PhonePe: PhonePe new app.. Finally green signal from SEBI.. Good news for them!
PhonePe: ఫోన్‌పే కొత్త యాప్.. సెబీ నుంచి ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్.. వారికి గుడ్‌న్యూస్!
PhonePe Share.Market App: దిగ్గజ ఫిన్‌టెక్ యాప్ ఫోన్‌పే గుడ్ న్యూస్ చెప్పింది. సరికొత్త యాప్ లాంఛ్ చేసింది. స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు ఇది శుభవార్త అని చెప్పొచ్చు. ఎన్నాళ్లుగానో స్టాక్ మార్కెట్ బిజినెస్‌లోకి రావాలని చూస్తుంటే ఎట్టకేలకు ఇప్పుడు సెబీ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది.
PhonePe Enters Stock Broking Business: ప్రముఖ డిజిటల్ పేమెంట్స్ యాప్, వాల్‌మార్ట్ బ్యాక్డ్ ఫిన్‌టెక్ దిగ్గజం ఫోన్‌పే కొత్త యాఫ్ లాంఛ్ చేసింది. దీంతో స్టాక్ మార్కెట్ బిజినెస్‌లోకి అడుగుపెట్టింది. మార్కెట్లలో పెట్టుబడులు పెట్టాలనుకునే మదుపరులకు ఇది సాయపడుతుందని తెలిపింది కంపెనీ. ఇప్పటివరకు కేవలం యూపీఐ లావాదేవీలకు మాత్రమే పరిమితమైన ఈ సంస్థ.. ఇకపై స్టాక్ మార్కెట్ సెగ్మెంట్‌లో కూడా రాణించాలని లక్ష్యంగా పెట్టుకుంది. స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ల కోసమే ఇప్పుడు ప్రత్యేకంగా యాప్‌ను రూపొందించింది ఫోన్‌పే. షేర్.మార్కెట్ (Share.Market) పేరుతో కొత్త యాప్ తీసుకొచ్చింది. దీని ద్వారా స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్ సహా ఈటీఎఫ్‌లు (ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్) వంటి సేవలు అందించనుంది.
ఇప్పటికే బీమా పాలసీలు అందిస్తుండటంతో పాటు మ్యూచువల్ ఫండ్లలో కూడా పెట్టుబడి పెట్టేందుకు వినియోగదారులకు వేదికగా ఉంది ఫోన్‌పే. స్టాక్ మార్కెట్ వ్యాపారాల్లోకి కూడా అడుగుపెట్టాలని ఎప్పటి నుంచో ఎదురుచూస్తుండగా.. మార్కెట్ నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) నుంచి తాజాగా గ్రీన్ సిగ్నల్ లభించిందని.. అందుకే వెంటనే యాప్ తీసుకొచ్చినట్లు పేర్కొంది ఫోన్‌పే.
''మేం రుణాలు, బీమా, చెల్లింపు బిజినెస్‌లను ఇప్పటికే తీసుకొచ్చాం. నాలుగేళ్ల కిందటే మ్యూచువల్ ఫండ్ రంగంలోకి అడుగుపెట్టాం. ఇప్పుడు స్టాక్ బ్రోకింగ్ బిజినెస్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాం. ఫోన్‌పే వెల్త్ కింద షేర్.మార్కెట్ యాప్ తీసుకొస్తున్నాం.'' అని అన్నారు ఫోన్‌పే ఫౌండర్, సీఈఓ సమీర్ నిగమ్.
2022లో ఫోన్‌పే రెండు వెల్త్‌టెక్ ప్లాట్‌ఫామ్స్ లాంఛ్ చేసింది. అవే వెల్త్‌డెస్క్, ఓపెన్‌క్యూ. వీటి విలువ 70 మిలియన్ డాలర్లకుపైనే ఉంటుంది. పేమెంట్లకు అదనంగా ఫైనాన్షియల్ సర్వీసెస్ విస్తరణలో భాగంగా ఈ కొనుగోళ్లు చేసింది ఫోన్‌పే. ఇందులో భాగంగానే బీమా, మ్యూచువల్ ఫండ్స్ సహా స్టాక్ మార్కెట్ వ్యాపారాల్లోకి ప్రవేశించడం అని అర్థం చేసుకోవచ్చు.
COMMENTS