The key announcement of the giant government bank.. definitely it should be updated.. August 31 last!
ప్రభుత్వ దిగ్గజ బ్యాంక్ కీలక ప్రకటన.. కచ్చితంగా అది అప్‌డేట్ చేసుకోవాల్సిందే.. ఆగస్ట్ 31 లాస్ట్!
Bank News: ప్రభుత్వ దిగ్గజ బ్యాంక్ ఒకటి కీలక ప్రకటన చేసింది. ఇప్పటివరకు ఇ-కేవైసీ పెండింగ్‌లో ఉన్న కస్టమర్లు త్వరగా అది అప్‌డేట్ చేసుకోవాలని స్పష్టం చేసింది. ఇందుకు ఆగస్ట్ 31 లాస్ట్ డేట్‌గా పేర్కొంది. ఇప్పటికే సదరు కస్టమర్లకు అడ్రస్‌కు, ఫోన్‌కు ఈ సమాచారం అందించినట్లు వెల్లడించింది.
Bank Customers: దిగ్గజ ప్రభుత్వ బ్యాంక్.. పంజాబ్ నేషనల్ బ్యాంక్ తన కస్టమర్లకు కీలక ప్రకటన జారీ చేసింది. నో యువర్ కస్టమర్ (know Your Customer) - ఇకేవైసీ (eKyc) అప్‌డేట్ చేసుకోవాలని పేర్కొంది. 2023, ఆగస్ట్ 31లోగా ఇది పూర్తి చేయాలని వెల్లడించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాల ప్రకారం ఇది తప్పనిసరిగా చేయాలని కోరింది. ఇప్పటికే ఇ-కేవైసీ పూర్తి చేసుకోని బ్యాంక్ కస్టమర్లకు .. బ్యాంక్ వారివారి అడ్రస్‌కు అదే విధంగా ఫోన్‌లో మెసేజ్ నోటిఫికేషన్ల ద్వారా నోటీసులు పంపినట్లు తెలిపింది.
ఈ మేరకు పీఎన్‌బీ బ్యాంక్ ఆగస్ట్ 2న ఒక ప్రకటనలో వివరించింది. ఇంకా బ్యాంక్ సోషల్ మీడియా పేజీల్లోనూ, అదే విధంగా వార్తాపత్రికల్లోనూ ఇది వచ్చినట్లు తెలిపింది. PNB ONE/IBS/registered e – mail/post ల్లో లేదా బ్యాంకును నేరుగా సంప్రదించి ఇ-కేవైసీ అప్‌డేట్ చేసుకోవచ్చని వివరించింది. ఒకవేళ ఇది అప్‌డేట్ చేసుకోకుంటే.. అకౌంట్ నిర్వహణలో ఇబ్బందులు తలెత్తవచ్చని తెలిపింది.
ఇక మరోవైపు పంజాబ్ నేషనల్ బ్యాంక్.. తాజాగా తన ఎంసీఎల్‌ఆర్ రేట్ల గురించి కూడా కీలక ప్రకటన చేసింది. ప్రస్తుతానికి ఈ రుణ ఆధారిత వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచుతున్నట్లు ప్రకటించింది. PNB వెబ్‌సైట్ ప్రకారం.. ఇప్పుడు ఓవర్‌నైట్ MCLR రేటు 8.10 శాతంగా ఉంది. ఇక ఒక నెల ఎంసీఎల్‌ఆర్ రేటు 8.20 శాతం, అదే విధంగా 3 నెలల ఎంసీఎల్‌ఆర్ 8.30 శాతం, 6 నెలల MCLR 8.50 శాతంగా ఉన్నాయి.
COMMENTS