Ration Card: Enter the names of new members in the ration card like this.. Full details are here..!
Ration Card: రేషన్ కార్డులో కొత్త సభ్యుల పేర్లను ఇలా చేర్చండి.. పూర్తి వివరాలు ఇదిగో..!
Ration Card: రేషన్ కార్డ్ అనేది భారతదేశంలో నివసిస్తున్న దారిద్రరేఖకు దిగువన్న వారికి ముఖ్యమైంది. అయితే దీంట్లో అప్ డేట్స్ చేసుకోకుంటే మాత్రం దక్కాల్సిన సౌకర్యాలు మిస్ చేసుకునే అవకాశం ఉంది. వివాహం చేసుకున్నప్పుడు, అలాగే పిల్లలు పుట్టిన్నప్పుడు కూడా రేషన్ కార్డ్‌లో అప్‌డేట్స్ చేయాల్సి ఉంటుంది. తద్వారా మీరు ఉచిత రేషన్ ప్రయోజనాన్ని పొందడం కొనసాగించే అవకాశం ఉంది. లేకపోతే మీరు చాలా బాధపడాల్సి ఉంటుంది.
కొత్త సభ్యుని పేరు చేర్చడం ఎలా.. మీ ఇంట్లో అబ్బాయికి పెళ్లయిన తరువాత కొత్త సభ్యురాలి పేరును రేషన్ కార్డులో చేర్చాలి. తద్వారా కొత్త సభ్యుని వాటా రేషన్ కూడా కుటుంబానికి చెందుతుంది. అంతే కాకుండా ప్రభుత్వం కల్పిస్తున్న అన్ని సౌకర్యాల ప్రయోజనాన్ని పొందుతారు.
రేషన్ కార్డులో కొత్త సభ్యుల పేరును ఇలా చేర్చండి.. మీరు ఈ లింక్ https://drive.google.com/file/d/1Pbl2GNYQMcNAYN4F1fQ25kTOnCgdF8cA/view ద్వారా ఫారమ్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇది కాకుండా, మీరు రేషన్ షాప్‌ల వద్ద కూడా ఈ ఫారమ్‌ను తీసుకోవచ్చు. దీని తర్వాత, రేషన్ కార్డ్ నంబర్, భర్త / తండ్రి పేరును పూరించాలి. ఆ తరువాత ఫారంలో వార్డు, గ్రామ పంచాయతీ, తహసీల్, జిల్లా వివరాలను పూరించాలి. ఇప్పుడు మీ పూర్తి చిరునామాను పూరించాలి. ఇది కాకుండా, దరఖాస్తు ఫారమ్‌లో రేషన్ దుకాణం పేరు, ఐడీని పూరించాల్సి ఉంటుంది. అలాగే పేరు జోడించాల్సిన సభ్యుని వివరాలను పూరించాలి. ఫారమ్ నింపిన తర్వాత, మీరు మీ సంతకం లేదా బొటనవేలు ముద్రను వేయాలి. ఇప్పుడు మీరు అవసరమైన అన్ని పత్రాలను జతచేయాలి. ఈ ఫారమ్‌ను ఫుడ్ కార్పోరేషన్‌కు అందించాలి. లేదా రేషన్ షాప్‌లోనూ అందివ్వొచ్చు. సమర్పించిన తర్వాత, మీరు తప్పనిసరిగా రసీదు తీసుకోవాలి.
ఈ మొత్తం ప్రక్రియ తర్వాత, ఫుడ్ డిపార్ట్‌మెంట్ మీ దరఖాస్తును పరిశీలిస్తుంది. అన్ని వివరాలు సరిగ్గా ఉంటే, కొత్త సభ్యుల పేరు రేషన్ కార్డులో చేర్చేందుకు వీలు కల్పిస్తారు. రేషన్ కార్డులో పేరు రాగానే వచ్చేనెల నుంచి వారి వాటాకు కూడా రేషన్ అందుతుంది.
ఈ పత్రాలు అవసరం.. మీరు దరఖాస్తుదారు / యజమాని పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో ఇవ్వాలి. ఇది కాకుండా, మీరు నివాస ధృవీకరణ పత్రం కోసం విద్యుత్ బిల్లు, నీటి బిల్లు, ఓటర్ ఐడీ ఇవ్వవచ్చు. దీంతోపాటు కొత్తగా పెళ్లయిన మహిళ, తన తండ్రి రేషన్‌కార్డులో పేరు తొలగించిన సర్టిఫికెట్, వివాహ నమోదు ధ్రువీకరణ పత్రాన్ని కూడా ఇవ్వాల్సి ఉంటుంది.
COMMENTS