Have you linked your ration card with Aadhaar? The deadline is September 30
మీ రేషన్ కార్డును ఆధార్‌తో లింక్ చేశారా..? సెప్టెంబర్ 30 వరకే గడువు
ఈ ఆధార్ కార్డును మనకు ఉన్న అన్ని కార్డులతో లింక్ చేయమని ప్రభుత్వం చెప్తోంది. ఇదో పెద్ద తలనొప్పిగా మారిందని సామాన్య ప్రజలు అనుకుంటున్నారు. మొన్నటి దాకా పాన్ కార్డుతో ఆధార్ లింక్ చేయమని లొల్లి.. ఇప్పుడు రేషన్ కార్డుతో కూడా ఆధార్ లింక్ చేయమంటున్నారు. నిజానికి ఇవి లింక్ చేయమని ఇప్పుడు కాదు.. ఎప్పటి నుంచో మొత్తుకుంటున్నారు. మనకే ఏంట్రా ఒకదాని తర్వాత ఒకటి అని ఇప్పుడు అనిపిస్తుంది. మీ దగ్గర రేషన్ కార్డు ఉంటే సెప్టెంబర్ 30 లోగా ఆధార్‌తో లింక్ చేసేయండి..!
రేషన్ కార్డ్ ఉన్నవారికి అలర్ట్. రేషన్ కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేయడానికి గతంలో జూన్ 30 వరకే గడువు ఉండేది. కానీ కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 30 వరకు గడువు పొడిగించింది. అంత్యోదయ అన్న యోజన, ప్రాధాన్యత గృహ పథకాల ప్రయోజనాలు పొందాలంటే రేషన్ కార్డ్ ఉన్నవారు తప్పనిసరిగా తమ ఆధార్ నెంబర్‌ను లింక్ చేయాల్సి ఉంటుంది. అందుకే ప్రభుత్వం రేషన్ కార్డ్ హోల్డర్స్‌ని తమ ఆధార్ కార్డ్ లింక్ చేయాలని పదేపదే కోరుతోంది. రేషన్ కార్డుతో ఆధార్ కార్డ్ లింక్ చేసినవారు ఉచిత రేషన్ పొందొచ్చు. ప్రతీ నెలా ప్రభుత్వం అందించే రేషన్ సరుకుల్ని ఫ్రీగా పొందొచ్చు.
రేషన్ కార్డుకు ఆధార్ కార్డ్ లింక్ చేయడం ఉచితం. ఆన్‌లైన్‌లో లేదా ఆఫ్‌లైన్‌లో ఈ సర్వీస్ ఉచితంగా పొందొచ్చు. ఒకరి పేరు మీదే రెండుమూడు రేషన్ కార్డులు తీసుకున్నవారు కూడా ఉంటారు. అలాంటి అక్రమాలకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం రేషన్ కార్డుకు ఆధార్ కార్డును లింక్ చేయడం తప్పనిసరి చేసిపడేసింది. అంతేకాదు దీనిద్వారా అనర్హులకు రేషన్ కార్డుల్ని తొలగించే వీలుంటుంది
రేషన్ కార్డుకు ఆధార్ కార్డును లింక్ చేయడానికి సమీపంలోని ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లాలి. లేదా ఆన్‌లైన్‌లో కూడా రేషన్ కార్డుకి ఆధార్ కార్డును లింక్ చేయడానికి ఈ కింది స్టెప్స్ ఫాలో కావాలి.
ఆన్‌లైన్‌లో రేషన్ కార్డుతో ఆధార్ లింక్ చేయడం ఎలా..?
మీ రాష్ట్రానికి చెందిన పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ పోర్టల్ ఓపెన్ చేయాలి. రేషన్ కార్డ్, ఆధార్ కార్డ్ లింక్ చేసే లింక్ పైన క్లిక్ చేయాలి. ఆ తర్వాత మీ రేషన్ కార్డ్ నెంబర్, ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. మీ మొబైల్ నెంబర్‌కు వచ్చే ఓటీపీ ఎంటర్ చేయాలి. ఓటీపీ ఎంటర్ చేస్తే మీ రేషన్ కార్డుకు ఆధార్ కార్డ్ లింక్ అవుతుంది.
ప్రజలకు సబ్సిడీ రేటుకే ఆహారం అందించడానికి ప్రభుత్వం రేషన్ కార్డుల్ని ఇస్తుంటాయి. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద ప్రజలు ప్రభుత్వం నుంచి సబ్సిడీ రేటుకి లేదా ఉచితంగా రేషన్ సరుకుల్ని పొందొచ్చు. రేషన్ కార్డుల్ని ఐడెంటిటీ ప్రూఫ్‌గా సబ్మిట్ చేయొచ్చు.
తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల్ని ఇచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. తొలిసారి డిజిటల్ రేషన్ కార్డుల్ని జారీ చేయబోతోంది. నకిలీ రేషన్ కార్డుల్ని గుర్తించి, అర్హులకు డిజిటల్ రేషన్ కార్డులు ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది
COMMENTS