PM Kisan FPO Scheme: Good news of Modi Sarkar.. Rs. 15 lakhs for farmers through this scheme.. directly in the account!
PM Kisan FPO Scheme: మోడీ సర్కార్ గుడ్‌న్యూస్.. ఈ పథకం ద్వారా రైతులకు రూ.15 లక్షలు.. నేరుగా ఖాతాలోకే!
మోడీ సర్కార్ రైతుల కోసం ఎన్నో పథఖాలను అమలు చేస్తోంది. ఆర్థికంగా ఎదిగేందుకు వివిధ రకాల పథకాలను రూపొందిస్తూ ఆసరాగా నిలుస్తున్నారు. ఇప్పటికే పీఎం కిసాన్ పథకంలో లబ్ది పొందుతున్న రైతులకు మరో పథకాన్ని అమలు చేస్తోంది కేంద్రం. రైతులకు ఏకంగా రూ.15 లక్షలు అందనున్నాయి. రైతుల ఆదాయన్ని రెట్టింపు చేసేందుకు ప్రభుత్వం పలు పథకాలను అమలు చేస్తోంది. పీఎం కిసాన్ ఎఫ్‌పీవో (PM Kisan FPO) పథకం కింద కేంద్ర ప్రభుత్వం వ్యవసాయానికి సంబంధించి వ్యాపారాన్ని ప్రారంభించేందుకు ఈ పథకం రూపొందించింది కేంద్రం. ఈ వ్యాపారం కోసం రైతులకు రూ.15 లక్షల ఆర్థిక సహాయం అందిస్తుంది. అయితే, దీని కోసం రైతులు కనీసం 11 మంది రైతులను కలిగి ఒక గ్రూప్‌గా ఏర్పడాల్సి వస్తుంది. ఇందులో చేరి వ్యాపారాన్ని చేయాల్సి ఉంటుంది. ఇందులో ఎరువులు, విత్తనాలు, రసాయనాలు, వ్యవసాయ యంత్రాలు వంటి నిత్యావసర వస్తువులను సరసమైన ధరలకు కొనుగోలు చేయడానికి ప్రభుత్వం రైతులకు సహాయం చేస్తుంది. ఈ పథకం కింద 2023-24 నాటికి 1,000 గ్రూపులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు ఈ స్కీమ్:
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ పథకం ముఖ్య ఉద్దేశం రైతుల ఆదాయన్ని రెట్టింపు చేయడమే. ఈ పథకం కింద బ్యాంకుల నుంచి తక్కువ ధరలకు రుణాలను పొందగలుగుతారు. రైతులను ఆర్థికంగా ఆదుకునేందుకు మోడీ ప్రభుత్వం ‘పీఎం కిసాన్ ఎఫ్‌పీఓ యోజన’ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద రైతు ఉత్పత్తిదారుల సంస్థకు రూ.15 లక్షలు అందజేస్తారు. కొత్త వ్యవసాయ వ్యాపారాన్ని ప్రారంభించడానికి దేశవ్యాప్తంగా రైతులకు ఆర్థిక సహాయం అందించనుంది.
దరఖాస్తు చేసుకోవడం ఎలా..?
- ముందుగా నేషనల్ అగ్రికల్చర్ మార్కెటింగ్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి.
- హోమ్ పేజీలో FPO ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
- ఇక్కడ ‘రిజిస్ట్రేషన్’ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. తర్వాత ఓ ఫారం ఓపెన్ అవుతుంది.
- ఫారమ్‌లో కోరిన పూర్తి సమాచారాన్ని జాగ్రత్తగా నమోదు చేయాలి.
- ఆ తర్వాత పాస్‌బుక్ లేదా క్యాన్సిల్ చెక్ లేదా IDని స్కాన్ చేసి అప్‌లోడ్ చేయాలి.
- చివరగా సబ్మిట్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
కావాల్సిన పత్రాలు..
రైతులు స్థాపించిన సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ లేదా చీఫ్ ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్ లేదా మేనేజర్ రిజిస్ట్రేషన్ సమయంలో పేరు, అడ్రస్, ఇమెయిల్ ఐడీ ఇవ్వాల్సి ఉంటుంది. రైతుల ఆధార్ కార్డ్ , అడ్రస్ ప్రూప్, వ్యవసాయ భూములకు సంబంధించిన పత్రాలు, రేషన్ కార్డ్, ఐ సర్టిఫికెట్, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు, బ్యాంక్ స్టేట్‌మెంట్ వంటివి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అయితే దరఖాస్తులు పరిశీలించిన తర్వాత వారికి నిధులు మంజూరవుతాయి.
COMMENTS