How to merge different PF passbooks..? What is the loss if not done?
వేర్వేరు పీఎఫ్ పాస్‌బుక్స్‌ను విలీనం చేయడం ఎలా..? చేయకపోతే వచ్చే నష్టమేంటి..?
ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరికికి పీఎఫ్ ఖాతా ఉంటుంది. మనం కొత్త కొత్త ఆఫర్లను, అవసరాలను దృష్టిలో ఉంచుకోని కంపెనీలు మారతాం.. కంపెనీ మారిన ప్రతిసారి పీఎఫ్ ఖాతా మారదు. అదే నెంబర్ ఇస్తాం. కానీ అందులో పాస్‌బుక్‌లు క్రియేట్ అవుతాయి. ఎన్ని కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తే అన్నీ పాస్‌బుక్స్ ఉంటాయి. అలా ఒక్కో బుక్‌లో కొంత కొంత అమౌంట్ ఉంటుంది.చాలామంది ఆ అమౌంట్ మొత్తాన్ని ఇప్పుడు మీరు ఏ కంపెనీలో అయితే ఉద్యోగం చేస్తున్నారో ఆ కంపెనీ పాస్‌బుక్‌లో వేసుకుందాం అనుకుంటారు. కానీ అది మనకు రాదు. తెలిసీతెలియక ఏదో ఒకటి క్లిక్ చేస్తే అకౌంట్ మొత్తానికే సస్పెండ్ అవుతుందన్న భయం. ఇది చాలా చిన్న పని అనీ మీకు కూడా తెలుసు. అందుకు మళ్లీ నెట్ సెంటర్లు చుట్టూ తిరిగితే పైసల్ వేస్టే.. ఈరోజు మనం వేర్వేరు పీఎఫ్ ఖాతాలను విలీనం చేయడం ఎలానో చూద్దాం! అలాగే ఒకటి కంటే ఎక్కువ ఖాతాల వల్ల ఉండే ఇబ్బందులేంటో చూద్దాం..
ఓ వ్యక్తి వేర్వేరు సంస్థల్లో పనిచేసినప్పటికీ వారికి ఒకటే యూఏఎన్ (UAN) ఉంటుంది. యూఏఎన్ అంటే యూనివర్సల్ అకౌంట్ నంబర్. ఈపీఎఫ్ ఖాతా ఉన్న ప్రతి ఒక్కరికీ ఒక యూఏఎన్ కేటాయిస్తారు. ఉద్యోగం మారిన ప్రతిసారీ ఈ యూఏఎన్ నంబర్ కిందే ఆయా సంస్థలు వేర్వేరు ఖాతాలను తెరుస్తాయి. అయితే, ఈపీఎఫ్ నియమాల ప్రకారం ఒక వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ యూఎన్ నంబర్లు ఉండకూడదు. ఒకవేళ అలా ఉన్నా ఎలాంటి పెనాల్టీలూ విధించరు. వేరే సంస్థలో ఉద్యోగంలో చేరితే పాత యూఏఎన్ నంబర్‌నే ఇవ్వాలని ఈపీఎఫ్‌ఓ సూచిస్తోంది.
ఇక పీఎఫ్ ఖాతాల విషయానికొస్తే ఉద్యోగం మారిన ప్రతిసారీ ఒక్కో అకౌంట్ క్రియేట్ అవుతుంది. వీటిని అలానే వేర్వేరుగా వదిలేయడం వల్ల కొన్ని ప్రయోజనాలు కోల్పోవడంతో పాటు పన్ను సైతం ఎదుర్కోవాల్సి ఉంటుంది. వరుసగా మూడేళ్ల పాటు ఒక పీఎఫ్ ఖాతాలో డబ్బు జమ కాకుంటే ఆ ఖాతాలోని డబ్బుపై ఎటువంటి వడ్డీని ఈపీఎఫ్‌ఓ జమ చేయదు. సాధారణంగా పీఎఫ్ ఖాతా ఐదేళ్లు దాటితే అందులోని విత్‌డ్రాలపై ఎలాంటి పన్నూ ఉండదు. ఐదేళ్ల కంటే తక్కువ ఉంటే విత్ డ్రా సమయంలో 10 శాతం టీడీఎస్ కట్ అవుతుంది. ఆ ఖాతాలో రూ.50వేలు కంటే తక్కువ ఉంటే ఈ నియమం వర్తించదు. అందుకే ఖాతాలు విలీనం చేసుకోవడం మంచిది.
విలీనం ఎలా చేయాలంటే..
- ముందు EPFO వెబ్‌సైట్‌కి వెళ్లాలి.
- సర్వీసెస్ విభాగంలో ‘వన్ ఎంప్లాయీ- వన్ ఈపీఎఫ్ అకౌంట్’ ఆప్షన్ ఎంచుకోవాలి
- మెంబర్ ఇ-సేవా పోర్టల్‌లోకి లాగిన్ అయ్యాక మీ వ్యక్తిగత వివరాలు కనిపిస్తాయి.
- ఆ తర్వాత పాత ఖాతా నంబర్ల విలీనం కోసం రిక్వెస్ట్ పంపించాల్సి ఉంటుంది.
- ఇందుకోసం మొబైల్ నంబర్, ప్రస్తుతం యూఏఎన్, మెంబర్ ఐడీని సమర్పించండి
- మీ రిక్వెస్ట్ ప్రస్తుత సంస్థ ఆమోదం తెలిపాక ఈపీఎఫ్‌ఓ మీ వివరాలన్నిటినీ పరిశీలించి అకౌంట్ విలీన ప్రక్రియ మొదలుపెడుతుంది.
- ఒకవేళ వేర్వేరు UAN నంబర్లపై వేర్వేరు ఖాతాలు విలీనం చేయాలంటే ఈపీఎఫ్‌ఓకు మెయిల్ చేయాల్సి ఉంటుంది.
COMMENTS