Military Village in AP: In that village, since four generations, the youth have been in the service of the country. Every house has army employees.
Military Village in AP: ఆ గ్రామంలో నాలుగు తరాల నుంచి దేశ సేవలోనే యువత.. ప్రతి ఇంట్లోనూ ఆర్మీ ఉద్యోగులే..
గ్రామంలో ఒకరో ఇద్దరో మిలటరీ కి వెళితేనే ఆ ఊరికి చెయ్యెత్తి జైకొడతాము.. అలాంటిది ఇక్కడ ఒకరిద్దరు కాదు ఊరు ఊరంతా మిలటరీలో ఉంది ఇంటికి ఒకరిద్దరు మిలటరీలో పనిచేస్తున్నారు. దేశ భక్తికి నిలువెత్తు నిదర్శనమే ఈ ఊరు .. ఆ ఊరి పేరు రామాపురం కాని ఈ ఊరిని అందరూ మిలటరీ రామాపురంగా పిలుస్తారు.
కడప జిల్లా కలసపాడు మండలం యగువ రామాపురం అదే మిలటరీ రామాపురం గ్రామంలో 350 కుటుంబాలు పైన నివాసం ఉంటున్నాయి అలానే ప్రతి కుటుంబం నుంచి ఒకరు సైనికునిగా మన దేశ రక్షణలో పాలు పంచుకుంటున్నారు. 1989 నుంచి దేశ రక్షణ కోసంఅ గ్రామం నుంచి సైనికులుగా వెళుతున్నారు, ఇప్పటికీ చాలా మంది రిటైర్డ్ అయ్యారు, అయినా ఇప్పుడున్నయువత వారిని ఆదర్శంగా తీసుకుని మీకు ఏమాత్రం మేము తీసిపోము అంటూ దేశ రక్షణ కోసం మిలటరీ లోకి వెళ్లేందుకు సిద్ధమై వెళుతున్నారంటే ఆ ఊరిలో ప్రతి వారి నరంలో దైవ భక్తి కన్నా దేశ భక్తి ఏవిధందా ఉందో అర్దం చేసుకోవచ్చు. ముంబై తాజ్ హోటల్ లో ఉగ్రవాదుల దాడి ఘటనలో వారిని ఎదుర్కునేందుకు మా గ్రామానికి చెందిన ఇరువురు మిలిటరీ సిబ్బంది పాల్గొన్నారు. కడప జిల్లాలోనే దేశ రక్షణలో ఎక్కువమంది పాలుపలుచుకుంటున్న గ్రామం
350 మంది సైనికులను అందించిన మిలటరీ రామాపురం
దశాబ్దాల కాలంగా ఈ ఆనవాయితీని కొనసాగిస్తున్న ఆ ఊరు కడప జిల్లాలో ఉండటం ఎంతో గర్వకారణంగా చెబుతున్నారు ఆ ఊరి ప్రజలు. ఇక్కడ వారు అంతా అరకొరగా అక్షరం తెలిసినవారే నిత్యం వ్యవసాయ పొలంలో రోజంతా కష్టపడి చెమట చుక్కలతో బిజీ బిజీగా గడుపుతుంటారు. అయితే షేక్ అబ్దుల్ నబి అనే వ్యక్తి ఆకలి బాధ నుంచి అతని కుటుంబాన్ని కాపాడుకునేందుకు ఆర్మీ వైపు అడుగులు వేశాడు. ఆ అడుగులు ఒక్కొక్కటిగా కలిసి నేడు 350 మంది సైన్యంలో చేరి వివిధ రెజ్మెంట్లో విధులు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ఆ పల్లెను సైనిక రామాపురం అంటే టక్కున గుర్తుపడతారు. ఎందుకంటే సైన్యంతో ఆ గ్రామానికి అనుబంధం అలాంటిది. గ్రామంలో ఒకరు ఇద్దరు సైన్యంలో పనిచేసిన వారు ఉంటారేమో కానీ ఇక్కడ ఒక్కరు కాదు ఇద్దరు కాదు దేశానికి 350 మంది సైనికుల్ని అందజేసింది ఈ గ్రామం మిలటరీ రామాపురం.
నేటి యువత సాఫ్ట్ వేర్ లో పరుగులు తీస్తూ , ఫ్రీడం కోసం ఆరాటపడుతుంటే ఆ గ్రామ యువకులు మాత్రం దేశ రక్షణ కోసం క్యూ కడుతున్నారు. దేశ రక్షణ కోసం సైన్యంలో చేరాలని రామాపురం గ్రామ యువకులు ఊవిళ్ళూరుతున్నారు. అంతలా దేశభక్తి ఆ గ్రామస్తుల నర నరాన జీర్ణించుకుపోయింది. నాలుగు తరాల నుంచి దేశ సేవలో ఆ గ్రామం పెద్ద సంఖ్యలో ఆర్మీ ఉద్యోగాల కోసం యువత శిక్షణ పొందుతున్నారు. వివిధ పోటీలో నిలదొక్కుకునేందుకు మాజీ సైనికులు శిక్షణ ఇస్తూ సైన్యంలో చేరేందుకు తోడ్పాటు ఇస్తున్నారు. సైన్యంలో పనిచేసేందుకు ఆ గ్రామ యువకులు కూడా పరుగులుపెడుతూ గర్వంగా ఫీలవుతున్నారు.
జెండా పండుగలు చేయడమే దేశభక్తి కాదు.. దేశం కోసం బోర్డర్ కు వెళ్ళి పహారాకాయడం. ఆదేశ భక్తిలో ముందుంది రామాపురం.. అదే మిలటరీ రామాపురం.
COMMENTS