RBI Rules: RBI's relief for those who take loans.. Free from excessive charges.. New guidelines!
RBI Rules: లోన్ తీసుకునే వారికి ఆర్‌బీఐ ఊరట.. అడ్డగోలు ఛార్జీల నుంచి విముక్తి.. కొత్త మార్గదర్శకాలు!
RBI Rules: లోన్ తీసుకుని వివిధ కారణాలతో తిరిగి సకాలంలో చెల్లింపులు చేయలేని వారికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారీ ఊరట కల్పించింది. వారిపై బ్యాంకులు విధించే అడ్డగోలు ఛార్జీల నుంచి విముక్తి కల్పించేందుకు చర్యలు చేపట్టింది. ఈ మేరకు కొత్త మార్గదర్శాకలు జారీ చేసింది.
RBI Rules: వ్యాపారం, వ్యక్తిగత అవసరాల కోసం బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థల నుంచి రుణాలు తీసుకుంటారు. అయితే, అందులో చాలా మంది వివిధ కారణాలతో తిరిగి సకాలంలో చెల్లించలేక ఇబ్బందులు పడుతుంటారు. ఇలా బ్యాంకుల వద్ద అప్పులు చేసి ఆ తర్వాత దివాలా తీసి తిరిగి చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్న రుణ గ్రహీతలకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఊరట కల్పించింది. ఈ మేరకు తన పరిధిలో పని చేసే వాణిజ్య బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ సంస్థలు, ఇతర రుణ దాతలు, రెగ్యులేటెడ్ సంస్థలు జరిమానా రూపంలో వసూలు చేసే వడ్డీ విషయంలో సేహతుకంగా, పారదర్శకంగా ఉండాలని సూచించింది. అంటే లోన్ తీసుకున్న వారు సకాలంలో చెల్లించలని సందర్భంలో చాలా బ్యాంకులు నిబంధనలను అడ్డుపెట్టుకుని జరిమానా వడ్డీ రేట్లను సాధారణం కంటే ఎక్కువగా వసూలు చేస్తుంటాయి. ఈ విషయాన్ని గమనించిన రిజర్వ్ బ్యాంక్ కొత్త మార్గదర్శాకలను జారీ చేసింది.
' జరిమానా వడ్డీ లేదా ఆలస్యం పేరుతో విధించే ఛార్జీలు కేవలం లోన్ తీసుకున్న వారిలో క్రమశిక్షణ పెంచడానికే వినియోగించాలి. అంతే కానీ అంటువంటి నిబంధనలను అడ్డుపెట్టుకుని ముందుగా చేసుకున్న ఒప్పందం రేటు కంటే మించి ఆదాయం పెంచుకొనే సాధనాలుగా వాడకూడదు. ఇలా బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు విధించే అధిక వడ్డీ రేట్లు వివాదాలు, ఫిర్యాదులకు కారణమవుతున్నాయి. ' అని తన సర్క్యూలర్ లో పేర్కొంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.
కొత్త మార్గదర్శకాల ప్రకారం.. లోన్ నిబంధనల ప్రకారం సకాలంలో చెల్లించలేకపోతే జరిమానాను ఛార్జీల రూపంలో మాత్రమే విధించాలి. అంతా కానీ, జరిమానా వడ్డీ ఛార్జీలను విధించకూడదు. దీనిని ఆదాయ మార్గంగా బ్యాంకులు మార్చుకోకూడదు. అలాగే ఆయా ఛార్జీలపైనా భవిష్యత్తులోనూ ఎటువంటి వడ్డీ విధించకూడదు. అయితే, ఇది సాధారణ లోన్లపై విధించే చక్రవడ్డీకి వర్తించదు. బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు వడ్డీకి మరే ఇతర అదనపు భారాలను జోడించకూడదు. ఈ కొత్త మార్గదర్శకాల స్ఫూర్తిని అర్తం చేసుకొని పాటించాలని సూచించింది రిజర్వ్ బ్యాంక్. మరోవైరు.. ఆర్‌బీఐ పరిధిలోని బ్యాంకులు, ఇతర సంస్థలు జరిమానా వడ్డీ తదితర ఛార్జీల విధానాలను తయారు చేసి ఆమోదించేందుకు ఓ బోర్డును ఏర్పాటు చేయనున్నారు. ఈ బోర్డు మంజూరు చేసిన లోన్ల రూల్స్ పరిధిలో జరిమానా ఛార్జీలు సహేతుకంగా ఉండేలా చూనుంది. వ్యక్తిగత, వ్యాపారేతర లోన్లపై విధించే అపరాధ రుసుములు వ్యక్తిగతేతర రుణాలపై విధించే పీనల్ ఛార్జీల కంటే తక్కువగా ఉండాలి.
లోన్లు సకాలంలో తిరిగి చెల్లించని సందర్భంలో లోన్ తీసుకున్న వారికి రిమైండర్లు పంపాల్సి ఉంటుంది. చెల్లింపులు చేయకపోతే విధించబోయే పీనల్ ఛార్జీలను ముందుగానే తెలియజేయాలి. అపరాధ రుసుము విధించిన సందర్బం, కారణం కూడా వివరించాలి. ఈ కొత్త మార్గదర్శకాలు, రూల్స్ 2024, జనవరి 1వ తేదీ నుంచి అమలులోకి వస్తాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది.
COMMENTS