Smart Phone: Putting currency notes behind the phone pouch? Lives will be lost.. because..
Smart Phone: ఫోన్ పౌచ్ వెనుక కరెన్సీ నోట్లు పెడుతున్నారా? ప్రాణాలు పోతాయ్.. ఎందుకంటే..
ఈ కాలంలోనూ మొబైల్ యూజ్ చేయకుండా ఉండేవారు ఎంతమంది అంటే.. వేళ్లపై లెక్కపెట్టి చెప్పొచ్చు. ఎందుకంటే.. నేటి టెక్ యుగంలో నెలల పిల్లల నుంచి పండు ముసలి వాళ్ల వరకు ఫోన్‌ను రఫ్పాడించేస్తున్నారు. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు స్మార్ట్ ఫోన్‌ను వినియోగిస్తూనే ఉంటారు. చాలా మందికి ఫోన్ లేకపోతే.. సమస్తం కోల్పోయినట్లుగా ఫీలవుతారు. ఫోన్ ఉంటే చాలు.. తమకు ఏదీ అవసరం లేదు అనేవాళ్లు కూడా ఉన్నారు. ఇక టెక్నాలజీ డెవలప్ అవుతున్నా కొద్ది.. అన్ని పనులు ఒక్క సెల్ ఫోన్‌తోనే చేసేయానికి వీలుపడుతుంది. షాపింగ్ అయినా.. ఈటింగ్ అయినాన.. బిల్ పేమెంట్స్ అయినా.. ఒక్కటేంటి, అన్ని పనులు మొబైల్‌లో ఒక్క క్లిక్‌తో అయిపోతున్నాయి. అయితే, మన దేశంలో మొబైల్ వినియోగదారులు తమ ఫోన్లు సేఫ్‌గా ఉండేందుకు తప్పకుండా పౌచ్‌ను వాడుతుంటారు. ఫోన్‌కు పౌచ్, టాంపర్ గ్లాస్ సహా అవసరమైన ప్రొటెక్షన్స్ తీసుకుంటారు.
అయితే, కొందరు మాత్రం ఈ సేఫ్టీ పౌచ్‌ను కూడా పర్స్ మాదిరిగా యూజ్ చేస్తారు. అవును, చాలా మంది ఫోన్ కవర్ వెనుక భాగంలో కరెన్సీ నోట్లు గానీ, కాయిన్స్ గానీ పెడుతుంటారు. పౌచ్‌లో వీటిని దాచి ఉంచడం వలన అవి సేఫ్‌గా ఉంటాయని భావిస్తారు. అలాగే, అత్యవసర సమయంలోనూ ఈ డబ్బు పనికొస్తుందని అనుకుంటారు. కానీ, ఇలా చేయడం వల్ల చాలా ప్రమాదం అని చెబుతున్నారు నిపుణులు. ఒక్కోసారి ప్రాణాలు కూడా పోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. మరి ఫోన్ వెనుక కవర్‌లో నోట్‌ను ఉంచడం ఎంత ప్రమాదకరమో ఇప్పుడు తెలుసుకుందాం..
ఉష్ణోగ్రత తగ్గదు..
ఫోన్‌ను ఉపయోగించినప్పుడు.. అది వేడిగా మారుతుంది. ఎక్కువగా వెనుక భాగంలో వేడి ఎక్కుతుంది. అలాంటి పరిస్థితిలో ఫోన్ బ్యాక్ కవర్‌లో ఏదైనా పేపర్ గానీ, కరెన్సీ నోట్లు గానీ ఉంచినట్లయితే.. ఫోన్ వేడిని విడుదల చేయదు. అంటే, గాలి తాకక.. ఉష్ణోగ్రత తగ్గదు. ఫలితంగా ఫోన్ పేలిపోయే ప్రమాదం కూడా ఉంది. అందుకే ఫోన్‌కు బిగుతుగా ఉండే బ్యాక్ కవర్ గానీ, ఆ బ్యాక్ కవర్‌లో కరెన్సీ నోట్లు పెట్టకూడదని నిపుణులు చెబుతున్నారు.
నోట్ల రసాయనాలు కూడా ప్రాణాంతకం..
కరెన్సీ నోట్లను కాగితంతో తయారు చేస్తారు. ఇందుకోసం అనేక రకాల రసాయనాలను కూడా ఉపయోగిస్తారు. అలాంటి పరిస్థితిలో ఫోన్ వేడెక్కినప్పుడు, ఆ కరెన్సీ నోటు కారణంగా వేడి బయటకు వెల్లదు. ఇక ఆ వేడి కారణంగా కరెన్సీ నోటుకు మంట కూడా జనించే అవకాశం ఉంది. కరెన్సీ నోటు తయారీ కోసం వినియోగించిన రసాయనం.. ఆ మంటను మరింత పెంచుతుంది. అందుకే పొరపాటున కూడా ఫోన్ కవర్ వెనుక భాగంలో కరెన్సీ నోటును పెట్టుకోవద్దని సూచిస్తున్నారు నిపుణులు.
COMMENTS