐఏఎస్ జాబ్ వదిలేసి.. రూ. 3 లక్షల కోట్ల కంపెనీకి ఛైర్మన్‌గా.. ఈ సక్సెస్ స్టోరీ తెలుసా?
RC Bhargava Maruti Suzuki: చాలా మందికి.. ఐఏఎస్ అధికారి కావాలనేది పెద్ద కల. ఆ కలను సాకారం చేసుకునేందుకు ఎంతో కష్టపడి చదివి.. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ పాసైతే అప్పుడు ఉద్యోగం వస్తుంది. అయితే అంతటి పెద్ద ఉద్యోగం వదులుకొని సాహసం చేశారీయన. తర్వాత అంతకుమించి ఎదిగారు. ఆయనే ఆర్‌సీ భార్గవ. ఈ సక్సెస్ స్టోరీ చూడండి.
Success Story: ప్రభుత్వ ఉద్యోగం చాలా మందికి జీవితాశయంగా ఉంటుంది. దీని కోసం ఎంతో కష్టపడి ఏళ్లకు ఏళ్లు చదువుతుంటారు. ఇక అందులో ఐఏఎస్ చాలా పెద్ద ఉద్యోగంగా భావిస్తుంటారు. అయితే దీని కోసం ఇంకా ఎక్కువ కష్టపడాలి. సంవత్సరాల తరబడి చదువుతుంటారు. ఎంతో హార్డ్‌వర్క్ చేస్తే గానీ ఈ జాబ్ దొరకడం కష్టం. ఇంకా పరీక్ష కూడా ప్రిలిమ్స్, మెయిన్స్ అని రెండు దశల్లో ఉంటుంది. తర్వాత ఇంటర్వ్యూ ప్రక్రియ ఇంకా క్లిష్టంగా ఉంటుంది. వీటిల్లో పాసైతే ఐఏఎస్ అవుతారు. అయితే కొన్ని సార్లు కష్టపడి ప్రభుత్వ ఉద్యోగం సాధించిన వారు కూడా అది వదిలి కొన్నాళ్లకు ప్రైవేట్ కంపెనీల్లో చేరిన వారిని చాలా మందినే చూశాం. అలాంటి కోవకు చెందిన వ్యక్తే ఆర్‌సీ భార్గవ. ఆయన ఐఏఎస్ ఉద్యోగం వదిలి.. మారుతీ సుజుకీ ఇండియా ఛైర్మన్ పదవిని అధిరోహించారు. ఈయన సక్సెస్ స్టోరీ ఇప్పుడు చూద్దాం.
1956లో UPSC పరీక్షలో తన బ్యాచ్‌లోనే టాపర్‌గా నిలిచారు ఆర్‌సీ భార్గవ. ఐఏఎస్ ఆఫీసర్‌గా భారత ప్రభుత్వంలో పలు పదవుల్లో కొనసాగారు. భారత ప్రభుత్వ జాయింట్ సెక్రటరీగా, కేబినెట్ సెక్రటేరియట్‌లో, విద్యుత్ శాఖలో జాయింట్ సెక్రటరీగా ఇలా చాలానే విధులు నిర్వర్తించారు. 1981లో ఐఏఎస్ ఉద్యోగం వదిలి.. మారుతీ సుజుకీ ఇండియాలో చేరారు భార్గవ. కంపెనీ మార్కెటింగ్ విభాగంలో డైరెక్టర్‌గా చేరారు.
అప్పటి నుంచి ఎన్నో హోదాల్లో పనిచేశారు. 2007 నుంచి మారుతీ సుజుకీ ఇండియా ఛైర్మన్‌గా కొనసాగుతున్నారు. ఈయన హయాంలోనే కంపెనీ భారత్‌లోనే అతిపెద్ద ఆటోమొబైల్ తయారీదారుగా నిలిచింది. 2016లో ఆర్‌సీ భార్గవ.. భారత ప్రభుత్వం నుంచి పద్మ భూషణ్ పురస్కారం కూడా అందుకున్నారు.
ఆగస్ట్ 30 నాటికి మారుతీ సుజుకీ ఇండియా కంపెనీ మార్కెట్ విలువ రూ.2,95,000 కోట్లుగా ఉంది. ఇక షేరు విలువ రూ.9790 గా ఉంది. భార్గవ.. అలహాబాద్ విశ్వవిద్యాలయం నుంచి గణిత శాస్త్రంలో మాస్టర్ ఆఫ్ సైన్సెస్ పట్టా పొందారు. తర్వాత అమెరికాలోని విలియమ్స్ కాలేజ్ నుంచి డెవలప్‌మెంటల్ ఎకనామిక్స్‌లో మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ పూర్తి చేశారు. స్కూల్ ఎడ్యుకేషన్ డూన్ స్కూల్‌లో చదివారు.
COMMENTS